గుడిహత్నూర్ (బోథ్): సహనం నశించాకే ఉద్యమం పురుడు పోసుకుందని, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ స్పష్టం చేశారు. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఆదివాసీ మహిళ పోరుగర్జనసభలో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగ విరుద్ధంగా లంబాడాలు అనుభవిస్తున్న ఎస్టీ హోదా నుంచి వారిని తొలగించే వరకు ఈ ఉద్య మం ఆగదన్నారు. ఉద్యమంలో ఆదివాసీ మహిళలు కీలక పాత్ర పోషించాలన్నారు. లంబాడాలు ఎస్టీలు కాదని రుజువు చేసే పత్రాలను నివేదించినా నేటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. డీఎస్సీ రాసిన ఆదివాసీ మహిళ అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ఆదివాసీ ప్రొఫెసర్లు, మహిళలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ సంఘాల నేతలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment