సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి: 14 రోజుల్లో కోటికి పైగా కుటుంబాల్లో సర్వే నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కోటి మార్క్‌ను దాటడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు పాలన తేడాను వివరిస్తూ గృహ సారథులు సర్వే చేస్తున్నారు. మ్యానిఫెస్టో అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
కాగా, ఏపీలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటింటికీ వెళ్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు
Comments
Please login to add a commentAdd a comment