ryaly
-
మీ గూండాలే.. కాదు మీ వాళ్లే
సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసపై అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. దాడికి కారకులు మీరంటే మీరేనంటూ ఇరు పార్టీలూ పరస్పరారోపణలు చేసుకుంటున్నాయి. బెంగాల్లో ఏం జరుగుతున్నా ఎన్నికల సంఘం (ఈసీ) మౌనం వహించి, చూస్తూ ఉంటోంది తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఇరు పార్టీలూ బుధవారం ఆరోపించాయి. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈసీకి పరస్పరం ఫిర్యాదు చేశాయి. తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది టీఎంసీ కార్యకర్తలేనని అమిత్ షా ఆరోపించగా, బీజేపీ కార్యకర్తలు కళాశాల గోడలు దూకి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోలను టీఎంసీ విడుదల చేసింది. హింసకు మమతదే బాధ్యత: అమిత్ షా కోల్‌కతాలో తన ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు టీఎంసీ గూండాల పనేనని అమిత్ షా ఆరోపించారు. అమిత్ బుధవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తూ దాడులకు తెగబడుతున్నారని, అక్రమంగా పోలింగ్ బూత్‌లలోకి చొరబడుతూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. తత్వవేత్త ఈశ్వర్ చంద్ర విగ్రహాన్ని కూడా టీఎంసీ కార్యకర్తలే ధ్వజం చేశారని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంత హింసను వ్యాప్తి చేసినా ఎన్నికల్లో గెలవబోదనీ, ఎంత బురదజల్లినా అందులోంచి కమలం తప్పక వికసిస్తుందని షా వ్యాఖ్యానించారు. ‘సేవ్ బెంగాల్.. సేవ్ డెమోక్రసీ’ పేరుతో బీజేపీ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈసీకి ఆధారాలు సమర్పించిన టీఎంసీ విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది బీజేపీ కార్యకర్తలే అన్న తమ ఆరోపణలకు ఆధారాలను ఈసీకి టీఎంసీ బుధవారం సమర్పించింది. టీఎంసీ నేతలు డెరెక్ ఒబ్రెయిన్, సుఖేందు శేఖర్ రే, మనీశ్ గుప్తా, నదీముల్ హాక్‌ల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. అంతకుముందు ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ ‘కోల్‌కతా వీధులను విస్మయం, ఆగ్రహం ఆవహించింది. మంగళవారం జరిగిన ఘటన బెంగాలీల గౌరవాన్ని దెబ్బతీసింది. అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింసకు సంబంధించిన 44 వీడియోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పారు. -
లంబాడీల ‘ఆత్మగౌరవ ర్యాలీ’
కొత్తగూడెం: రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన బంజారా జేఏసీ నాయకులు, కార్యకర్తలు గురువారం లక్ష్మీదేవిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝాకు వినతిపత్రాలు అందజేశారు. అన్నదమ్ముల్లా కలసి ఉన్న లంబాడీలు, కోయలు, గోండుల మధ్య గొడవలు లేపుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని లంబాడీ నాయకులు వ్యాఖ్యానించారు. -
తీరంలో సమరం
నరసాపురం : భవిష్యత్ తరాల ఉనికిని ప్రశ్నార్థకం చేసే గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహారదీక్షలు పూర్తిస్థాయిలో విజయవంతమయ్యాయి. రెండో రోజు శుక్రవారం కూడా అదే స్ఫూర్తితో ప్రజలు రణనినాదం చేశారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, మొగల్తూరు మండలాల్లోని 40 గ్రామాల ప్రజలు దీక్షల్లో కూర్చున్నారు. మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా ఇళ్లు వదిలి, బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల పోరాటానికి వెన్నుదన్నుగా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో రెండోరోజు కూడా భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ సాగింది. దీంతో తీరప్రాంతంలో సమరభేరి మోగింది. వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాలను సందర్శిస్తూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తుది వరకూ పోరాడతామని చెప్పారు. భారీ ర్యాలీగా.. నరసాపురం మండలం కొప్పర్రు గ్రామానికి ముదునూరి ప్రసాదరాజు భారీ మోటార్‌సైకిల్ ర్యాలీతో వచ్చారు. సీపీఎం, మెగాఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, తుందుర్రు బాధిత గ్రామాల రైతులు, మత్స్యకారులు, ప్రజలు కూడా కొప్పర్రుకు స్వచ్ఛందంగా చేరుకున్నారు. రొయ్యల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదిస్తూ అక్కడి నుంచి ర్యాలీ సాగింది. మొగల్తూరు మండలం శేరేపాలెం, కొత్తపాలెం, మొగల్తూరు, ముత్యాలపల్లి, కొత్తోట, కోమటితిప్ప, జగన్నాథపురం, కాళీపట్నం తూర్పు, కాళీపట్నం పడమర పంచాయతీల మీదుగా ర్యాలీ సాగింది. మార్గమధ్యలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను సందర్శించి నాయకులు మాట్లాడారు. సింగపూర్, జపాన్‌లో ఇలాగే జరుగుతుందా : వంక రవీంద్ర తెల్లారితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్, జపాన్ అంటూ పాఠాలు చెప్తారు కదా? మరి ఆ దేశాల్లో కాలుష్యకారకమైన పరిశ్రమలు ప్రజల ఆమోదం లేకుండా దౌర్జన్యంగా ఏర్పాటు చేస్తున్నారా? చెప్పాలని వంక రవీంద్ర డిమాండ్ చేశారు. కోమటితిప్పలో దీక్షలో కూర్చున్న ఉద్యమకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలు వ్యతిరేకించే ఫ్యాక్టరీలను బలవంతంగా కట్టే సంస్కృతి ఒక్క చంద్రబాబు వద్దే ఉందన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కోవడం, కమీషన్ల కోసం రోజుకో కొత్త ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకురావడం చేస్తున్నారని విమర్శించారు.పారిశ్రామికీకరణపై ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యమం చరిత్రలో నిలుస్తుంది : ముదునూరి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఒక సమస్యపై 40 గ్రామాల ప్రజలు కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఒక్కసారిగా రోడ్డెక్కి న్యాయపోరాటం చేయడం సామాన్య విషయం కాదన్నారు.ఈ ఉద్యమం జిల్లా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. తుందుర్రు ఆక్వాపార్కు కారణంగా రైతులు పంటలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా గొంతేరు డ్రెయిన్‌పై ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి మొండిగా ముందుకెళ్లడం, స్థానిక ఎమ్మెల్యేలు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం దారుణమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ పోలీస్ నిర్భం«ధాలు, ప్రభుత్వ దౌర్జన్యాలకు తలొగ్గే ప్రసక్తి లేదన్నారు. ఫ్యాక్టరీ వద్దని ఎవరూ చెప్పడంలేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సముద్ర తీరప్రాంతానికి తరలించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినా«థ్ ప్రసాద్, సీపీఎం నేతలు కవురు పెద్దిరాజు, జేఎన్వీ గోపాలన్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ తదితరులు మాట్లాడారు. -
అంగన్వాడీల ర్యాలీ
చింతపల్లి : ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ లావణ్యకుమారి సూచించారు. గురువారం మండలంలోని నెల్వలపల్లి, తీదేడు, నసర్లపల్లి గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా కేంద్రాలలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు దేప వెంకటమ్మ, శశికళ, అంగన్వాడీ టీచర్లు సరోజ, భారతి, లక్ష్మి, యాదమ్మ, సర్పంచ్‌లు సందె మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.