
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో లంబాడీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు వీసీ ఛాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
కాగా ఆదివాసీలు, లంబాడీలు శుక్రవారం పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే.ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment