
‘వ్యవసాయాన్ని జీఎస్టీలో కలపొద్దు’
వ్యవసాయరంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. దేశంలో రైతులు మొదటిసారి రోడ్ల మీదకి వస్తున్నారని, కానీ ప్రధానికి వారికి సాయం చేయాలనే బుద్ధి రావడం లేదన్నారు. పంటలు, వ్యవసా య పరికరాల మీద జీఎస్టీ లేకుండా చూడాలన్నారు.