'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి! | Mumtaz SLAMS Zeenat Aman For Promoting Live In Culture | Sakshi
Sakshi News home page

Mumtaz: 'పెళ్లికి ముందు సహజీవనం'.. అందుకే నరకం చూసింది!

Published Tue, Apr 16 2024 2:59 PM | Last Updated on Tue, Apr 16 2024 3:27 PM

Mumtaz SLAMS Zeenat Aman For Promoting Live In Culture - Sakshi

దమ్‌ మారో దమ్‌.. పాటలో తన పర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్‌ అమన్‌. స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతన్న సమయంలోనే దర్శకుడు మజర్‌ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రేమ, డేటింగ్‌ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్‌ కంట్రోల్‌ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్‌ ఎక్కేయడం కరెక్ట్‌ కాదని హెచ్చరించింది. 

తాజాగా మరోసారి అలాంటి సలహాలు ఇచ్చింది జీనత్ అమన్. పెళ్లికి ముందు సహజీవనం చేయాలంటూ యువతకు సలహాలు ఇచ్చింది. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు.. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే జీనత్‌ సలహాలపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. మరికొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే తాజాగా మరో సీనియర్ నటి ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. జీనత్‌ ‍అలాంటి సలహాలు ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది. స్త్రీలు ఇలాంటి సంస్కృతిని అనుసరించినట్లయితే వివాహ వ్యవస్థ నిరుపయోగం అవుతుందని ముంతాజ్‌ తెలిపింది. సోషల్ మీడియాలో జీనత్ ఇచ్చే సలహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముంతాజ్ పేర్కొంది. ఆమె కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చెత్త సలహాలు ఇ‍వ్వడం మంచిది కాదని హితవు పలికింది. మా నైతిక విలువలకు విరుద్ధంగా ఇలా చేయడం కరెక్ట్‌ కాదని సూచించింది. ఇలాంటి సంబంధాలపై సలహాలు ఇచ్చే చివరి వ్యక్తి జీనత్‌ అవ్వాలని కోరుకుంటున్నట్లు ముంతాజ్‌ తెలిపింది. 
 
గతంలో జీనత్ అమన్‌... నటుడు మజార్ ఖాన్‌తో  వివాహంపై  ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మజర్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమెకు చాలా ఏళ్ల క్రితమే తెలుసని ముంతాజ్‌ వెల్లడించింది. ఆమె వివాహం ఒక ప్రత్యక్ష నరకమని పేర్కొంది.  కాగా.. జీనత్ అమన్ మొదట సంజయ్ ఖాన్‌ను పెళ్లాడారు.  ఆ తర్వాత ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత జీనత్‌ అమన్ 1985లో మజర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 1998లో అతను మరణించే వరకు అతనితోనే ఉంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో అతన్ని వివాహం చేసుకుని తప్పు చేశానని..పెళ్లయిన  12 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా ఆనందంగా లేనని పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement