సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు హిందూ-ముస్లిం ఎజెండాగా మారుతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన లేకపోవడం బాధాకరం అన్నారు. అనంతరం వీహెచ్ గ్రేటర్ వార్‌పై మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడ చూసిన కేటీఆర్, కేసీఆర్ ఫోటోలే కనిపిస్తున్నాయి. బండి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసి సర్జికల్ స్ట్రైక్ అంటున్నాడు..ఆయనకు ఎలా తెలిసింది?. అక్బరుద్దీన్ కేవలం ముస్లిం ఓట్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మతం ముసుగులో ప్రజలని రెచ్చగొడుతున్నారు. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్‌లో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ముస్లింలకు న్యాయం చేయలేదు. పాతబస్తీలో బంకర్స్, ట్యాంకర్లు ఉన్నాయా అని వీహెచ్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. (ఆమె ముస్లిం కాదు : ఒవైసీ)
‘ఎవరి మాటలు వారు మాట్లాడుతున్నారు.. ఇలాంటి వారిని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాను. ఒక దుబ్బాక లో గెలిచినంత మాత్రాన పొంగి పోవద్దు. మేము చేసిన చిన్న పొరపాటు వల్ల తప్పిదం జరిగింది. ఎవరు మా పార్టీ నుంచి వెళ్లినా నష్టం లేదు. రక్తపాతం చేసి ఓట్లు తీసుకోవాలని బండి చూస్తున్నారు.. మహారాష్ట్ర, బీహార్ వెళ్లినవ్ ఎవరికి లాభం చేశావు అసద్’ అని వీహెచ్ ప్రశ్నించారు
Comments
Please login to add a commentAdd a comment