
లక్నో: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విటర్‌లో వెల్లడించారు. ‘గత రెండు రోజులుగా ఆరోగ్యంగా సరిగా లేకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇటీవల నాతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
ఆయన సోమవారం కౌశాంబిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నానని ప్రస్తుతం తన ఆరోగ్యంగా స్థిరంగా ఉందని మహేంద్ర నాథ్ పాండే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment