ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూ రావు తనయుడు వెంకటేశ్ బీజేపీ అభ్యర్థిగా బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో పార్టీకి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలు బీజేపీలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎంపీ బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనాసక్తి కనబరుస్తున్నారు. అయితే తన తనయున్ని రంగంలోకి దించే విషయం ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి గోప్యంగా ఉంచారు. శనివారం సోయం వెంకటేశ్ పోటీ చేస్తారనే విషయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో బోథ్ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తుంది.
ఆసక్తికరం..
పార్టీ పరంగా బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకటి దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడె మానాజీ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారి గోద్రు, శాంతాపూర్ మాజీ సర్పంచ్ విజయ్‌జాదవ్ కూడా దరఖాస్తులు సమర్పించారు. ఇంకా ఈ నియోజకవర్గం నుంచి అధ్యాపకుడు బలరాం జాదవ్ కూడా మొదటి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
అయితే ఆయన ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదు. ఇక సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నుంచి బరిలో దిగడం ఖాయమని మొదటి నుంచి ప్రచారం సాగింది. అయితే ఇటీవల ఈ ఎన్నికల్లో పోటీపై తనకు ఆసక్తి లేదని అనుచరుల వద్ద వెల్లడించారు. అయితే తన తనయుడు వెంకటేశ్‌ను బరిలోకి దించే విషయంలో మాత్రం గోప్యత పాటించారు.
తాను కొద్ది కాలంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చారు. బోథ్ నియోజకవర్గం నుంచి సోయం వెంకటేశ్ పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత ఆ విషయం పెద్దగా ప్రస్తావనకు రాలేదు. తాజాగా మళ్లీ ఆయన దరఖాస్తు చేస్తున్నారని పార్టీలో చర్చ మొదలైంది.
నేటితో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..
బీజేపీలో నియోజక వర్గాల నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆదివారంతో ఈప్రక్రియ ముగియనుంది. ఆదిలాబాద్ నుంచి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చిట్యాల సు హాసినీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వామన్‌రెడ్డి కోడలు చిల్కూరి జ్యోతిరెడ్డి, మావలకు చెందిన బోరంచు గంగారెడ్డి, బడాల విలాస్ రెడ్డి, తాంసికి చెందిన సామ సంతోశ్‌రె డ్డి, సీనియర్ నాయకులు వి.ఆదినాథ్ దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదివారం దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పట్టణఅధ్యక్షుడు లాలా మున్నా కూడా దరఖాస్తు చేసుకుంటారని ప్రచారం ఉంది. ఖానా పూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, ఆయన తనయుడు రితీశ్ రా థోడ్, సీనియ ర్ నాయకులు హరినాయక్, సట్ల అశోక్, ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత, పెంబి జెడ్పీటీసీ జానుబాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ నుంచి కూడా టికెట్ ఆశిస్తూ రితీశ్ రాథోడ్ దరఖా స్తు చేసుకున్నారు. ఆయనతో పాటు అజ్మీరా ఆత్మారాం నాయక్, కోట్నాక విజయ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వందన దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment