bapurao
-
బీఆర్ఎస్కు ఎమ్మెల్యే బాపూరావు గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్, ఆదిలాబాద్: బీఆర్ఎస్కి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు గుడ్‌బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. బోథ్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈసారి బోథ్ నియోజకవర్గం టికెట్‌ను బాపూరావుకు కాకుండా జెడ్పీటీసీ అనిల్‌జాదవ్‌కు టికెట్ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను కలి సిన బాపూరావు పలు అంశాలపై చర్చలు జరిపా రు. బోథ్‌లో తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే విజయం సాధిస్తానని స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరుతున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా, త్వరలోనే చేరుతానని తెలిపారు. కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికల పరంపర కొనసాగు తోంది. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర నేతలు రేవంత్ నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు వురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కల్వకుర్తి, కొడంగల్ నియోజకవ ర్గాలకు చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్య గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్‌లో చేరారు. షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లు ప్రతాప్, మంజుల, బాల్ రాజు, గోపాల్, రాములు, యాదయ్య, జహంగీర్, కౌన్సిలర్లు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. -
నేను పార్టీ మారడం లేదు
కైలాస్‌నగర్: పార్టీ మారుతున్నట్లు కొద్దిరోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని, తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని ఎంపీ సోయం బాపూరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు ప్రజల చిరకాల కోరిక అని, దాన్ని నెరవేర్చే ఉద్దేశంతో రెండు నెలలుగా ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఈ రైల్వేలైన్‌కు సంబంధించి ఫైనల్ లోకేషన్ సర్వే వరకు తెచ్చానని, వచ్చే బడ్జెట్లో దానికి కేంద్రం నిధులు కేటాయించే అవకాశముందని తెలిపారు. స్థానికంగా పార్టీకి సమయం ఇవ్వకపోవడంతో తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లుగా ప్రచారం జరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలపడుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని బాపూరావు స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌లోకి సోయం బాపూరావు?
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పార్టీ పెద్దల సమక్షంలో స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోటి నుంచి సోయం బాపూరావు చేరిక ప్రస్తావన వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోయం పేరును ప్రకటిస్తారని అంటున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా పర్యటనలో ఉన్న ఆయనను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించింది. రేవంత్ నోటి వెంట మీ పేరు వచ్చిందని సోయంను అడగ్గా.. అభిమానంతో ఆయన చెప్పి ఉండొచ్చని బదులిచ్చారు. కాంగ్రెస్‌లో చేరిక విషయంలో అన్ని ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. నాలుగు నెలల క్రితం కూడా సోయం కాంగ్రెస్‌లో చేరుతు న్నారని జోరుగా ప్రచారం జరగగా, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన బహిరంగంగా ఖండించారు. తాజాగా మళ్లీ ఈ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బీజేపీ ఎంపీలందరూ వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో ఉండాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ ఆయన దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. తనయుడు వెంకటేశ్‌ను బోథ్ నుంచి దరఖాస్తు చేయించారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో సోయంకు సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో బలమైన ఆదివాసీ నేత సోయంను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన అనిల్ జాదవ్ లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్, బీజేపీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ తర్వాత జరుగుతున్న రాజకీయ సమీకరణాలపై అందరి దృష్టి నెలకొంది. -
TS Election 2023: బీజేపీ అభ్యర్థిగా తెరపైకి ‘సోయం’ తనయుడు!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూ రావు తనయుడు వెంకటేశ్ బీజేపీ అభ్యర్థిగా బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో పార్టీకి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలు బీజేపీలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎంపీ బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనాసక్తి కనబరుస్తున్నారు. అయితే తన తనయున్ని రంగంలోకి దించే విషయం ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి గోప్యంగా ఉంచారు. శనివారం సోయం వెంకటేశ్ పోటీ చేస్తారనే విషయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో బోథ్ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తుంది. ఆసక్తికరం.. పార్టీ పరంగా బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకటి దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడె మానాజీ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారి గోద్రు, శాంతాపూర్ మాజీ సర్పంచ్ విజయ్జాదవ్ కూడా దరఖాస్తులు సమర్పించారు. ఇంకా ఈ నియోజకవర్గం నుంచి అధ్యాపకుడు బలరాం జాదవ్ కూడా మొదటి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదు. ఇక సోయం బాపూరావు అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నుంచి బరిలో దిగడం ఖాయమని మొదటి నుంచి ప్రచారం సాగింది. అయితే ఇటీవల ఈ ఎన్నికల్లో పోటీపై తనకు ఆసక్తి లేదని అనుచరుల వద్ద వెల్లడించారు. అయితే తన తనయుడు వెంకటేశ్‌ను బరిలోకి దించే విషయంలో మాత్రం గోప్యత పాటించారు. తాను కొద్ది కాలంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చారు. బోథ్ నియోజకవర్గం నుంచి సోయం వెంకటేశ్ పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత ఆ విషయం పెద్దగా ప్రస్తావనకు రాలేదు. తాజాగా మళ్లీ ఆయన దరఖాస్తు చేస్తున్నారని పార్టీలో చర్చ మొదలైంది. నేటితో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. బీజేపీలో నియోజక వర్గాల నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆదివారంతో ఈప్రక్రియ ముగియనుంది. ఆదిలాబాద్ నుంచి జెడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్యాల సు హాసినీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వామన్‌రెడ్డి కోడలు చిల్కూరి జ్యోతిరెడ్డి, మావలకు చెందిన బోరంచు గంగారెడ్డి, బడాల విలాస్ రెడ్డి, తాంసికి చెందిన సామ సంతోశ్రె డ్డి, సీనియర్ నాయకులు వి.ఆదినాథ్ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదివారం దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పట్టణఅధ్యక్షుడు లాలా మున్నా కూడా దరఖాస్తు చేసుకుంటారని ప్రచారం ఉంది. ఖానా పూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, ఆయన తనయుడు రితీశ్ రా థోడ్, సీనియ ర్ నాయకులు హరినాయక్, సట్ల అశోక్, ఇంద్రవెల్లి జెడ్పీటీసీ అర్క పుష్పలత, పెంబి జెడ్పీటీసీ జానుబాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ నుంచి కూడా టికెట్ ఆశిస్తూ రితీశ్ రాథోడ్ దరఖా స్తు చేసుకున్నారు. ఆయనతో పాటు అజ్మీరా ఆత్మారాం నాయక్, కోట్నాక విజయ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వందన దరఖాస్తు చేసుకున్నారు. -
ఎంపీ సోయం బాపూరావు క్షమాపణలు చెప్పాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. బాపూరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైన ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం ఆయన వ్యక్తిగతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. అసలు బాపూరావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో లంబాడాలు 90 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు’అని పేర్కొన్నారు. ఎల్బీనగర్ గిరిజన మహిళ అంశంపై శనివారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రవీంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందని రవీంద్ర నాయక్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోని మహిళలపై గిరిజన మహిళపై జరిగిన విధంగా అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళ లక్షి్మకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని రవీంద్ర నాయక్ తేల్చిచెప్పారు. -
ఎట్ల రిజిస్ట్రేషన్ చేస్తావో.. చూస్తా!
సాక్షి, ఆదిలాబాద్: ప్లాట్ల కొనుగోలు, డబ్బులు ముట్టజెప్పే వ్యవహారంలో ఓ రియల్టర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మధ్య జరిగిన ఆడియో సంభాషణ సంచలనం రేపింది. ఏడాది క్రితం జరిగిందని ఎమ్మెల్యే చెబుతున్నా.. ఇటీవలే ఆ ప్లాట్ల వ్యవహారం జరిగినట్టుగా చర్చ సాగుతోంది. ఆ రియల్టర్ నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్‌కుమార్ అని ప్రచారం సాగుతోంది. రియల్టర్ కిరణ్‌కుమార్ బోథ్‌లో కొన్నేళ్ల క్రితం చేసిన లేఅవుట్లో కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే బాపురావు డబ్బులు చెల్లించలేదని చెప్పుకుంటున్నారు. డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య ఓ మధ్యవర్తి ఉండటం, రియల్టర్ ఆ మధ్యవర్తిపై ఒత్తిడి తేవడం, దీంతో ఎమ్మెల్యే నేరుగా ఫోన్లో సంభాషించినట్లుగా వ్యవహారం సాగింది. ప్రధానంగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ ప్లాట్లను ఇతరులకు అమ్మేందుకు ఇటీవల ప్రయత్నాలు చేయగా, ఈ వివాదం చోటుచేసుకుందని అంటున్నారు. రియల్టర్, ఎమ్మెల్యే మధ్య సంభాషణ ఇలా.. ఎమ్మెల్యే: ఎవరో వచ్చి ప్లాట్ చూస్తున్నారటా.. ధన్నూరోల్లటా (బోథ్ మండలం ధన్నూర్ గ్రామస్తులు).. రియల్టర్: చూస్తారు కదా సార్.. ఏడాదిన్నర, రెండేళ్లు టైం ఇచ్చిన తర్వాత డబ్బులు రాకుంటే నా దగ్గర కూడా పైసల్లేవు కదా సార్. ఎమ్మెల్యే: ఔనండి.. ఉంటాయి పైసలు ఉంటాయి.. దునియ కూడా ఉంటది. రియల్టర్: ఏం సర్.. సంవత్సరాల కొద్దీ పేమెంట్ ఆగుతద. ఎమ్మెల్యే: లెక్కతో లెక్క చేసుకోవాలి కానీ.. లేనిపోని లొల్లి పెట్టుకోకండి.. రియల్టర్: ఎవరు పెడుతున్నరు సార్ లొల్లి.. రమ్మని అంటున్న కద సార్ ఆయన్ని (మధ్యవర్తిని).. లెక్క చేద్దామని, నేను పది సార్ల పోయిన ఆయన దగ్గరికి.. ఎమ్మెల్యే: కండిషన్ పెడుతున్నవట కదా.. రూ.28 లక్షలు నెట్ క్యాష్ తీసుకొని రా అంటున్నవట కదా. రియల్టర్: నెట్కాదు సార్.. ఫస్ట్ నా దగ్గరికి రా అన్న.. ఆయన మాటిమాటికి మీదగ్గరే వస్తున్నడు. ఎమ్మెల్యే: ఔనండి నేను పైసలు ఇయ్యాల కదా.. రియల్టర్: మరి ఇచ్చేయండి ఆయనకి.. మీరిచ్చేస్తే ఆయన నాకు తెచ్చి ఇస్తాడేమో.. నేను మిమ్మల్ని అడగట్లే. ఎమ్మెల్యే: నువ్వు బోథ్‌లో ఎట్ల ఉంటావో నేను చూస్తా. రియల్టర్: సరే సార్ నేను దందానే చేస్తలేను. మీ ఇష్టం. మీరు అట్ల అంటే దానికి ఏం చేయలేను నేను. ఎమ్మెల్యే: బోథ్‌లో ఎట్ల లేఅవుట్ తీసినవో, ఎట్ల చేసినవో.. పోనియ్యు అని మేము అడుగుతలేం. బోథ్‌కు రా నువ్వు ఎట్ల రిజిస్ట్రేషన్ చేస్తావో చూస్తా నేను. రియల్టర్: సరే దాందేముంది.. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి.. ఆ వాయిస్ నాది కాదు ఎమ్మెల్యే బాపురావుతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఫోన్లో వాయిస్ నాది కాదు. మార్ఫింగ్ చేసినట్టున్నారు. ఆయనతో రాజకీయ విభేదాలున్నవారు ఇలా చేసి ఉండొచ్చు. దాంతో నాకు సంబంధం లేదు. – రియల్టర్ కిరణ్‌కుమార్ బెదిరించలేదు ఇది నేను రియల్టర్‌తో ఏడాది కిందట మాట్లాడింది. నేను ఆయనను బెదిరించలేదు. బ్లాక్మెయిల్ చేయలేదు. నేనే రూ.28 లక్షలు బాకీ ఉన్నట్టు చెబుతున్నాను. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. – రాథోడ్ బాపురావు, బోథ్ ఎమ్మెల్యే -
‘ఆ బిల్లును వ్యతిరేకిస్తే..పాకిస్తాన్‌కు మద్దతిచ్చినట్లే’
సాక్షి, ఆదిలాబాద్: పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ఉన్న ముస్లింలకు అన్యాయం చేసే చట్టం కాదని.. టెర్రరిస్టులకు, చొరబాటుదారులకు అందులో చోటు కల్పించలేదని వివరించారు. బిల్లును వ్యతిరేకించే వారు పాకిస్తాన్‌కు మద్దతిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రజలకు మాయామాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముస్లింల ఓట్లు కోసం బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. హిందువులంతా ఒక్కటై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును మోదీకి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు.. ఆదిలాబాద్ స్థానిక నేతలు పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. డబ్బు కేంద్రానిది..సోకులు టీఆర్ఎస్ వాళ్లదని విమర్శించారు. టీఆర్ఎస్ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. గెలిచేవారికే మున్సిపల్ టికెట్లు ఇస్తామని, పైరవీకారులకు టికెట్లు ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. సర్వేలు ప్రకారమే టికెట్లు కేటాయిస్తామని బాపురావు వెల్లడించారు. -
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల తర్వాత 17వ లోక్‌సభ మొదటిసారిగా సమావేశం కానుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మొదటి మూడు రోజుల పాటు లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు, పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతలు ఇరువురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆదివారం ఈ నేతలు వేర్వేరుగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అనూహ్యంగా విజయం.. గత ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. మే 23న ఫలితాలు వెలబడ్డాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్‌పై 58వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు నియోజకవర్గాల్లో గెలుపొందగా ఒక్క ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అనూహ్యంగా ఇక్కడ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపొందడం చారిత్రాత్మకమైంది. ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గమైన ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నేత సోయం బాపురావు ఘన విజయం సాధించారు. పెద్దపల్లి నుంచి... పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ మూడో స్థానంలో నిలిచారు. వెంకటేశ్ నేత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అక్కడ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో కేటీఆర్ సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల ముందు వెంకటేశ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇద్దరు తొలిసారే.. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేత ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. సోయం బాపురావు గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక బొర్లకుంట నేత ఉద్యోగిగా పదవి విరమణ తీసుకొని డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరిక్షించుకుని విజయం సాధించారు. ఇదిలా ఉంటే సోయం బాపురావు తెలుగులో ప్రమాణస్వీకారం చేయనుండగా, వెంకటేశ్ నేతది తెలియరాలేదు. -
ఆదివాసీ అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలి
ఉట్నూర్/ఇంద్రవెల్లి (ఖానాపూర్): ‘రాష్ట్రంలో త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వు స్థానాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివాసీ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలి. లేదంటే తుడుందెబ్బ తరఫున ఆదివాసీ అభ్యర్థులను బరిలో నిలుపుతాం. కేసీఆర్‌కు ఆదివాసీల సత్తా ఏమిటో తెలిసి వచ్చేలా చేస్తాం’ అంటూ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ ఉద్యమ నాయకుడు సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏటీడబ్ల్యూఏసీ మాజీ చైర్మన్ సిడాం భీంరావ్ అధ్యక్షతన సోమవారం ఆదివాసీల ఐక్యత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పోరాటం చేస్తుండగా.. కేసీఆర్ లంబాడీలకు టికెట్లు కేటాయించి తమ మనోభావాలు దెబ్బ తీశారన్నారు. ఆదివాసీలంతా ఏకమై ‘లంబాడీ హఠావో.. ఆదివాసీ బచావో’ నినాదంతో ఆదివాసీ అభ్యర్థులను గెలుపించుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించకుంటే తగిన మూల్యం చెల్లించేలా చేస్తామని హెచ్చరించారు. ఎస్టీ రిజర్వు స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే లంబాడీ వర్గానికి చెందిన వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ తొమ్మిది తెగల పెద్దలంతా కలసి ఎస్టీ రిజర్వు స్థానాల్లో ఆదివాసీల నుంచి ఒక్కరినే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలుపడం ద్వారా ఎలాంటి విభేదాలు రావన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి 17 మంది ఆది వాసీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారు. పోటీలో ఉండే రాథోడ్ రమేశ్, రేఖానాయక్‌ల డిపాజిట్లు గల్లంతయ్యేలా ఆదివాసీల తడాఖా చూపుదామన్నా రు. లంబాడీ అభ్యర్థులు ఓట్ల కోసం ఆదివాసీ గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలని అన్నారు. అనంతరం ఆదివాసీ పెద్దలు నిర్ణయించిన అభ్యర్థికి పోటీలో మరో ఆదివాసీ అభ్యర్థి పోటీ చేయకుండా తీర్మానం చేశారు. సమావేశంలో మహారాష్ట్ర ప్రొఫెసర్ ఉయికే హంరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం
తాంసి: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే బాపూరావు అన్నారు. కప్పర్లలో మంగళవారం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి కప్పర్లను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపూరావును, లోక భూమారెడ్డిని గ్రామస్తులు సన్మానించారు. గ్రామ సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మె ల్యే కప్పర్ల నుంచి నిపాని వరకు రోడ్డుకు రూ.6 లక్షలు , రైతు వేదిక భవనం కోసం రూ.12 లక్షలు, రెండు ఆలయాలకోసం దేవదాయశాఖ తరఫున రూ.80 లక్షలు కేటాయిస్తామని గ్రామస్తులకు తెలిపారు. లోక భూమారెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు 50 శాతం సబ్సిడీతో రైతుకు గేదెలు పంపిణీ చేస్తామని, సొసైటీలు ఏర్పాటు చేసుకొని రుణాలు పొందాలని సూచించారు. సహకార సంఘం చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సదానంద్, వీడీసీ అధ్యక్షుడు శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, నాయకులు శ్రీధర్ రెడ్డి,నారాయణ,మహేందర్ ఉన్నారు. -
ఆదివాసీల లడాయి ఆగదు
గుడిహత్నూర్ (బోథ్): సహనం నశించాకే ఉద్యమం పురుడు పోసుకుందని, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ స్పష్టం చేశారు. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఆదివాసీ మహిళ పోరుగర్జనసభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా లంబాడాలు అనుభవిస్తున్న ఎస్టీ హోదా నుంచి వారిని తొలగించే వరకు ఈ ఉద్య మం ఆగదన్నారు. ఉద్యమంలో ఆదివాసీ మహిళలు కీలక పాత్ర పోషించాలన్నారు. లంబాడాలు ఎస్టీలు కాదని రుజువు చేసే పత్రాలను నివేదించినా నేటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. డీఎస్సీ రాసిన ఆదివాసీ మహిళ అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ఆదివాసీ ప్రొఫెసర్లు, మహిళలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ సంఘాల నేతలు హాజరయ్యారు. -
తండ్రిపై దత్తపుత్రుడు గొడ్డలితో దాడి
వాంకిడి(ఆదిలాబాద్ జిల్లా): వాంకిడి మండలం కానెర్గాం గ్రామంలో ఆదె బాపురావు(40) అనే వ్యక్తిపై అతని దత్తపుత్రుడు ఆదె శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేశాడు. ఘర్షణకు కారణాలు తెలియరాలేదు. తీవ్రగాయాలపాలైన బాపూరావును ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాపూరావుకు మెడపై, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి.