బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు | Do not buy vegetables from Muslims BJP MLA | Sakshi
Sakshi News home page

‘ముస్లింల వద్ద కూరగాయలు కొనకండి’

Published Tue, Apr 28 2020 12:38 PM | Last Updated on Tue, Apr 28 2020 2:48 PM

Do not buy vegetables from Muslims BJP MLA - Sakshi

లక్నో : దేశమంతా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వేళ  బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సురేష్‌ తివారి మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలెవ్వరూ కూడా ముస్లింల వద్ద కురగాయాలు, ఎలాంటి వస్తువలు గానీ కొనుగోలు చేయవద్దని అన్నారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తించడానికి కారణం కూడా ముస్లింలేనని ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలే కారణమని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. (లాక్‌డౌన్‌: రోడ్డుపై బైఠాయించిన ఎంపీ)

సురేష్‌ తివారి వ్యాఖ్యలపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే మత వివక్ష చూపడం సరికాదని, ఆయన వ్యాఖ్యలను ఖండించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే దేశ ద్రోహ కేసు నమోదు చేయాలని ఎస్పీ అధికార ప్రతినిధి అనురాగ్‌ బంధుప్రియా డిమాండ్‌ చేశారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement