familes
-
Adipurush: ప్రభాస్ గురించి కామెంట్ చేసిన కృతి సనన్ తండ్రి
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా 'ఆదిపురుష్' గురించే టాపిక్.. ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందు అంటే జూన్ 15 గురువారం రాత్రి ముంబయిలో ఒక షో వేశారు. చిత్ర తారాగణం, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా మేకర్స్ ఏర్పాటు చేశారు. సీత పాత్రలో నటించిన కృతి సనన్ నెమలి నీలం రంగు అనార్కలీ సూట్లో అక్కడ అద్భుతంగా కనిపించింది. సినిమా చూసేందుకు ఆమె తల్లిదండ్రులు రాహుల్ సనన్, గీతా సనన్ వచ్చారు. సీతాదేవి పాత్రలో తమ కుమార్తె నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని కృతి తల్లిదండ్రులు తెలిపారు. (ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్) రాముడిగా ప్రభాస్ అద్భుతంగా నటించాడని, సినిమా చూసిన తర్వాత రాముడిగా అందరికీ ప్రభాసే గుర్తుండిపోతాడని ఆయన అన్నారు. అదిపురుష్ కోసం దేశవ్యాప్తంగా ఇంతమంది ఎదురుచూడటం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. అనంతరం కృతి సనన్‌తో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఆమె ఎంతో ఓపికతో వారందరితో సెల్ఫీలు దిగింది. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు సంతోషంగా ఉన్నారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) -
మా అమ్మ నాన్న తప్ప ఎవరు ఏమి అన్న దీనితో సమానం
-
చరిత్ర సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి: 14 రోజుల్లో కోటికి పైగా కుటుంబాల్లో సర్వే నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కోటి మార్క్‌ను దాటడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు పాలన తేడాను వివరిస్తూ గృహ సారథులు సర్వే చేస్తున్నారు. మ్యానిఫెస్టో అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా, ఏపీలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటింటికీ వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు -
వధువు కావాలా.. నాయనా?
హిందూ వివాహాల్లో పెళ్లి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు, వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది. ఇదివరకు బంధువులు, పరిచయస్తులు మధ్యవర్తిగా ఉండి ఇరు కుటుంబాల వారికీ అమ్మాయి, అబ్బాయిని చూపించి.. పెళ్లి సంబంధాలు కుదుర్చేవారు. అయితే చదువు పూర్తిచేసి.. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో వయసు దాటిన తర్వాత పెళ్లికి సిద్ధమైతే వధువు దొరకడం లేదు. ఇటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని రాజమండ్రికి చెందిన కొంతమంది మ్యారేజ్ బ్యూరో పేరుతో రంగంలోకి దిగుతున్నారు. ఫొటో ఒకరిది చూపి.. డబ్బు రాబట్టుకుని.. పెళ్లి మరొకరితో చేయడానికి ప్రయత్నిస్తూ.. వరుడి తరఫు కుటుంబాలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎంతోమంది యవకులు వయసు మీదపడుతున్నా కల్యాణ గడియలు కలసిరావడం లేదు. అమ్మాయిలు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఎంపికలోనూ మార్పు వచ్చింది. ఉన్నత చదువు.. మంచి ఉద్యోగం.. మెరుగైన వేతనం.. ఆస్తిపాస్తులు.. కుటుంబ నేపథ్యం బాగుండాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కుమార్తెల అభిప్రాయానికి విలువనిచ్చి.. అలాంటి వారిని ఎంపిక చేసుకోవడంపై దృష్టిసారిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పలు వ్యాపారాలు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, వ్యవసాయ రంగాల యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. ఎంతలా అంటే కన్యాశుల్కం అంటే.. అమ్మాయికే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అమ్మాయిలు దొరక్క విసిగివేసారిపోయిన యువకులు, వారి తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. కొందరు బ్యూరో నిర్వాహకులు డబ్బు కోసం మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిలువునా మోసపోక తప్పదని పలు ఘటనలు హెచ్చరిస్తున్నాయి. మ్యారేజ్ బ్యూరో మోసాల్లో మచ్చుకు... అనంతపురంలో నివాసం ఉంటున్న రాముడు (పేరుమార్చాం) సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. రాముడు తన సోదరుడికి పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి రాజమండ్రికి చెందిన మహిళా పెళ్లిళ్ల పేరయ్య (బ్రోకర్)ను సంప్రదించారు. మొదట ఒక అమ్మాయి ఫొటో చూపించారు. పెళ్లికొడుకు సమ్మతి తెలపడంతో.. రూ.5 లక్షల నగదును పెళ్లికూతురు తండ్రికి ఇవ్వాలని.. పెళ్లి నిర్వహణ పెళ్లికొడుకు వారే బాధ్యత తీసుకోవాలని బ్రోకర్ చెప్పారు. వారు ఒప్పుకుని నగదు చెల్లించారు. తర్వాత 15 రోజులకు పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కలిసి 20 మంది దాకా పెళ్లి అనుకున్న సమయానికి రెండు రోజుల ముందే రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కూతురు మారిపోయింది. తొలుత తమకు ఫొటోలో చూపించిన అమ్మాయి కాదు కదా అని పెళ్లి కుమారుడి వారు ప్రశి్నస్తే.. ‘ఆ అమ్మాయి తండ్రికి ఆరోగ్యం బాగోలేదు. పెళ్లి చేయడం ఇప్పుడు కుదరదు. కావున ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి’ అని మహిళా బ్రోకర్ తాపీగా సమాధానమిచ్చారు. చేసేది లేక పెళ్లి కొడుకు కుటుంబం వెనక్కు వచ్చేసింది. ఇలా పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని మోసగించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెళ్లి సంబంధాలు కుదుర్చుతామంటూ వల వేసి భారీగా నగదు, బంగారు నగలు గుంజుతున్నారు. చివర్లో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. జిల్లాలో యువకుల గణాంకాలు 20 నుంచి 29 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 3,25,218 30 నుంచి 39 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 5,86,395 బ్రోకర్ల మాట నమ్మొద్దు అమ్మాయిల కొరతను ఆసరాగా చేసుకుని పెళ్లిళ్ల పేరుతో కొందరు బ్రోకర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. బ్రోకర్ల వలకు చిక్కకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. రెండు కుటుంబాలు ఒక అభిప్రాయానికి వచ్చాక మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మాట్లాడుకోవాలి. బ్రోకర్లను ఒక పరిధి వరకే పరిమితం చేయాలి. –మేడా రామలక్ష్మీ, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్, అనంతపురం (చదవండి: విధివంచితులు) -
‘ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారు’
ట్రాఫిక్ కారణంగానే ముంబైలో మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారు. ఆర్థిక రాజధానిలో రోడ్ల పరిస్థితిని గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధంగా విచిత్రమైన వాదనను వినిపించారు. అంతేకాదు తాను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. గుంతలు, ట్రాఫిక్‌తో తాను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. పైగా ఈ ట్రాఫిక్ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో చాలామంది విడాకులు తీసుకుంటున్నారని ఒక విచిత్రమైన లాజిక్‌ని చెప్పారు. దీంతో శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఆమె పేరు ఎత్తకుండానే సోషల్ మీడియా వేదికగా ఆమె స్టేట్మెంట్పై విరుచుకుపడ్డారు. అంతేకాదు ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. అంతేకాదు బెంగుళూరు కుటుంబాలు ఈ స్టేట్మెంట్ని క్లైయిమ్ చేసుకుంటారే ఏమో! జాగ్రత్తా అంటూ ప్రియాంక చతుర్వేది చమత్కరించారు. పైగా విడాకులు తీసుకోవడంపై దృష్టి సారించకుండా కుటుంబంతో గడిపేందుకు హాలీడే బ్రేక్ తీసుకోండి అన్నారు. అంతేకాదు దయచేసి ఈ విచిత్రమైన స్టేట్మెంట్ని అనుకరించకండి మీ వివాహబంధానికి ప్రాణాంతకం కావచ్చు అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలతో విమర్శిస్తూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. #WATCH: BJP leader Devendra Fadnavis' wife Amruta Fadnavis says, "I'm saying this as common citizen. Once I go out I see several issues incl potholes,traffic. Due to traffic,people are unable to give time to their families & 3% divorces in Mumbai are happening due to it." (04.02) pic.twitter.com/p5Nne5gaV5 — ANI (@ANI) February 5, 2022 Best (il)logic of the day award goes to the lady who claims 3% Mumbaikars are divorcing due to traffic on roads. Please take a holiday break rather than having a mind on brake.. Bengaluru families please avoid reading this , can prove fatal for your marriages 😂 — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 5, 2022 (చదవండి: నామినేషన్ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి) -
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ (ఫోటోలు)
-
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
సాక్షి, అమరావతి: కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్కులను అందజేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరులైన కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్కులను అందజేశారు. పోలీస్ అమరవీరులు సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అమరులైన పోలీసులకు సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర సెక్రటరీ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కులను సీఎం వైఎస్ జగన్ అందజేశారు. కాగా, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పోలీసు సంక్షేమ గ్రాంట్‌ను అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగానే 15 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేశారు. తద్వారా దాదాపు 206 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 1. వాసు గారి భార్య శ్రీమతి భాగ్యలక్ష్మీ భవాని గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 2. శ్రీరాములు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన భార్య ఝాన్సీరాణి గారు 10 లక్షల చెక్కు అందుకున్నారు. 3. నాగేశ్వర్రావు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన సతీమణి సి.హెచ్.విశ్వశాంతి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 4. రామారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 5. పద్మ(వుమెన్ హోంగార్డు)అమరులయ్యారు. ఆమె భర్త టీ. చంద్రశేఖర్ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 6. ప్రసాద్‌రావు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన భార్య బి. లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 7. సయ్యద్ జలాలుద్దీన్ (ఏఆర్ఎస్పై)అమరులయ్యారు. ఆమె సతీమణి సయ్యద్ ఉమే సల్మా గారు గ్రాంట్‌ను అందుకున్నారు. 8. హరిబాబు గారు అమరులయ్యారు. ఆయన భార్య నిర్మల గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 9. రత్నంరాజు గారు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన సతీమణి కె. సుజాతావాణి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. చదవండి: నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు: సీఎం జగన్ -
నగలు అమ్మి, అప్పులు చేసినా దక్కని ప్రాణం
-
‘గుట్టమీద ఉండలేకపోతున్నాం’
సాక్షి, పాల్వంచరూరల్: గుట్టపైన వారు ఆరు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. వారికి మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవు. నిత్యం సమస్యలతో సావాసం చేస్తుంటారు. విషసర్పాలు, తేళ్లు, జెర్రులు, క్రిమికీటకాల దాడుల నుంచి తప్పించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సరైన రహదారి మార్గం లేదు. వర్షాకాలంలో చెరువునీటిలో నుంచి ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కడైనా నివాసం ఉండేందుకు స్థలం ఇప్పిస్తే గుట్టదిగి వెళ్తామని ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదని వాపోతున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా తమ జీవనంలో పురోగతిలేదని చెబుతున్నారు. పాల్వంచ మండలం బీసీయం జాతీయ రహదారి పక్కన గల జగన్నాథపురం గ్రామ పంచాయతీ రంగాపురం శివారులోని గుట్టపైన 24 ఏళ్లుగా ఆరు కుటుబాలకు చెందిన 20 మంది.. తడకలు, బుట్టలు, తట్టలు అల్లుకుంటూ తద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. గుట్ట మీద చెట్లు, పుట్టలు, ఉండటంతో అధికంగా విషసర్పాలు, తేళ్లు, కీటకాల మధ్య నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు కావాలంటే నిత్యం రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్లాల్సిందే. గుట్ట మీద నుంచి తమ నివాసాలను మార్చేలా చూడాలని అనేక సార్లు ఎమ్మెల్యేను కలిసి ప్రాధేయపడ్డామని, పలుమార్లు ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకున్నామని, అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. గుట్ట మీదకు రహదారి సౌకర్యం లేదు. వర్షాకాలంలో చెరువు నిండితే అందులో నుంచి రాకపోకలు సాగించాలి. రోగం వచ్చినా, పురిటి నొప్పులు వచ్చినా ఆస్పత్రికి సకాలంలో చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. తాగడానికి ఒక చేతిపంపు ఉంది. అది వేసవిలో పనిచేయదు. పిల్లలను చదువుకు పంపించలేక ఇంటి వద్ద ఉంచుకుంటున్నాం. కాగా, గుట్ట పక్కన శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు నిర్మించాలని రంగాపురం పంచాయతీ సర్పంచ్ చూస్తున్నారు. శ్మశానవాటిక నిర్మిస్తే అక్కడ ఎలా జీవనం సాగించాలని గుట్టవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుట్ట పక్కన శ్మశానవాటికను గానీ, డంపింగ్‌యార్డును కానీ నిర్మించకుండా మరో ప్రదేశంలో నిర్మించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మైదాన ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. గుట్టమీద ఉండలేకపోతున్నాం గుట్టమీద నివాసం ఉండాలంటే క్షణక్షణం భయంగా ఉంది. ఎటువైపు నుంచి ఏపాము, ఏపురుగు వచ్చి కాటేస్తుందో అని. ఇంటి స్థలాలు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. గ్రీవెన్స్‌డేలో అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నాం. ఇంతవ రకు ఎవరూ పట్టించుకోలేదు. కూరాకుల లలిత రహదారిలేక అవస్థలు పడుతున్నాం గుట్టమీద బతకడం ప్రమాదకరంగా ఉంది. ఇంటి స్థలాలు ఇప్పించాలని అనేక సార్లు అధికారులు, నాయకులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు. గుట్టమీద ఉన్న నివాసాలకు రాకపోకలు సాగించేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం చెరువు నిండితే రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. అంగడి సూరమ్మ పట్టించుకునే దిక్కులేదు గుట్టమీద అడవిలో బతుకున్న మాకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్లు ఇస్తే కట్టుకున్నాం. విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. కానీ వీధిలైట్లు వేయడం లేదు. దీంతో రాత్రి సమయంలో ఏ విషపురుగులకు బలికావాల్సి వస్తుందో అని భయపడుతున్నాం. అనేక సార్లు అధికారులకు మా గోడును విన్నవించుకున్నా పట్టించుకునే దిక్కు లేదు. వెలుగు ఉప్పలమ్మ శ్మశానవాటికను నిర్మించొద్దు గుట్ట మీద జీవనం సాగిస్తున్న మాకు మౌలిక సౌకర్యాలు లేక సతమతమవుతున్నాం. గుట్ట పక్కన శ్మశానవాటిక, డంపింగ్‌యార్డును నిర్మించాలని చూస్తున్నారు. వాటిని గుట్ట పక్కన కాకుండా మరో ప్రదేశంలో నిర్మించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తేనే పని దొరుకుతుంది. వెలుగు ఉపేంద్ర -
పిల్లలను పెంచడమెలాగో తెలుసా !
