
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా 'ఆదిపురుష్' గురించే టాపిక్.. ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందు అంటే జూన్ 15 గురువారం రాత్రి ముంబయిలో ఒక షో వేశారు. చిత్ర తారాగణం, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా మేకర్స్ ఏర్పాటు చేశారు. సీత పాత్రలో నటించిన కృతి సనన్ నెమలి నీలం రంగు అనార్కలీ సూట్‌లో అక్కడ అద్భుతంగా కనిపించింది. సినిమా చూసేందుకు ఆమె తల్లిదండ్రులు రాహుల్ సనన్, గీతా సనన్ వచ్చారు. సీతాదేవి పాత్రలో తమ కుమార్తె నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని కృతి తల్లిదండ్రులు తెలిపారు.
(ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్)
రాముడిగా ప్రభాస్ అద్భుతంగా నటించాడని, సినిమా చూసిన తర్వాత రాముడిగా అందరికీ ప్రభాసే గుర్తుండిపోతాడని ఆయన అన్నారు. అదిపురుష్ కోసం దేశవ్యాప్తంగా ఇంతమంది ఎదురుచూడటం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. అనంతరం కృతి సనన్‌తో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఆమె ఎంతో ఓపికతో వారందరితో సెల్ఫీలు దిగింది. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు సంతోషంగా ఉన్నారు.
(ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్)
Comments
Please login to add a commentAdd a comment