
రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్న సర్పంచ్, అధికారులు
దస్తురాబాద్: మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీల్లో వివాహ రిజిస్ట్రేషన్ల నమోదును బుధవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన గుబ్బలి రాకేశ్, రజితల వివాహం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్ అనంతరం వధూవరులకు సర్పంచ్ నిమ్మలతోట రాజమణిశివయ్య చేతుల మీదుగా వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపి, వార్డు సభ్యులు సత్యనారాయణ, గణేశ్, రాణి, బుచ్చరాజు, రమేశ్, కారోబార్ శ్రీనివాస్, నాయకులు రాజనర్సయ్య, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment