
నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం రహత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 30 లంబాడీ కుటుంబాలను కులపెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. గత ఆదివారం ఊర పండగ సందర్బంగా గిరిజన కుటుంబాలకు మాంసం పాళ్లు కూడా గ్రామ పెద్దలు పంచలేదు. ప్రశ్నించిన గిరిజనులను గ్రామం వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.
ఆరు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ గ్రామాభివృద్ది కమిటీపై భీంగల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్‌ను కలిసి గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాలకు ప్రాణభయం ఉందని రక్షణ కూడా కల్పించాలని వేడుకుంటున్నారు.