ఆప్‌కు భారుచా సీటు​: ‘అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం’ | Mumtaz Patel Apologises After Bharuch Seat Slips Away From Congress - Sakshi
Sakshi News home page

ఆప్‌కు భారుచా సీటు​: ‘అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం’

Published Sat, Feb 24 2024 4:49 PM | Last Updated on Sat, Feb 24 2024 4:58 PM

Mumtaz Patel apologises after Bharuch seat slips away from Congress - Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌​ పార్టీ.. ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాలు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా గురుజరాత్‌లో సైతం కాంగ్రెస్‌ పార్టీ ఆప్‌తో సీట్ల పంపకాన్ని ఫైనల్‌ చేసింది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ, ఆప్‌ పొత్తులో భాగంగా పోటీ చేయనున్నాయ. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ.. ఆప్‌కు రెండు సీట్లను ఆఫర్‌ చేసింది. ఈ మేరకు  ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్‌, ఆప్‌ పొత్తుపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. 

తాజాగా అహ్మద్‌ పటేల్ కూతురు ముంతాజ్‌ పటేల్‌ ఎక్స్‌ ‘ ట్విటర్‌’ వేదికగా స్పందించారు. ‘భారుచా జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలు, పార్టీ కేడర్‌కు క్షమాపణలు తెలుపుతున్నా. కాంగ్రెస్‌, ఆప్‌ పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానం పొందలేకపోయాం. మీ నిరాశను నేను పంచుకుంటాను. మనమంతా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. 45 ఏళ్ల అహ్మద్‌ పటేల్‌ వారసత్వాన్ని వృథా కానివ్వం’ అని ఆమె తెలిపారు. గుజరాత్‌లో పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ.. ఆప్‌కు కేటాయించింది. ఈ క్రమంలో మంతాజ్‌ ఖాన్‌ ఆ  స్థానంపై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంనే ఆమె తన జిల్లా కేడర్‌కు క్షమాపణలు చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

మరోవైపు..  అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైసల్‌ కూడా స్పందించారు. ‘నేను మరోసారి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలిసి మాట్లాడుతా. నామినేషన్‌ వేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. గాంధీ కుటుంబం నా కుటుంబంతో సమానం. భారుచా లోక్‌సభ స్థానానికి సంబంధించి.. అహ్మద్‌ పటేల్‌ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను అధిష్టానం అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా’అని తెలిపారు. ‘పార్టీ  నిర్ణయంపై కార్యకర్తలు, నేను సంతోషంగా లేము. ఈ నిర్ణయం తీసుకోకూడదని మేము కోరుకున్నాము. కానీ.. కాంగ్రెస్‌ హైకమాండ్ తీసుకుంది. కావున మేము దాన్ని అనుసరిస్తాం. పార్టీ నిర్ణయాన్ని నేను, కార్యకర్తలం అనుసరిస్తాం​’ అని ఫైసల్‌ పేర్కొన్నారు.

చదవండి: ఆప్‌, కాంగ్రెస్‌ల సీట్‌ షేరింగ్‌.. ఎవరికెన్ని సీట్లంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement