వైరల్ అయిన ఫేక్ జాబితా
ఆదిలాబాద్: బీజేపీ అభ్యర్థులు తొలి జాబితా ఇదేనంటూ.. సోషల్ మీడియాలో పలువురు అభ్యర్థుల పేర్లతో వైరల్ అవుతోంది. ఇది పార్టీ ప్రకటించిన జాబితా కాదని, ఫేక్ లిస్ట్ అని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ జాబితాలో మొత్తం 11 నియోజకవర్గాలు–అభ్యర్థుల పేర్లు ఉండగా ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి.
నిర్మల్– ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్–లాలా ఓంప్రకాశ్ జైస్వాల్, ఖా నాపూర్(ఎస్టీ)–రాథోడ్ రమేశ్, బోథ్(ఎస్టీ)– సో యంబాపురావు, సిర్పూర్–పాల్వాయి హారీశ్‌బాబు ల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. మిగితా నియోజకవర్గాలు కూడా అనుమానం రాకుండా ఉండేందుకు కిషన్‌రెడ్డి, బండిసంజయ్, ఈటెల, కోమటిరెడ్డిల పేర్లు పెట్టారు. చాలామంది ఈ జాబితా వాస్తవమే అనుకుని, వారూ ఫార్వర్డ్ చేశారు. చివరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా ద్వారానే ఈ జాబితా పార్టీ ప్రకటన కాదని స్పష్టంచేశారు.
ఫేక్ ప్రచారాలు చేయొద్దు..
బీజేపీ అభ్యర్థులను ప్రకటించారంటూ సోషల్‌మీడి యా ద్వారా నకిలీ ప్రచారాలను చేయొద్దని పార్టీ జి ల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి కోరారు. సో షల్‌మీడియాలో గురువారం వైరల్ అయిన జాబి తాపై ఆమె స్పందిస్తూ ఇది పూర్తిగా ఫేక్ అన్నారు. పార్టీ ఏ విషయానైన్నా ప్రజలందరికీ తెలిసేలా ప్రకటిస్తుందన్నారు. ఇలాంటి నకిలీ ప్రచారాలతో ప్రజలను పక్కదోవ పట్టించడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: కల్వకుంట్ల కవితకు విజయశాంతి సానుభూతి!
Comments
Please login to add a commentAdd a comment