Gram Panchayat office
-
ఆఫీసులోనే హవ్వ.. ప్రజాప్రతినిధి, ఉద్యోగిని సరసాలు
సాక్షి, బెంగళూరు: మంచి నడవడికతో సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి, ప్రభుత్వ ఉద్యోగిని దారి తప్పారు. ఆఫీసులోనే సరసాలకు దిగిన వైనాన్ని సీసీ కెమెరాలు బట్టబయలు చేశాయి. వారి ప్రేమపురాణం చూసి అందరూ హవ్వ అని నివ్వెరపోయారు. వివరాలు.. తుమకూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన మాదుస్వామి స్వగ్రామమైన చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ ఆఫీసులో ఈ తతంగం జరిగింది. మహిళా ఉద్యోగినితో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ ప్రేమాయణం నెరుపుతున్నాడు. ఆఫీసులో ఇతరులు లేని సమయంలో ముద్దుమురిపాలకు దిగారు. అయితే అక్కడే సీసీ కెమెరాలున్నసంగతిని వారు మరిచిపోయారు. ఎవరో సీసీ ఫుటేజీలను చూసి లీక్ చేయడంతో అంతటా వ్యాప్తి చెందాయి. ఫుటేజీపై ఉన్న తేదీలను బట్టి మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది. -
పదవి భార్యది.. సర్పంచ్ కుర్చీ భర్తది!
పెదకాకాని (పొన్నూరు): గుంటూరు జిల్లా పెదకాకాని సర్పంచ్ మండే మాధవీలతకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఆమె భర్త నాగేశ్వరరావు పెత్తనం చెలాయిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో డీపీవో కేశవరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు గెలుపొందిన పంచాయతీల్లో వాళ్లే సర్పంచ్ స్థానాల్లో కూర్చోవాలని.. ఎట్టిపరిస్థితిలోనూ వాళ్ల భర్తలకు పెత్తనం ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా చెప్పారు. అయితే అధికారుల ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయకుండా పెదకాకాని పంచాయతీలో మహిళా సర్పంచ్ అధికారాన్ని ఆమె భర్త లాక్కోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. -
గ్రామ పంచాయతీలో వివాహ రిజిస్ట్రేషన్లు
దస్తురాబాద్: మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీల్లో వివాహ రిజిస్ట్రేషన్ల నమోదును బుధవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన గుబ్బలి రాకేశ్, రజితల వివాహం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్ అనంతరం వధూవరులకు సర్పంచ్ నిమ్మలతోట రాజమణిశివయ్య చేతుల మీదుగా వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపి, వార్డు సభ్యులు సత్యనారాయణ, గణేశ్, రాణి, బుచ్చరాజు, రమేశ్, కారోబార్ శ్రీనివాస్, నాయకులు రాజనర్సయ్య, బక్కన్న తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీకి చేరిన పెళ్లి..!
సాక్షి, వైరా: గ్రామాల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది. గ్రామ కార్యదర్శులకు వివాహం రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచే అమల్లోకి.. కాగా ఈ విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. పంచాయతీ కార్యదర్శులతో పాటు మండలంలోని ఈఓపీఆర్డీలు ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. పెళ్లి రిజిష్ట్రేషన్‌కు నామమాత్రపు రుసుము చెల్లించాలి. రెండు నెలల గడువు దాటితే రూ.100 చెల్లించి గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై గడువుదాటితే రిజిష్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థికసాయం పొందేందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి. పంచాయతీల్లో నమోదు చేసుకోవాలి గ్రామాల్లో జరుగుతున్న వివాహాలను ఇక నుంచి తప్పని సరిగా గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలి. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథక ఫలాలను త్వరిత గతిన పొందే అవకాశం ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం -
‘ఆసరా’ కోసం ఆందోళనాపథం
మా వయస్సు 70, 75 ఏళ్లుంటాయి. మరి మా పేర్లు ఎందుకు పింఛన్ జాబితాలో లేవు? మేము వృద్ధులం కామా?.. వందశాతం వైకల్యం ఉన్నా.. తమనెందుకు పింఛన్లకు ఎంపిక చేయలేదు.. మా భర్తలు చనిపోయి పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం.. ఈ సమయంలో పింఛన్ జాబితాలో ఎందుకు మా పేర్లు ఎందుకు చేర్చలేదంటూ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన వారు ఆయా పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. వీరికి పలు పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జాబితాలోపేర్లు లేని వారు చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే సోలిపేట హామీతో వారు ఆందోళన విరమించారు. - రామాయంపేట/జోగిపేట/దుబ్బాక/మెదక్ రూరల్/చేగుంట పింఛన్రాకుంటే ఎలాబతకాలి? నా వయస్సు 75. చాలాకాలంగా పింఛన్ వచ్చేది. దీంతోనే మందుగోలీలు కొనుగోలు చేసి బతుకుతున్నా. ప్రస్తుతం పింఛన్ లిస్టులో నాపేరు రాలేదట. ఈ పరిస్థితుల్లో నాకు కూలీ పనులు వెళదామన్నా.. కాని పరిస్థితి. నాకు న్యాయం చేయాలి. - లంబాడి దుర్గి హవేళిఘనపూర్ తండా, మెదక్. వందశాతం వైకల్యం ఉన్నా.. నా కొడుకు పేరు నక్క వర్ధన్. పుట్టుకతోనే చెవిటి, మూగతో పాటు మానసిక వికలాం గుడు. కనీసం నిలబడను లేడు. ఇతనికి 100 శాతం వైకల్యం ఉంది. అయితే అధికారులు పింఛన్ జాబితాలో పేరు చేర్చలేదు. - సాయిలు, వర్దన్ తండ్రి,హవేళిఘనపూర్ మెదక్.