సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక మంచి ఎంతగా ప్రాచుర్యం పొందుతుందో అంతకంటే ఎక్కువ వేగంతో నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. శుక్రవారం కూడా అలాంటి వార్తే ఒకటి వైరల్‌గా మారింది. బాలీవుడ్ పాతతరం హీరోయిన్ ముంతాజ్ చనిపోయిందంటూ సినీ, ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నాహ్తా ట్వీట్ చేశారు. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె కన్ను మూశారని తెలిపారు. దీంతో ముంతాజ్ ఆత్మకు శాంతి కలగాలంటూ నెటిజన్లు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు.
ముంతాజ్ బతికే ఉన్నారు..
ఈ వార్తలపై స్పందించిన బాలీవుడ్ దర్శకుడు మిలాప్ జవేరి... ‘ఇదంతా అబద్ధం. ముంతాజ్ ఆంటీ వాళ్ల మేనల్లుడితో ఇప్పుడే మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ముంతాజ్ ఆంటీ బతికే ఉన్నారు. రూమర్లకు చెక్ పెట్టాలని ఆమె భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసి ముంతాజ్ మరణ వార్తను ఖండించారు. ఈ క్రమంలో ముంతాజ్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తనను క్షమించాల్సిందిగా కోమల్ నాహ్తా కోరారు. దేవుడి దయ వల్ల ఆమె బాగానే ఉన్నారని ట్వీట్ చేశారు. కాగా 1947లో జన్మించిన ముంతాజ్ పదకొండేళ్ల వయస్సులో బాలనటిగా తెరంగేట్రం చేశారు. మొదట సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమైనా ఆ తర్వాత హీరోయిన్‌గా రాణించారు. 70వ దశకంలోని గొప్ప డ్యాన్సర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉత్తమ నటిగా పలు అవార్డులుదక్కించుకున్నారు. 1970లో వ్యాపారవేత్త మయూర్ మాంధ్వానిని పెళ్లి చేసుకున్న ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Mumtaz Aunty is alive and absolutely fine. Just spoke to her and @Shaadrandhawa her nephew. She would like for the rumors to stop 🙏 https://t.co/S79v5KEjcD
— Milap (@zmilap) May 3, 2019
Comments
Please login to add a commentAdd a comment