Bharuch
-
రేప్ చేసి, జననాంగంలో ఇనుప రాడ్ జొప్పించి...
వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్ జిల్లాలోని ఝగాడియా పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కుటుంబం జార్ఖండ్ నుంచి వలసవచ్చింది. నిందితుడు విజయ్ పాశ్వాన్ బాలిక తండ్రితోపాటు పనిచేస్తున్నాడు. సమీప గుడిసెలో ఉంటూ బాలికను కిడ్నాప్‌చేసి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పొదల్లోకి తీసుకెళ్లి రేప్‌చేసి పారిపోయాడు. రక్తమోడుతూ బాలిక ఏడుస్తుండటంతో తల్లి చూసి ఆస్పత్రకి తరలించింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాలికను అతను గత నెలలోనూ రేప్ చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. -
ఆప్‌కు భారుచా సీటు: ‘అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాలు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా గురుజరాత్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో సీట్ల పంపకాన్ని ఫైనల్ చేసింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ పొత్తులో భాగంగా పోటీ చేయనున్నాయ. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు రెండు సీట్లను ఆఫర్ చేసింది. ఈ మేరకు ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్, ఆప్ పొత్తుపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. Deeply apologize to Our district cadre for not being able to secure the Bharuch Lok Sabha seat in alliance.I share your disappointment.Together, we will regroup to make @INCIndia stronger .We won’t let @ahmedpatel 45 years of Legacy go in vain. #bharuchkibeti — Mumtaz Patel (@mumtazpatels) February 24, 2024 తాజాగా అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఎక్స్ ‘ ట్విటర్’ వేదికగా స్పందించారు. ‘భారుచా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ కేడర్‌కు క్షమాపణలు తెలుపుతున్నా. కాంగ్రెస్, ఆప్ పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానం పొందలేకపోయాం. మీ నిరాశను నేను పంచుకుంటాను. మనమంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. 45 ఏళ్ల అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’ అని ఆమె తెలిపారు. గుజరాత్లో పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు కేటాయించింది. ఈ క్రమంలో మంతాజ్ ఖాన్ ఆ స్థానంపై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంనే ఆమె తన జిల్లా కేడర్‌కు క్షమాపణలు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. #WATCH | On seat-sharing between Congress and AAP and the Bharuch seat of Gujarat going to AAP, Faisal Ahmed Patel, Congress leader and son of Senior Congress leader late Ahmed Patel says, "...My party workers and I are not happy and we wanted this decision to not be taken but if… pic.twitter.com/QUCkOV8aIv — ANI (@ANI) February 24, 2024 మరోవైపు.. అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ కూడా స్పందించారు. ‘నేను మరోసారి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి మాట్లాడుతా. నామినేషన్ వేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. గాంధీ కుటుంబం నా కుటుంబంతో సమానం. భారుచా లోక్‌సభ స్థానానికి సంబంధించి.. అహ్మద్ పటేల్ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను అధిష్టానం అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా’అని తెలిపారు. ‘పార్టీ నిర్ణయంపై కార్యకర్తలు, నేను సంతోషంగా లేము. ఈ నిర్ణయం తీసుకోకూడదని మేము కోరుకున్నాము. కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. కావున మేము దాన్ని అనుసరిస్తాం. పార్టీ నిర్ణయాన్ని నేను, కార్యకర్తలం అనుసరిస్తాం’ అని ఫైసల్ పేర్కొన్నారు. చదవండి: ఆప్, కాంగ్రెస్‌ల సీట్ షేరింగ్.. ఎవరికెన్ని సీట్లంటే.. -
ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్‌లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫ్యాక్టరీ మొత్తాన్ని మంటలు దహించివేస్తుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, పరిశ్రమలో పనిచేసే సుమారు 40 మంది సిబ్బంది గాయాలపాలైనట్లు బరూచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నికీలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. (కళ్ల ముందే కష్టం బూడిద) మరోవైపు అధికారులు ముందస్తు జాగ్రత్తగా పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై బరూచ్ జిల్లా కలెక్టర్ ఎండీ మోడియా మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం అగ్రో కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలుళ్లు సంభవించాయని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా సోషల్ మీడియాలోనూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. (భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం) -
షాకింగ్: గాల్లోకి ఎగిరి, పల్టీలు కొట్టి!
సాక్షి, భరూచ్: ఇంటి నుంచి బయటకు వెళ్తే ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేం. వాహనాలు మాత్రమే కాదు జంతువు కూడా ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశాలున్నాయి. గుజరాత్లో అలాంటి ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. స్థానిక భరూచ్ ప్రాంతంలో ఓ మహిళ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతోంది. పసుపు రంగు చీర ధరించిన ఆ మహిళ చాలా జాగ్రత్తగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ఎద్దు రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ ఎద్దు కొమ్ములతో మహిళపై దాడి చేసింది. కొమ్ములతో గట్టిగా మహిళను గాల్లోకి లేపి విసిరికొట్టింది. దీంతో గాల్లోకి దాదాపు పది అడుగుల ఎత్తుకు ఎగిరిన మహిళ.. పల్టీలు కొడుతూ కింద పడిపోయారు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు ఏం జరిగిందోనని బాధితురాలి వద్దకు పరుగులు తీయడం దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.