banaskantha
-
Lok sabha elections 2024: వావ్! గెనీబెన్!!
గెనీబెన్ నాగాజీ ఠాకోర్. ఉత్తర గుజరాత్లో కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో ఒకరు. అసెంబ్లీలో పారీ్టకి బలమైన గొంతుక. సభలో ధాటైన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది కలిగిన ప్రజాప్రతినిధి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుమ కూడా వావ్ స్థానం నుంచి విజయం సాధించారు. తన నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించే నాయకురాలు. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమమైనా తప్పనిసరిగా హాజరవుతారు. బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగి బీజేపీకి గట్టి సవాలే విసురుతున్నారు... పంచాయతీ నుంచి... 2017 అసెంబ్లీ ఎన్నికలు గెనీబెన్ రాజకీయ జీవితంలో కీలక మలుపు. వావ్ నుంచి బీజేపీ సీనియర్ నేత, మంత్రి శంకర్ చౌదరీని ఓడించడంతో ఆమె పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. ఆమెకు కేవలం రెండో ఎన్నికలవి. జైన్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ నుంచి పొలిటికల్ సైన్స్ చదువుతూ గ్రాడ్యుయేషన్ మధ్యలోనే వదిలేశారు. పంచాయతీ సభ్యురాలిగా చేశారు. 2012లో కాంగ్రెస్ వావ్ నుంచి టికెటిచి్చంది. అప్పుడు 12వేల ఓట్లతో ఓడినా 2017లో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో ఒకరు.క్రౌడ్ ఫండింగ్‌తో నిధుల సేకరణ... బనస్కాంత జిల్లాలో అన్ని సామాజికవర్గాల వారూ తనను సోదరిగా భావిస్తారంటారు గెనీబెన్. ఎన్నికల ఖర్చు కోసం నియోజకవర్గంలో క్యూ ఆర్ కోడ్‌ను క్రియేట్ చేసి మరీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ‘‘బీజేపీకి బలమైన ఆర్థిక వనరులున్నాయి. నాకున్నది విలువలు, సామాజిక సూత్రాలే. అయినా బలమైన సిద్ధాంతంతో పోరాడేవారిని ఎవరూ ఓడించలేరు. కనుక దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లడానికి తోచిన సాయం చేయండి’’ అని ప్రజలను కోరుతున్నారు. రాజస్తాన్, పాకిస్తాన్‌తో సరిహద్దులో ఉన్న లోక్‌సభ స్థానం బనస్కాంత. ‘సీమ దర్శన్’ పేరుతో ఇక్కడ సరిహద్దు పర్యాటక స్థలం కూడా ఉంది. ఇక్కడ ఠాకోర్ ఓటర్లు 18 శాతం, చౌదరి ఓటర్లు 13 శాతం ఉన్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు... కులాంతర, మతాంత వివాహాలను నిషేధిస్తు ఠాకోర్ సామాజికవర్గం తీసుకున్న నిర్ణయాన్ని గెనీబెన్ సమరి్థంచడం వివాదం రేపింది. యువతులకు మొబైల్ఫోన్లను నిషేధించడాన్ని కూడా ఆమె సమరి్థంచారు. ‘‘బాలికలకు మొబైల్ఫోన్లను నిషేధించడంలో తప్పు లేదు. మొబైల్స్‌కు దూరంగా ఉండి బాగా చదువుకోవాలి’’ అని సూచించడంపై చాలా విమర్శలే వచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Geniben Thakor: ఎన్నికల నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’
అహ్మదాబాద్: ‘ఈ ఎన్నికల్లో నేను గెలవకుంటే మళ్లీ నాకు అవకాశం దక్కదు. నా సొంత ఠాకూర్ వర్గం సాధికారత సాధించేందుకే కాంగ్రెస్ టికెట్ సాధించా’ అంటున్నారు గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెనీబెన్ ఠాకూర్. బనస్కాంత జిల్లా వావ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన గెనీబెన్ ఎన్నికల ప్రచార నిధుల కోసం ‘క్రౌడ్ ఫండింగ్’ బాట పట్టారు. ఆన్లైన్లో తన వినతికి బనస్కాంత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఆమె చెప్పారు. గత 40 రోజుల్లోనే రూ.50 లక్షలవిరాళాలు అందాయన్నారు. తన ప్రచార వాహన నిర్వహణ ఖర్చులు భరిస్తామని కొందరు ముందుకొస్తే, వేదికల ఏర్పాటు ప్రచార సామగ్రి, ఆహార పదార్థాలు తదితరాలకయ్యే వ్యయం సమకూరుస్తామంటూ మరికొందరు చెప్పారని ఆమె శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు. -
76 ఏళ్లుగా తిండీ, నీళ్లు ముట్టని యోగి కన్నుమూత
గాంధీనగర్: 76 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోని యోగి ప్రహ్లాద్ జాని(90) మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భక్తుల సంర్శనార్థం ఆయన మృతతదేహాన్ని రెండు రోజుల పాటు బనస్కంతలోని ఆశ్రమంలో ఉంచనున్నారు. అనంతరం గురువారం నాడు అదే ఆశ్రమంలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. కాగా ప్రహ్లాద్ జాని గుజరాత్‌లోని చరడా గ్రామంలో జన్మించారు. ఈ యోగిని అతని భక్తులు ప్రేమగా "చునిర్వాలా మాతాజీ" అని పిలుస్తారు. గుజరాత్లో ఇతని పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. తిండీ, నీళ్లు లేకుండా 76 ఏళ్లుగా జీవించడంతో అతనిపై ఎంతోమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. ఏమీ తినకుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య) ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అసలు కారణాన్ని మాత్రం రాబట్టలేకపోయారు. 2010లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఒక గదిలో ఉంచి వీడియో మానిటరింగ్ నిర్వహించారు. అనంతరం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, తదితర వైద్య పరీక్షలు జరిపారు. ఈ ఫలితాల్లో ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలున్నాయని వెల్లడైంది. అయితే ధ్యానమే తనను బతికిస్తోందని యోగి గతంలోనే సమాధానమిచ్చారు. కాగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండటం గమనార్హం. (శివాలయంలో సాధువుల దారుణ హత్య) -
రాహుల్ కారుపై రాళ్ల దాడి
► పగిలిన కారు అద్దాలు.. రాహుల్ క్షేమం ► గుజరాత్ వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఘటన ► ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు ► దాడి బీజేపీ కార్యకర్తల పనేనని కాంగ్రెస్ విమర్శ ధనేరా/న్యూఢిల్లీ: గుజరాత్లో వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాహనంపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో రాహుల్ కారు అద్దాలు పగిలిపోయాయి. ప్రత్యేక భద్రత దళం(ఎస్పీజీ) వెంటనే అప్రమత్తమవటంతో ఆయన ఎలాంటి గాయాల్లేకుండానే క్షేమంగా బయటపడ్డారు. పిరికిపందల చర్యలకు తాను భయపడనని రాహుల్ అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనలపై మండిపడింది. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించింది. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ అవకాశవాద రాజకీయాలకు విసిగి ప్రజలే దాyì చేశారని పేర్కొంది. అసలేం జరిగింది?.. తాజా వరదలకు అతలాకుతలమైన రాజస్తాన్, ఉత్తర గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను రాహుల్ గాంధీ పరిశీలించారు. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం గుజరాత్‌లోని బనాస్కాంత జిల్లాలో రాహుల్ పర్యటించారు. ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో బాధితులతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడేందుకు ధనేరాలోని మార్కెటింగ్ యార్డుకు రాహుల్ చేరుకున్నారు. లాల్‌చౌక్ ప్రాంతంలో స్థానికులను, రైతులనుద్దేశించి ఆయన మాట్లాడేందుకు సిద్ధమవగానే స్థానికులు నల్లజెండాలతో నిరసన తెలపటంతోపాటు మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజలను చెదరగొట్టారు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన రాహుల్ అక్కడినుంచి వెళ్లిపోతున్న సమయంలో ప్రజలు వాటర్ ప్యాకెట్లను కాన్వాయ్‌పైకి విసిరారు. కాన్వాయ్ ధనేరా హెలిప్యాడ్ సమీపంలోకి రాగానే.. కొందరు నిరసనకారులు రాహుల్ వాహనంపైకి రాళ్లురువ్వారు. దీంతో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ఒకవైపు అద్దాలు పగిలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎస్పీజీ దళం రాహుల్‌ను వాహనం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎస్పీజీ దళ సభ్యుడికి స్వల్ప గాయాలయ్యాయి. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధనేరా ఎమ్మెల్యే జోయ్తాభాయ్ పటేల్ (కాంగ్రెస్) ప్రస్తుతం బెంగళూరు ఈగల్టన్ రిసార్టులోని క్యాంపులో ఉన్నారు. కాగా, తనపై దాడి చేస్తే భయపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. ‘ఇలాంటి పిరికిపంద చర్యలకు, మోదీ మోదీ అంటూ చేసే నినాదాలకు నేను భయపడను. మీ బాధలను విని, అర్థం చేసుకునేందుకు వచ్చాను. వీలైనంత సాయం చేద్దామనుకున్నాను. సత్యాన్ని చూడాలనుకోని, అర్థం చేసుకోలేని వారే భయపడతారు. నేను కాదు’ అని దాడి అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో కాంగ్రెస్ నేత, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. బీజేపీ గూండాలపనే: కాంగ్రెస్ రాహుల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తే బీజేపీ గూండాలు సిమెంటు ఇటుకలతో దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రాహుల్‌వి ‘ఫొటో’ రాజకీయాలు: బీజేపీ గుజరాత్, రాజస్తాన్‌లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన ఫొటో రాజకీయం చేసేందుకేనని బీజేపీ విమర్శించింది. ‘ప్రజలను గూండాలు, రౌడీలని అనొద్దు. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్టులో ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ చేస్తున్న రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. అందుకే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. -
భారీవర్షాలు, వరదలతో అతలాకుతలం
-
టీచర్లు కొట్టారని.. విద్యార్థి ఆత్మహత్య
అహ్మదాబాద్: మరో నెలరోజుల్లో పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం చదువు లేకో, చదువు రాకో కాదు. చిన్న కారణానికే టీచర్లు తనను తీవ్రంగా కొట్టినందుకు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. 16 ఏళ్ల ప్రకాశ్ చౌహాన్ స్థానిక గాయత్రి విద్యాలయంలో పదోతరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సంబంధించిన కెమెరాను పాడుచేశాడని ఆరోపిస్తూ నలుగురు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థి ప్రకాశ్‌ను గదిలో బంధించి, విపరీతంగా కొట్టారు. గాయాలతో ఇంటికి వెళ్లిన ప్రకాశ్ జరిగిన విషయాన్ని తండ్రితో చెప్పి విపరీతంగా ఏడ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు స్కూల్ పై దాడి చేశారు. ప్రకాశ్ తండ్రి ఫిర్యాదుమేరకు నలుగురు టీచర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.