మా వయస్సు 70, 75 ఏళ్లుంటాయి. మరి మా పేర్లు ఎందుకు పింఛన్ జాబితాలో లేవు? మేము వృద్ధులం కామా?..
వందశాతం వైకల్యం ఉన్నా.. తమనెందుకు పింఛన్లకు ఎంపిక చేయలేదు.. మా భర్తలు చనిపోయి పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం.. ఈ సమయంలో పింఛన్ జాబితాలో ఎందుకు మా పేర్లు ఎందుకు చేర్చలేదంటూ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన వారు ఆయా పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులను నిలదీశారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. వీరికి పలు పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జాబితాలోపేర్లు లేని వారు చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే సోలిపేట హామీతో వారు ఆందోళన విరమించారు.
- రామాయంపేట/జోగిపేట/దుబ్బాక/మెదక్ రూరల్/చేగుంట
పింఛన్‌రాకుంటే ఎలాబతకాలి?
నా వయస్సు 75. చాలాకాలంగా పింఛన్ వచ్చేది. దీంతోనే మందుగోలీలు కొనుగోలు చేసి బతుకుతున్నా. ప్రస్తుతం పింఛన్ లిస్టులో నాపేరు రాలేదట. ఈ పరిస్థితుల్లో నాకు కూలీ పనులు వెళదామన్నా.. కాని పరిస్థితి. నాకు న్యాయం చేయాలి.
- లంబాడి దుర్గి హవేళిఘనపూర్ తండా, మెదక్.
వందశాతం వైకల్యం ఉన్నా..
నా కొడుకు పేరు నక్క వర్ధన్. పుట్టుకతోనే చెవిటి, మూగతో పాటు మానసిక వికలాం గుడు. కనీసం నిలబడను లేడు. ఇతనికి 100 శాతం వైకల్యం ఉంది. అయితే అధికారులు పింఛన్ జాబితాలో పేరు చేర్చలేదు.
- సాయిలు, వర్దన్ తండ్రి,హవేళిఘనపూర్ మెదక్.
‘ఆసరా’ కోసం ఆందోళనాపథం
Published Fri, Dec 12 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement