
మాట్లాడుతున్న మురుగుడు హనుమంతరావు
మంగళగిరి: వైఎస్సార్‌సీపీ సంక్షేమ పథకాలు భేషుగ్గా ఉన్నాయని, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి, ఆప్కో మాజీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు ప్రశంసించారు. టీడీపీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసి, మాజీ సీఎం చంద్రబాబుకు లేఖ పంపిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. టీడీపీలో తనకు గుర్తింపు లేదని, 2019 ఎన్నికల్లో తన కుటుంబానికి టికెట్ ఇస్తానని చెప్పి చివరకు లోకేశ్‌ను రంగంలోకి దింపి పార్టీ అధిష్టానం తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు, మాజీ ఇన్‌చార్జ్ పెత్తనంతో ఇతర కులాలన్నింటినీ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం
పార్టీలో చంద్రబాబు సామాజికవర్గానికి తప్ప మిగతా ఏ కులానికీ ప్రాధాన్యం లేదన్న విషయాన్ని తాను గుర్తించానని, ఆ సామాజికవర్గం వారు తప్ప ఇతర ఏ కులాలూ ఇమడలేవని ఓ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా తాను స్పష్టంగా చెబుతున్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే.. అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ తనకు రాజకీయ జీవితాన్నిచ్చారని, ఆయన కుటుంబంపై తనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మురుగుడు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment