Mumtaz
-
'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా ఎదుగుతన్న సమయంలోనే దర్శకుడు మజర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. తాజాగా మరోసారి అలాంటి సలహాలు ఇచ్చింది జీనత్ అమన్. పెళ్లికి ముందు సహజీవనం చేయాలంటూ యువతకు సలహాలు ఇచ్చింది. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు.. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే జీనత్ సలహాలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరికొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో సీనియర్ నటి ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీనత్ అలాంటి సలహాలు ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది. స్త్రీలు ఇలాంటి సంస్కృతిని అనుసరించినట్లయితే వివాహ వ్యవస్థ నిరుపయోగం అవుతుందని ముంతాజ్ తెలిపింది. సోషల్ మీడియాలో జీనత్ ఇచ్చే సలహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముంతాజ్ పేర్కొంది. ఆమె కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం మంచిది కాదని హితవు పలికింది. మా నైతిక విలువలకు విరుద్ధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని సూచించింది. ఇలాంటి సంబంధాలపై సలహాలు ఇచ్చే చివరి వ్యక్తి జీనత్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ముంతాజ్ తెలిపింది. గతంలో జీనత్ అమన్... నటుడు మజార్ ఖాన్‌తో వివాహంపై ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మజర్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమెకు చాలా ఏళ్ల క్రితమే తెలుసని ముంతాజ్ వెల్లడించింది. ఆమె వివాహం ఒక ప్రత్యక్ష నరకమని పేర్కొంది. కాగా.. జీనత్ అమన్ మొదట సంజయ్ ఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత జీనత్ అమన్ 1985లో మజర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 1998లో అతను మరణించే వరకు అతనితోనే ఉంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో అతన్ని వివాహం చేసుకుని తప్పు చేశానని..పెళ్లయిన 12 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా ఆనందంగా లేనని పేర్కొంది. -
విపరీతమైన నొప్పితో విలవిల్లాడా, వాళ్లు లేకపోయుంటే.. ఏడ్చేసిన నటి
గ్లామర్ రోల్స్ చేస్తే డబ్బులు రాలతాయి. క్రేజ్ దక్కుతుంది. కానీ అది కొంతకాలమే! గ్లామర్ రోల్స్ చేసినవారికి మలి వయసులో అమ్మ, నానమ్మ లాంటి పాత్రలు రావడం కష్టమే అవుతుంది. జయలలితకు అలాంటి పరిస్థితే ఎదురైంది. హీరోయిన్ ముంతాజ్‌ది మరో రకమైన గోడు! అలాంటి పాత్రలు ఎందుకు చేశానా? అనిపిస్తోందని బాధఫడుతోంది ముంతాజ్. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీకి దూరం అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, చాలాబాగుంది, జెమిని, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, పెళ్లి కాని పెళ్లాం అవుతుంది, ఆగడు, టామీ చిత్రాల్లో అతిథి పాత్రలో, ఐటం సాంగ్స్‌లో మెరిసింది. తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించింది. 2015 తర్వాత వెండితెరపై కనిపించకుండా పోయిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. నొప్పితో గిలగిల్లాడా.. ముంతాజ్ మాట్లాడుతూ.. 'ఒకరోజు నాకు విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. ఎటూ కదల్లేకపోయాను. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్లు ఆ నొప్పిని అలాగే భరించాను. ఆ తర్వాత నాకు ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాని వల్ల నొప్పులతో విలవిల్లాడిపోయేదాన్ని. కీళ్ల జాయింట్ వద్ద సమస్య వల్ల కూర్చోలేకపోయేదాన్ని. సరిగా నిలబడలేకపోయేదాన్ని. శరీరాన్ని కదిలించడమే కష్టమయ్యేది. డిప్రెషన్ ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకునేదాన్ని. బయటకు మాత్రం అదేదీ కనిపించకపోవడంతో నాకేముంది, బాగానే ఉన్నాననుకునేవారు. ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలిసేది కాదు, కానీ రోజంతా ఏడుస్తూ ఉండేదాన్ని. మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింది. ఆ సమయంలో కుటుంబం నాకు తోడుగా ఉండకపోయుంటే చచ్చిపోయేందుకు ప్రయత్నించేదాన్ని. ఆ ఫోటోలు మాత్రం షేర్ చేయొద్దు ఒకప్పుడు గ్లామర్ రోల్స్ చేసినందుకు ఇప్పుడు ఇబ్బందిపడుతున్నాను. నా దగ్గర బోలెడంత డబ్బుంటే దాని సాయంతో ఆ ఫోటోలన్నీ ఇంటర్నెట్లో డిలీట్ చేయాలనుంది. కానీ అది నా వల్ల అయ్యేది కాదు. దయచేసి అభిమానులెవరూ నా గ్లామర్ పిక్స్ షేర్ చేయకూడదని కోరుకుంటున్నాను. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలు మాత్రం షేర్ చేయకండి. పెళ్లంటారా? మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ ముంతాజ్ ఎమోషనలైంది. చదవండి: OTT: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం ప్రియుడితో రెండో పెళ్లి.. గ్రాండ్‌గా సీమంతం వేడుక! -
ఆప్‌కు భారుచా సీటు: ‘అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాలు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా గురుజరాత్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో సీట్ల పంపకాన్ని ఫైనల్ చేసింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ పొత్తులో భాగంగా పోటీ చేయనున్నాయ. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు రెండు సీట్లను ఆఫర్ చేసింది. ఈ మేరకు ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్, ఆప్ పొత్తుపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. Deeply apologize to Our district cadre for not being able to secure the Bharuch Lok Sabha seat in alliance.I share your disappointment.Together, we will regroup to make @INCIndia stronger .We won’t let @ahmedpatel 45 years of Legacy go in vain. #bharuchkibeti — Mumtaz Patel (@mumtazpatels) February 24, 2024 తాజాగా అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఎక్స్ ‘ ట్విటర్’ వేదికగా స్పందించారు. ‘భారుచా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ కేడర్‌కు క్షమాపణలు తెలుపుతున్నా. కాంగ్రెస్, ఆప్ పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానం పొందలేకపోయాం. మీ నిరాశను నేను పంచుకుంటాను. మనమంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. 45 ఏళ్ల అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’ అని ఆమె తెలిపారు. గుజరాత్లో పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు కేటాయించింది. ఈ క్రమంలో మంతాజ్ ఖాన్ ఆ స్థానంపై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంనే ఆమె తన జిల్లా కేడర్‌కు క్షమాపణలు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. #WATCH | On seat-sharing between Congress and AAP and the Bharuch seat of Gujarat going to AAP, Faisal Ahmed Patel, Congress leader and son of Senior Congress leader late Ahmed Patel says, "...My party workers and I are not happy and we wanted this decision to not be taken but if… pic.twitter.com/QUCkOV8aIv — ANI (@ANI) February 24, 2024 మరోవైపు.. అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ కూడా స్పందించారు. ‘నేను మరోసారి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి మాట్లాడుతా. నామినేషన్ వేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. గాంధీ కుటుంబం నా కుటుంబంతో సమానం. భారుచా లోక్‌సభ స్థానానికి సంబంధించి.. అహ్మద్ పటేల్ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను అధిష్టానం అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా’అని తెలిపారు. ‘పార్టీ నిర్ణయంపై కార్యకర్తలు, నేను సంతోషంగా లేము. ఈ నిర్ణయం తీసుకోకూడదని మేము కోరుకున్నాము. కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. కావున మేము దాన్ని అనుసరిస్తాం. పార్టీ నిర్ణయాన్ని నేను, కార్యకర్తలం అనుసరిస్తాం’ అని ఫైసల్ పేర్కొన్నారు. చదవండి: ఆప్, కాంగ్రెస్‌ల సీట్ షేరింగ్.. ఎవరికెన్ని సీట్లంటే.. -
‘నేను చచ్చిపోలేదు.. బతికే ఉన్నా’
లండన్: తాను ఆరోగ్యంగా ఉన్నానని సీనియర్ నటి ముంతాజ్ అన్నారు. తను చనిపోయానని వస్తున్న వార్తలను ఆమె కొట్టిపడేశారు. ఒకవేళ తాను మరణిస్తే ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులే ప్రపంచానికి చెబుతారని... అంతవరకు గాసిప్‌రాయుళ్లు కాస్త సైలెంట్‌గా ఉండాలని చురకలు అంటించారు. మునుపటి కంటే కూడా ఇప్పుడే ఎంతో ఉత్సాహంగా ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు. కాగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముంతాజ్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో 72 ఏళ్ల ముంతాజ్ మరణించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు ప్రచారమయ్యాయి. (క్షమాపణలు కోరిన కపిల్ శర్మ) ఈ విషయంపై స్పందించిన ముంతాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నా. నా గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇది జోక్ చేయాల్సిన విషయమా? గతేడాది కూడా ఇలాగే రూమర్లు వ్యాప్తి చేశారు. నా బంధువులు, స్నేహితులు ఈ విషయం విని కంగారుపడ్డారు. దయచేసి మమ్మల్ని ఇలా ఇబ్బందుల్లోకి నెట్టవద్దు. ఈ సారి నా కూతురు, మనుమలు, మనుమరాళ్లు, అల్లుడు, నా భర్త అంతా ఒకేచోట ఉన్నాం. లాక్డౌన్ మమ్మల్ని కలిసి ఉండేలా చేసింది. ఎంతో ఆనందంగా, క్షేమంగా ఉన్న సమయంలో ఇలాంటి వార్తలు ప్రచారం కావడం ఇబ్బందికరంగా ఉన్నాయి. నన్నెందుకు చంపాలని భావిస్తున్నారు. సమయం వచ్చినపుడు నేనే వెళ్లిపోతాను కదా. అదేమీ దాయాల్సినంత రహస్యం కాదు కదా. నేను చనిపోగానే నా కుటుంబ సభ్యులు అందరికీ చెబుతారు’’అని అసహనం వ్యక్తం చేశారు. (నాకు ఎవరితోనూ సంబంధం లేదు: అలియా) View this post on Instagram Happier than before , livelier than before, healthier than before, more vibrant than before,more beautiful than before, generous and loving as ever .... Legend forever #Mumtaz ❤️ A post shared by Shaad Randhawa (@shaadrandhawa) on May 21, 2020 at 2:25am PDT -
‘ముంతాజ్ ఆంటీ బతికే ఉంది; సారీ’
సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక మంచి ఎంతగా ప్రాచుర్యం పొందుతుందో అంతకంటే ఎక్కువ వేగంతో నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. శుక్రవారం కూడా అలాంటి వార్తే ఒకటి వైరల్‌గా మారింది. బాలీవుడ్ పాతతరం హీరోయిన్ ముంతాజ్ చనిపోయిందంటూ సినీ, ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నాహ్తా ట్వీట్ చేశారు. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె కన్ను మూశారని తెలిపారు. దీంతో ముంతాజ్ ఆత్మకు శాంతి కలగాలంటూ నెటిజన్లు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ముంతాజ్ బతికే ఉన్నారు.. ఈ వార్తలపై స్పందించిన బాలీవుడ్ దర్శకుడు మిలాప్ జవేరి... ‘ఇదంతా అబద్ధం. ముంతాజ్ ఆంటీ వాళ్ల మేనల్లుడితో ఇప్పుడే మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ముంతాజ్ ఆంటీ బతికే ఉన్నారు. రూమర్లకు చెక్ పెట్టాలని ఆమె భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసి ముంతాజ్ మరణ వార్తను ఖండించారు. ఈ క్రమంలో ముంతాజ్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తనను క్షమించాల్సిందిగా కోమల్ నాహ్తా కోరారు. దేవుడి దయ వల్ల ఆమె బాగానే ఉన్నారని ట్వీట్ చేశారు. కాగా 1947లో జన్మించిన ముంతాజ్ పదకొండేళ్ల వయస్సులో బాలనటిగా తెరంగేట్రం చేశారు. మొదట సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమైనా ఆ తర్వాత హీరోయిన్గా రాణించారు. 70వ దశకంలోని గొప్ప డ్యాన్సర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉత్తమ నటిగా పలు అవార్డులుదక్కించుకున్నారు. 1970లో వ్యాపారవేత్త మయూర్ మాంధ్వానిని పెళ్లి చేసుకున్న ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. Mumtaz Aunty is alive and absolutely fine. Just spoke to her and @Shaadrandhawa her nephew. She would like for the rumors to stop 🙏 https://t.co/S79v5KEjcD — Milap (@zmilap) May 3, 2019