మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె మరోసారి వార్తల్లోనిలిచారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. తాను 2022 ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శనివారం ప్రకటించారు. తద్వారా తన కుమార్తె సారా డ్యూటెర్టె దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గాన్ని క్లియర్ చేస్తున్నాడనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు.
తాను వైస్ ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడినన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పోటీనుంచి, రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది తన కుమార్తె పోటీకి మార్గం సుగమం చేశారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రోడ్రిగో విధేయుడు, సెనేటర్ క్రిస్టోఫర్ "బోంగ్" వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయనుండటం విశషం.
కాగా 2022 ఎన్నికలకు గాను రోడ్రిగో డుటెర్టె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఆరేళ్లు కాలపరిమితిని పూర్తిచేసుకున్న ఆయన, టాప్ పొజిషన్ కోసం మళ్లీ పోటీ చేయడానికి అర్హుడు కాదు. అయితే సారా డ్యూటెర్టేకు లైన్ క్లియర్ చేసేందుకే ఆయన రేసునుంచి తప్పుకున్నారని న్యాయ, రాజకీయాల ప్రొఫెసర్ ఆంటోనియో లా వినా అన్నారు. ఈ ఫైర్ బ్రాండ్ మళ్లీ మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment