
బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం సీతారామపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఎస్‌వీఎస్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.
మణుగూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని 25మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.