గ్లామర్ రోల్స్ చేస్తే డబ్బులు రాలతాయి. క్రేజ్ దక్కుతుంది. కానీ అది కొంతకాలమే! గ్లామర్ రోల్స్ చేసినవారికి మలి వయసులో అమ్మ, నానమ్మ లాంటి పాత్రలు రావడం కష్టమే అవుతుంది. జయలలితకు అలాంటి పరిస్థితే ఎదురైంది. హీరోయిన్ ముంతాజ్‌ది మరో రకమైన గోడు! అలాంటి పాత్రలు ఎందుకు చేశానా? అనిపిస్తోందని బాధఫడుతోంది ముంతాజ్.
పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీకి దూరం
అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, చాలాబాగుంది, జెమిని, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, పెళ్లి కాని పెళ్లాం అవుతుంది, ఆగడు, టామీ చిత్రాల్లో అతిథి పాత్రలో, ఐటం సాంగ్స్‌లో మెరిసింది. తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించింది. 2015 తర్వాత వెండితెరపై కనిపించకుండా పోయిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది.
నొప్పితో గిలగిల్లాడా..
ముంతాజ్ మాట్లాడుతూ.. 'ఒకరోజు నాకు విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. ఎటూ కదల్లేకపోయాను. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్లు ఆ నొప్పిని అలాగే భరించాను. ఆ తర్వాత నాకు ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాని వల్ల నొప్పులతో విలవిల్లాడిపోయేదాన్ని. కీళ్ల జాయింట్ వద్ద సమస్య వల్ల కూర్చోలేకపోయేదాన్ని. సరిగా నిలబడలేకపోయేదాన్ని. శరీరాన్ని కదిలించడమే కష్టమయ్యేది.
డిప్రెషన్
ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకునేదాన్ని. బయటకు మాత్రం అదేదీ కనిపించకపోవడంతో నాకేముంది, బాగానే ఉన్నాననుకునేవారు. ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యాను. ఎందుకు ఏడుస్తున్నానో తెలిసేది కాదు, కానీ రోజంతా ఏడుస్తూ ఉండేదాన్ని. మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింది. ఆ సమయంలో కుటుంబం నాకు తోడుగా ఉండకపోయుంటే చచ్చిపోయేందుకు ప్రయత్నించేదాన్ని.
ఆ ఫోటోలు మాత్రం షేర్ చేయొద్దు
ఒకప్పుడు గ్లామర్ రోల్స్ చేసినందుకు ఇప్పుడు ఇబ్బందిపడుతున్నాను. నా దగ్గర బోలెడంత డబ్బుంటే దాని సాయంతో ఆ ఫోటోలన్నీ ఇంటర్నెట్‌లో డిలీట్ చేయాలనుంది. కానీ అది నా వల్ల అయ్యేది కాదు. దయచేసి అభిమానులెవరూ నా గ్లామర్ పిక్స్ షేర్ చేయకూడదని కోరుకుంటున్నాను. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలు మాత్రం షేర్ చేయకండి. పెళ్లంటారా? మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ ముంతాజ్ ఎమోషనలైంది.
చదవండి: OTT: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
ప్రియుడితో రెండో పెళ్లి.. గ్రాండ్‌గా సీమంతం వేడుక!
Comments
Please login to add a commentAdd a comment