సాక్షి, హైదరాబాద్: మీరెప్పుడైనా పిల్లలు ఎందుకు కార్టూన్స్‌ను అంతగా ఇష్టపడతారో ఆలోచించారా ? కార్టూన్స్ ఎందుకు అంత వేగంగా కదులుతాయో గమనించారా ? పిల్లల్లో ఆసక్తిని పెంచేందుకే అవి అలా తయారు చేస్తారు. అలాగే పిల్లలకు ఏదైనా నేర్పించాలంటే తల్లిదండ్రులు కూడా అంతే వేగంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచడం ద్వారా పిల్లలను ఉత్తమ పౌరులుగా మలచవచ్చు. ఇదో బాధ్యత... పిల్లలను పెంచడమనేది సమాజానికి గొప్ప వ్యక్తులను అందించే గొప్ప బాధ్యత. వారిని నిరంతరం ఉత్సాహంగా ఉండేలా చేయడం ద్వారా పెరిగే కొద్దీ కొత్త అంశాలను తెలుసుకోవాలనే తపనను పెంచవచ్చు. అయితే కేవలం చెప్పింది వినడం ద్వారా మాత్రమే కాక పిల్లలు తాము చూసే విషయాల నుంచి కూడా ఎంతో నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కింది విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమతో పెంచడం... చిన్న వయసులో తల్లిదండ్రులు చూపించే ప్రేమను పిల్లలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. ప్రేమ అంటే క్షమించడమే అని వారికి నేర్పించాలి. తెలిసీతెలియక ఏదైనా తప్పు చేసినపుడు ప్రేమతో మందలించి క్షమిస్తున్నానని చెప్పాలి. స్కూల్లో తమ మిత్రులతో గొడవ జరిగాక, వారు ‘సారీ’ చెబితే క్షమిస్తున్నాను అని చెప్పేలా వారిని ప్రోత్సాహించాలి. భార్యాభర్తలు పిల్లల ముందు గొడవపడకూడదు. ధైర్యాన్నివ్వాలి.... జీవితంలో ధైర్యంగా ఉండటం చాలా అవసరం. ఎదిగేకొద్దీ గెలుపోటములు సహజమని వాటికి నిరాశ చెందకూడదని తెలియజెప్పాలి. నిర్మాణాత్మక ధోరణిని వారిలో పెంచాలి. పదే పదే ఎందుకు విఫలమవుతున్నారో పరిశీలించుకొనే ధోరణి అలవాటు చేయాలి. అదే సమయంలో గర్వాన్ని పెంచుకోకుండా ఉండాలని వివరించాలి. మంచి పని చేసిన ప్రతిసారీ ప్రశంసించాలి. సమస్యలు ఎదురైనపుడు తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలా ఉండడమే నేర్చుకుంటారని మానసిక నిపుణులు అంటున్నారు. ఓపికను నేర్పాలి... జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యలను ఎదుర్కోవడానికి ఓపిక అవసరమవుతుంది. కనుక పలు సందర్భాల్లో ఓపికగా ఎలా ఉండాలో అనుభవపూర్వకంగా చెబుతూ నేర్పించాలి. వరుస వైఫల్యాల సమయంలో ఓపిక కలిగి ఉంటే, తర్వాత విజయతీరాలకు చేరతారని తెలియజేయాలి. అలాగే పిల్లలు చెప్పే విషయాలను తల్లిదండ్రులు ఓపికగా వినాలి. వారి ప్రశ్నలకు నిదానంగా అర్థమయ్యేలా జవాబు చెప్పాలి. వారు చెప్పేది ఎంత చిన్న విషయం అయినప్పటికీ ఆసక్తిగా వినడం వల్ల వారు కూడా ఆ లక్షణాన్ని పాటించడం నేర్చుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడం నేర్పించాలి.. నిర్ణయాలను తీసుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా వారిని బాధ్యతాయుతులుగా తీర్చిదిద్దవచ్చు. తల్లిదండ్రుల సమక్షంలోనే నిర్ణయాలు తీసుకునేలా చేస్తే వారు ఒత్తిడికి లోనవ్వకుండా చూడవచ్చు. వారు తీసుకునే నిర్ణయం వల్ల జరిగే లాభాలను, నష్టాలను బేరీజు వేసి చెప్పడం ద్వారా లోతుగా ఆలోచించడం నేర్చుకుంటారు. తరచుగా మాట్లాడాలి... ప్రతీరోజూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారితో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. రోజంతా ఎలా గడచిందని అడగాలి. ఆ రోజు వారు సాధించిన విజయాలను తెలుసుకొని అభినందించాలి. అలాగే చేయలేకపోయిన అంశాలను కూడా తెలుసుకొని దానిని ఎలా అధిగమించాలో సూచనలు చేయాలి. తప్పు చేసినపుడు సున్నితంగా మందలిస్తూనే వారికి అండగా ఉన్నామన్న ధైర్యాన్ని కలిగించాలి. తల్లిదండ్రులు ఈ విషయాలన్నింటినీ అమలుచేయడం ద్వారా పిల్లలను ఉన్నత స్థాయికి వెళ్లేలా చేయవచ్చు. సమాజానికి అవసరమైన ఉత్తమ పౌరులుగా వాళ్లు నిలబడతారు. -
రహత్‌నగర్‌లో దారుణం
నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం రహత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 30 లంబాడీ కుటుంబాలను కులపెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. గత ఆదివారం ఊర పండగ సందర్బంగా గిరిజన కుటుంబాలకు మాంసం పాళ్లు కూడా గ్రామ పెద్దలు పంచలేదు. ప్రశ్నించిన గిరిజనులను గ్రామం వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఆరు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ గ్రామాభివృద్ది కమిటీపై భీంగల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్‌ను కలిసి గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాలకు ప్రాణభయం ఉందని రక్షణ కూడా కల్పించాలని వేడుకుంటున్నారు. -
'ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది'
చెన్నై: నెల రోజుల కిందట గల్లంతైన తీర రక్షకదళ గస్తీ విమానం శకలాల ఆనవాళ్లు దొరికాయన్న వార్తలపై కో పైలెట్ సుభాష్ సురేష్ తల్లి పద్మా సురేష్ స్పందించారు. తమ కుమారుడి క్షేమ సమాచారంపై ఆమె ఆందోళన చెందుతున్నారు. 'జూన్ 8 నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎపుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని గాభరాగా ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదని' పద్మా సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విమానం ఆనవాళ్లు లభించాయని వార్త విన్నప్పటినుంచీ మరింత కంగారుగా, భయంగా ఉందన్నారు. వాట్పాప్ గ్రూప్ సందేశాల ద్వారా, మీడియా ద్వారా మాత్రమే ఈ వార్త తమకు తెలిసిందనీ, అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె అన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి సమాచారం కోసం వేచి చూడాలని కోస్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారని, సుభాష్ బంధువు వెంకటేష్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని మరో సిబ్బంది సోనీ బంధువు తెలిపారు. కాగా తమిళనాడు సముద్ర తీర ప్రాంతం చిదంబరం-కడలూరు మధ్య జలాల్లో డార్నియర్ గస్తీ విమానం శకలాలతో పాటు దాని ఫ్లయిట్ డాటా రికార్డర్‌ను 950 మీటర్ల అడుగున గుర్తించినట్లు రక్షణశాఖ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సితన్షు కర్ ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ సంస్థకు చెందిన ఒలింపిక్ అనే నౌక వీటిని గుర్తించింది. జూన్ 8న ముగ్గురు డిప్యూటీ కమాండెంట్లతో వెళ్లిన ఈ విమానం విధుల తర్వాత తిరిగొస్తుండగా చెన్నై తీరంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనికోసం 33 రోజులుగా గాలింపు చర్యలు విస్తృత కొనసాగుతున్నాయి. ఈ విమానంలో డిప్యూటీ కమాండెంట్ (పైలట్) విద్యాసాగర్, డిప్యూటీ కమాండెంట్ (కో పైలట్) సుభాష్ సురేష్, నావిగేటర్ ఎంకె సోనీ ఉన్నారు. ఈ తరహా ప్రమాదాల్లో ఇది రెండోది. గత మార్చిలో గోవాలో జరిగిన ఎయిర్ క్రాప్ట్ కూలిపోయిన ప్రమాదంలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు.