![Soyam Bapurao fire on BRS and Congress leaders - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/1/baburao.jpg.webp?itok=ubNsRmtY)
కైలాస్‌నగర్: పార్టీ మారుతున్నట్లు కొద్దిరోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని, తాను ఏ పార్టీలోకీ వెళ్లడం లేదని ఎంపీ సోయం బాపూరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటు ప్రజల చిరకాల కోరిక అని, దాన్ని నెరవేర్చే ఉద్దేశంతో రెండు నెలలుగా ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.
ఈ రైల్వేలైన్‌కు సంబంధించి ఫైనల్ లోకేషన్ సర్వే వరకు తెచ్చానని, వచ్చే బడ్జెట్‌లో దానికి కేంద్రం నిధులు కేటాయించే అవకాశముందని తెలిపారు. స్థానికంగా పార్టీకి సమయం ఇవ్వకపోవడంతో తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లుగా ప్రచారం జరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలపడుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని బాపూరావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment