
కొత్తగూడెం: రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన బంజారా జేఏసీ నాయకులు, కార్యకర్తలు గురువారం లక్ష్మీదేవిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝాకు వినతిపత్రాలు అందజేశారు. అన్నదమ్ముల్లా కలసి ఉన్న లంబాడీలు, కోయలు, గోండుల మధ్య గొడవలు లేపుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని లంబాడీ నాయకులు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment