గెనీబెన్ నాగాజీ ఠాకోర్. ఉత్తర గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో ఒకరు. అసెంబ్లీలో పారీ్టకి బలమైన గొంతుక. సభలో ధాటైన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది కలిగిన ప్రజాప్రతినిధి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుమ కూడా వావ్ స్థానం నుంచి విజయం సాధించారు. తన నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించే నాయకురాలు. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమమైనా తప్పనిసరిగా హాజరవుతారు. బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగి బీజేపీకి గట్టి సవాలే విసురుతున్నారు...
పంచాయతీ నుంచి...
2017 అసెంబ్లీ ఎన్నికలు గెనీబెన్ రాజకీయ జీవితంలో కీలక మలుపు. వావ్ నుంచి బీజేపీ సీనియర్ నేత, మంత్రి శంకర్ చౌదరీని ఓడించడంతో ఆమె పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. ఆమెకు కేవలం రెండో ఎన్నికలవి. జైన్ విశ్వభారతి ఇన్‌స్టిట్యూట్ నుంచి పొలిటికల్ సైన్స్ చదువుతూ గ్రాడ్యుయేషన్ మధ్యలోనే వదిలేశారు. పంచాయతీ సభ్యురాలిగా చేశారు. 2012లో కాంగ్రెస్ వావ్ నుంచి టికెటిచి్చంది. అప్పుడు 12వేల ఓట్లతో ఓడినా 2017లో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో ఒకరు.
క్రౌడ్ ఫండింగ్‌తో నిధుల సేకరణ...
బనస్కాంత జిల్లాలో అన్ని సామాజికవర్గాల వారూ తనను సోదరిగా భావిస్తారంటారు గెనీబెన్. ఎన్నికల ఖర్చు కోసం నియోజకవర్గంలో క్యూ ఆర్ కోడ్‌ను క్రియేట్ చేసి మరీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ‘‘బీజేపీకి బలమైన ఆర్థిక వనరులున్నాయి. నాకున్నది విలువలు, సామాజిక సూత్రాలే. అయినా బలమైన సిద్ధాంతంతో పోరాడేవారిని ఎవరూ ఓడించలేరు. కనుక దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లడానికి తోచిన సాయం చేయండి’’ అని ప్రజలను కోరుతున్నారు. రాజస్తాన్, పాకిస్తాన్‌తో సరిహద్దులో ఉన్న లోక్‌సభ స్థానం బనస్కాంత. ‘సీమ దర్శన్’ పేరుతో ఇక్కడ సరిహద్దు పర్యాటక స్థలం కూడా ఉంది. ఇక్కడ ఠాకోర్ ఓటర్లు 18 శాతం, చౌదరి ఓటర్లు 13 శాతం ఉన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు...
కులాంతర, మతాంత వివాహాలను నిషేధిస్తు ఠాకోర్ సామాజికవర్గం తీసుకున్న నిర్ణయాన్ని గెనీబెన్ సమరి్థంచడం వివాదం రేపింది. యువతులకు మొబైల్‌ఫోన్లను నిషేధించడాన్ని కూడా ఆమె సమరి్థంచారు. ‘‘బాలికలకు మొబైల్‌ఫోన్లను నిషేధించడంలో తప్పు లేదు. మొబైల్స్‌కు దూరంగా
ఉండి బాగా చదువుకోవాలి’’ అని సూచించడంపై చాలా విమర్శలే వచ్చాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment