Zeenat Aman
-
ప్రేమించినవాడితో పారిపోయా.. మా అమ్మ తట్టుకోలేక..
ముందు సహజీవనం, తర్వాతే పెళ్లి.. అనే డైలాగ్‌తో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది బాలీవుడ్ నటి జీనత్ అమన్. డైరెక్ట్‌గా పెళ్లి చేసుకునే కంటే సహజీవనం ద్వారా ఒకరి గురించి మరొకరు పూర్తిగా అర్థం చేసుకుని.. అప్పటికీ జీవితాంతం కలిసుండాలనుకుంటేనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టమని సూచించింది. కొందరు దీన్ని తప్పుపట్టారు, మరికొందరు వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే తాజాగా జీనత్ అమన్ సోషల్ మీడియాలో తన తల్లి వర్ధిని ఫోటోలను షేర్ చేసింది.ఆమె మనసు విరిచేశాతన కోసం ఆమె జీవితాన్నే త్యాగం చేసిందని వెల్లడించింది. కానీ 1985లో తన మనసును ముక్కలు చేసినట్లు పేర్కొంది. ఒక ఫోటోలో తల్లితో పాటు తండ్రి అమనుల్లా ఖాన్ ఉన్నారు. మరో ఫోటోలో వర్ధిని రెండో భర్త హెయిన్జ్ ఉన్నారు(జీనత్ అతడిని అంకుల్ అని పిలిచేది). 'ఈ ప్రపంచంలో మా అమ్మను మించి అద్భుతమైన మహిళ ఎవరూ లేరు. మా నాన్నతో విడిపోయాక తనే సొంతంగా బిజినెస్ పాఠాలు నేర్చుకుని పనిచేయడం మొదలుపెట్టింది.అన్నీ అమ్మే చూసుకునేదినన్ను పెద్ద స్కూలులో చదివించింది. నేను సినీ ఇండస్ట్రీలో పని చేయాలనుకుంటున్నానని చెప్పగానే తన పనంతా వదిలేసి నాకు మేనేజర్‌గా మారింది. టిఫిన్లు ప్యాక్ చేసేది.. రెమ్యునరేషన్ లెక్కలు చూసుకునేది.. వచ్చిన డబ్బును పొదుపు చేసేది.. నాలో కాన్ఫిడెన్స్ పెంచేది. అప్పటికే నేను ఒకరితో విడిపోవడంతో నాకు జోడీగా సరిపోయే వ్యక్తి లేడనుకునేది. ఈ విషయంలో మాత్రం అమ్మను చాలా బాధపెట్టాను. తర్వాత కూడా నాకు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లిపోయేదాన్ని.అలా ఆమె బాధ పోగొట్టాతన చేతులు పట్టుకోగానే ఆ బాధ మటాష్ అయ్యేది. కానీ నేను పారిపోయి పెళ్లి చేసుకుని అమ్మ మనసు ముక్కలు చేశాను. కానీ నాకు బాబు పుట్టాక తన బాధను పోగొట్టాను. అమ్మ 1995లో చనిపోయింది. నా రక్షణ కవచం పోయినట్లు అనిపించింది' అని ఎమోషనలైంది. కాగా జీనత్ 1978లో సంజయ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లయిన ఏడాదికే విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. తర్వాత 1985లో నటుడు మజర్ ఖాన్‌ను పెళ్లాడింది. ఇతడు 1998లో మరణించాడు. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: కూతురితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రావణ భార్గవి.. హేమచంద్ర ఎక్కడంటూ.. -
'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా ఎదుగుతన్న సమయంలోనే దర్శకుడు మజర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. గతంలో ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. తాజాగా మరోసారి అలాంటి సలహాలు ఇచ్చింది జీనత్ అమన్. పెళ్లికి ముందు సహజీవనం చేయాలంటూ యువతకు సలహాలు ఇచ్చింది. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు.. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే జీనత్ సలహాలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మరికొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో సీనియర్ నటి ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీనత్ అలాంటి సలహాలు ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది. స్త్రీలు ఇలాంటి సంస్కృతిని అనుసరించినట్లయితే వివాహ వ్యవస్థ నిరుపయోగం అవుతుందని ముంతాజ్ తెలిపింది. సోషల్ మీడియాలో జీనత్ ఇచ్చే సలహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముంతాజ్ పేర్కొంది. ఆమె కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడం మంచిది కాదని హితవు పలికింది. మా నైతిక విలువలకు విరుద్ధంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని సూచించింది. ఇలాంటి సంబంధాలపై సలహాలు ఇచ్చే చివరి వ్యక్తి జీనత్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ముంతాజ్ తెలిపింది. గతంలో జీనత్ అమన్... నటుడు మజార్ ఖాన్‌తో వివాహంపై ముంతాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మజర్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమెకు చాలా ఏళ్ల క్రితమే తెలుసని ముంతాజ్ వెల్లడించింది. ఆమె వివాహం ఒక ప్రత్యక్ష నరకమని పేర్కొంది. కాగా.. జీనత్ అమన్ మొదట సంజయ్ ఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత ఏడాదికే విడిపోయారు. ఆ తర్వాత జీనత్ అమన్ 1985లో మజర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 1998లో అతను మరణించే వరకు అతనితోనే ఉంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో అతన్ని వివాహం చేసుకుని తప్పు చేశానని..పెళ్లయిన 12 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా ఆనందంగా లేనని పేర్కొంది. -
ప్రేమలో ఉన్నారా? ముందు సహజీవనం, తర్వాతే పెళ్లి!
దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. ఆ మధ్య ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అవతలివారి కోసం మీ వ్యక్తిత్వాన్ని పక్కన పడేయొద్దని సూచించింది. నటి రిలేషన్ పాఠాలు తాజాగా మరోసారి ఆమె ప్రేమ పాఠాలు చెప్పింది. 'నేను ఇంతకుముందు ఏదో పోస్ట్ పెడితే రిలేషన్షిప్ సలహాలు ఇవ్వమని దానికింద కామెంట్లు చేశారు కదా.. ఇంతకుముందు ఎక్కడా చెప్పని ఓ విషయం ఇప్పుడు చెప్తున్నా వినండి.. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటాను. సహజీవనమే బెటర్ రెండు కుటుంబాలు, రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్.. ఇలా అన్నింటినీ భాగం చేసే ముందు మీ ప్రేమకు టెస్ట్ పెట్టుకోండి.. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్. నాకైతే ఇదే లాజిక్‌గా అనిపిస్తుంది. మీరు రోజూ కొన్ని గంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. అదే ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకోగలుగుతారా? బాధలో ఉన్నప్పుడు నిజంగానే అవతలి వ్యక్తి ఓదార్చుతారా? నీకు నచ్చింది వంట చేసేందుకు ఒప్పుకుంటారా? సలహా బాగుంది కానీ.. బెడ్రూమ్, బాత్రూమ్.. అన్నింటినీ పంచుకోగలుగుతారా? సర్దుకుపోతారా? ఇలా ఎన్నో విషయాల్లో మీకంటూ ఓ క్లారిటీ వస్తుంది. సహజీవనం సరైనదే అంటే మన సమాజం అదొక పెద్ద పాపం అన్నట్లుగా చూస్తుంది.. అయినా చాలా విషయాల్లో సమాజం ఇలాగే ప్రవర్తిస్తుందిలే!' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన కొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
డేటింగ్ అంటూ అబ్బాయిలతో బెడ్ ఎక్కేయకండి: సీనియర్ హీరోయిన్
అన్ని రకాల పాత్రకు జీవం పోసిన నటి జీనత్ అమన్. దమ్ మారో దమ్.. పాటతో అప్పటితరానికే కాదు, ఇప్పటితరానికి కూడా సుపరిచితమే! అయితే స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు నెమ్మదిగా దూరమవుతూ వచ్చింది. 1985లో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్‌ను పెళ్లాడింది జీనత్. ఇద్దరు కొడుకులు పుట్టాక ఇంటికే పరిమితమైంది. అయితే మజర్, జీనత్ మధ్య పొరపచ్చాలు రావడంతో అతడి వేధింపులు తాళలేక విడాకులు తీసుకుంది. తాజాగా ఆమె ప్రేమ, డేటింగ్ అనే అంశంపై మాట్లాడింది. 'ఈ విషయం చెప్పాల్సి వస్తున్నందుకు నిజంగా సారీ.. ఇప్పటి జనరేషన్ వారి ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఒకరు మనసుకు నచ్చగానే అతడితో బెడ్ ఎక్కేయడం అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఆ పని చేయకండి. ఒకరి గురించి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకోండి. మీకు మీరే చాలా విలువైన వారు. అలాంటిది మిమ్మల్ని మీరు ఒకరికి అర్పించుకోకండి, మీ వ్యక్తిత్వాన్ని అవతల పారేయకండి. ప్రతి మహిళ ఆర్థికంగానూ నిలదొక్కుకోవాలి. అప్పుడే వారి భవిష్యత్తును వారే నిర్మించుకోగలరు. ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉంటారో వారు తమ కలను నిజం చేసుకునేందుకు, లక్ష్యాలను చేధించేందుకు ఒక అడుగు ముందే ఉంటారు. ఆర్థిక స్వేచ్ఛ అంటే డబ్బులు సంపాదించడం, చేతిలో డబ్బులుండటం మాత్రమే కాదు. ఎవరి ప్రమేయం లేకుండా మీకు నచ్చినట్లుగా మీరు బతికేయడం. అలా ఉన్నప్పుడే మీకు మీరుగా రాణించగలరు' అని చెప్పుకొచ్చింది. చదవండి: త్వరలో తల్లి కాబోతున్న బిగ్‌బాస్ విన్నర్.. వెకేషన్లో ఉన్న బ్యూటీ -
పాక్ ప్రధాని ప్రేమ కహానీ: ఆ హీరోయిన్స్‌తో ఇమ్రాన్ లవ్ ఎఫైర్, పెళ్లి వరకు వచ్చి..
Pakistan PM Imran Khan Love Story: సినిమా, క్రికెట్.. ఈ దేశంలో వినోదాన్ని పంచే రంగాలు. వదంతులుగానో.. వర్చువల్‌గానో.. వాస్తవంగానో.. వీరాభిమానుల భ్రాంతిగానో.. ఈ రెండు రంగాలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమ కథలు వినిపిస్తే.. వాళ్లు జంటగా కనిపిస్తే.. అంతకు మించిన సినిమా.. ఉత్కంఠ గొలిపే మ్యాచ్ ఏం ఉంటుంది? అలాంటి ఊసులు.. బాసలు.. కబుర్లను మోసుకొస్తోంది ఈ మొహబ్బతే! వీటిల్లో విషాదాంతాలుండొచ్చు.. హ్యాపీ ఎండింగ్లూ కనిపించొచ్చు! ఆ వరుసలో ఈ వారం శీర్షిక ముఖ్య భూమికలు బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ట్ జీనత్ అమన్.. పాకిస్తానీ ఏస్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.. ఇంకా.. చదవండి ఇది 1970,80ల ముచ్చట.. ఇటు బాలీవుడ్లో జీనత్.. అటు పాకిస్తాన్ క్రికెట్లో ఇమ్రాన్ హవా నడుస్తున్న కాలం. ఏదో మ్యాచ్ ఆడడానికి ఇమ్రాన్ ఖాన్ అండ్ టీమ్ ఇండియా వచ్చింది. మ్యాచ్ అయిపోయింది. సరదాగా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి కొందరు ప్రముఖులు.. సెలబ్రిటీలూ హాజరయ్యారు. వాళ్లలో జీనత్ అమన్ కూడా ఉంది. ఆ అందాన్ని చూసి అప్రతిభుడయ్యాడు ఇమ్రాన్. తెర మీద కన్నా అద్భుతంగా కనిపించింది. ఇమ్రాన్ హ్యాండ్సమ్నెస్కూ అంతే ఫిదా అయిపోయింది జీనత్. అతని కళ్లలోని సమ్మోహనం ఇంటికి వెళ్లినా ఆమెను వెంటాడింది. ఆమె నవ్వులోని స్వచ్ఛత అతన్నీ నిద్రపోనివ్వలేదు. స్నేహం పెంచుకున్నారు. ఇద్దరి షెడ్యూల్స్ ఏ మాత్రం మ్యాచ్ అయినా విదేశాలే వాళ్ల హ్యాంగవుట్ విలాసాలు. పత్రికల్లో ఆ ఫొటోలు.. అనుగుణంగా అల్లిన వార్తలు హల్చల్ చేశాయి. ఇద్దరి అభిమానులనూ ఎంతలా అలరింపచేశాయంటే ఆ ఇద్దరి ప్రణయంతో ఇండియా, పాకిస్తాన్ దగ్గరైపోయినట్టు.. వాళ్లు పరిణయమాడితే ఆ రెండు దేశాలూ కలసిపోతాయన్నట్టూ కలలు కనేంతగా. కానీ హఠాత్తుగా జీనత్ అమన్ మజహర్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఇమ్రాన్ జీవితంలోకీ ఇంకో స్త్రీ వచ్చింది. ఈ బ్రేకప్ గురించి ఎక్కడా ఏ వార్తా లేదు. ఆ ఇద్దరూ కూడా పెదవి విప్పలేదు. ఆ మాటకొస్తే ప్రేమలో పడ్డ విషయాన్నే అంగీకరించలేదు. కానీ.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఓ పుస్తకంలో ఇమ్రాన్, జీనత్ అనుబంధం గురించి రాసింది. అంటే అతని జీవితంలో జీనత్ ఉనికిని స్పష్టం చేసిందన్నమాట. అదీగాక.. కొన్నేళ్ల కిందట ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు జీనత్ లాహోర్ (పాకిస్తాన్)కు వెళ్లింది. అక్కడ జరిగిన ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఒక జర్నలిస్ట్ అడిగాడు ఇమ్రాన్‌తో ఆమెకున్న అనుబంధం గురించి! దానికి ఆమె ‘మేం పెద్దవాళ్లమైపోయాం. మా పిల్లలు పెరిగారు. పాత సంగతులను చర్చకు పెట్టడం ఇప్పుడు అవసరమా? గతాన్ని గతంలాగే ఉండనివ్వండి’ అందట. ఈ మధ్య జీనత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడట నాటి క్రికెటర్.. నేటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన బాలీవుడ్ మేటి నటి రేఖతో కూడా ప్రేమలో పడ్డాడని నిజం లాంటి వదంతి ప్రచారంలో ఉంది. దీనికీ నాటి సినిమా పత్రికలే సాక్ష్యం. ఆ కహానీ ఏంటంటే.. రేఖ అంటే ఇమ్రాన్ పంచప్రాణాలు పెట్టేవాడట. మ్యాచ్‌ల కోసం అతనెప్పుడు ఇండియా వచ్చినా పార్టీల్లో.. సన్నిహితుల గెట్ టుగెదర్ అకేషన్స్‌లో ఆ జంట ఫొటోలు నాటి మీడియాలో ప్రధానాకర్షణగా నిలిచేవి. వాళ్ల ప్రేమ వ్యవహారం కథనాలుగా సాగేది. ఒక పత్రికలో ప్రచురితమైన వ్యాసం ప్రకారం.. రేఖ వాళ్లమ్మ కూడా ఆ ప్రేమకు సమ్మతం తెలిపిందట. అంతేకాదు ఓ జ్యోతిష్యుడిని కలసి వాళ్ల జాతకాలూ చూపించిందట ఆ ఇద్దరి వైవాహిక బంధం ఎలా ఉండనుందని! రేఖతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి చాలా ఆసక్తి చూపేవాడట ఇమ్రాన్. ఆ జంట తరచుగా బీచ్‌లో, నైట్ క్లబ్లో కనిపించేదట. ‘వాళ్లిద్దరూ ఒకర్నొకరు చాలా ఇష్టపడ్డారు’ అని ఆ ఇద్దరి సన్నిహితుల మాట కూడా. ఒకానొక సమయంలో ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలూ వచ్చాయట. దానిమీదే స్పందిస్తూ కావచ్చు ‘ఆ నటి సాంగత్యాన్ని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ రిలేషన్‌ను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని అనుకోలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదు’ అని ఇమ్రాన్ చెప్పిన మాటకూ ఆ వ్యాసం చోటిచ్చింది. అలా ఆయన జీవితంలో రేఖ అధ్యాయమూ ముగిసింది. షబానా ఆజ్మీ, మున్మున్ సేన్లతోనూ ఇమ్రాన్ ప్రేమ ప్రయాణం సాగిందని రూమర్స్. - ఎస్సార్ -
ప్రేమించిన హీరో.. విషాదాన్ని పంచిన విలన్
దమ్మారో దమ్.. పాటను ఆస్వాదించిన వాళ్లంతా జీనత్ అమాన్ అభినయ మాయలో పడిపోయినవాళ్లే! హిందీ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులూ ఆమెను ఆరాధించారు.. అభిమాన మత్తులో తూలిపోయారు! తెర మీది ఆ వెలుగు జీనత్ జీవితాన్ని జన్నత్ (స్వర్గం)గా మార్చలేదు లవ్ లైఫ్‌ను నీడలా వెంటాడింది... అవమానాలు, చేదు అనుభవాలను మిగిల్చింది.. ఈ కథలో ఆమె ప్రేమించిన హీరో.. ఆమెకు విషాదాన్ని పంచిన విలన్ సంజయ్ ఖాన్!! జర్నలిస్ట్, మోడల్‌గా ఉన్న జీనత్ అమాన్ 1970లో ‘హల్చల్’తో నటిగా పరిచయం అయినా ‘హరే రామ హరే కృష్ణ’తోనే స్టార్డమ్ తెచ్చుకుంది. గ్లామర్‌కు గ్రామర్ నేర్పింది.. నటనను జోడించింది. 1977లో ‘అబ్దుల్లా’ సినిమా అవకాశంతో జీనత్ జీవితంలోకి ప్రవేశించాడు సంజయ్ ఖాన్. కథానాయకుడిగా సూపర్ హిట్స్ కన్నా ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ తమ్ముడిగానే గుర్తింపు అతనికి. ఆర్టిస్ట్‌గా కన్నా అందగాడిగానే ఫాలోయింగ్ ఎక్కువ. అతను హీరోగా నిలదొక్కుకుంటున్న నాటికే జీనత్ అత్యధిక పారితోషికం పొందుతున్న మేటి కథానాయిక. ఆమె అందం సంజయ్ఖాన్ను కలవరపెట్టింది. నిద్రలేకుండా చేసింది. చెప్పొద్దూ.. జీనత్కూ సంజయ్ ఖాన్ అంటే ఇష్టం మొదలైంది. కుర్రకారంతా ఆమె పేరు జపిస్తుంటే ఆమె సంజయ్ కోసం తపించింది. ‘అబ్దుల్లా’ లో హీరోయిన్గా చేయాలని సంజయ్ కోరగానే మారుమాట లేకుండా ఒప్పేసుకుంది. ఆ సినిమాకు పెట్టుబడీ పెట్టింది.‘అబ్దుల్లా’ షూటింగ్తోపాటే జీనత్, సంజయ్‌ల ప్రేమ కథా ప్రారంభమైంది. చిత్రీకరణ కోసం జైసల్మేర్ వెళ్లారు. అక్కడి ఇసుకతిన్నెలన్నీ వీళ్ల బాసలకు సాక్ష్యాలయ్యాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. మీడియా ద్వారా ఈ జంట అఫైర్ తెలుసుకున్న జీనత్ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆమెను హెచ్చరించారు. కారణం.. అతను అప్పటికే ముగ్గురు పిల్లల తండ్రి, ముక్కోపి కావడం. ‘కోపంలో ఉన్నప్పుడు సంజయ్ విచక్షణ కోల్పోతాడు. అతనివల్ల నీకు సమస్యలే కాని సంతోషం ఉండదు’ అని ఆమె పాత్రికేయ మిత్రులూ చెప్పారు. జీనత్ వినిపించుకోలేదు. అతని ప్రేమలో పిచ్చిదైంది. జైసల్మేర్‌లో.. వాళ్లు బస చేస్తున్న హోటల్లోనే ఆమెను నిఖా చేసుకున్నాడు సంజయ్ ఖాన్. ఆ రోజు గుండెనిండా ఊపిరి తీసుకుంది జీనత్. తన ఆప్తులకు ఫోన్ చేసి చెప్పింది.. ‘మీరు సంజయ్‌ను అనవసరంగా అనుమానించారు నన్ను నిఖా చేసుకున్నాడు’ అని. విన్న మిత్రులు ఏడ్వలేక నవ్వారు. అబ్దుల్లా షూటింగ్ అయిపోయింది. అందమైన జ్ఞాపకాలను మూటగట్టుకొని జీనత్ ముంబై వచ్చేసింది. లెక్కచేయలేదు.. పెడచెవినా పెట్టలేదు ఆ జంట ముంబైలో ల్యాండ్ అయ్యేలోపే వాళ్ల పెళ్లి వార్త బాలీవుడ్లో షికారు మొదలెట్టేసింది. సంజయ్ ఖాన్ భార్య జరీనానూ చేరింది. జీనత్‌తో తెగతెంపులు చేసుకోకపోతే పిల్లలను తీసుకొని ఇల్లు వదిలివెళ్లిపోతానని భర్తను బెదిరించింది జరీనా. ఆ మాటను అతను లెక్కచేయలేదు. అలాగని పెడచెవినా పెట్టలేదు. ఇటు జీనత్ నుంచీ ఒత్తిడి పెరిగింది. తమ నిఖాను బహిర్గతం చేయమని. జీనత్ అడిగింది చేయకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు సంజయ్‌ఖాన్. ప్రతిసారి ఆమె పనిచేస్తున్న సినిమాల నిర్మాతదర్శకులు, పారిశ్రామిక వేత్తలతో సన్నిహితంగా ప్రవర్తిస్తున్నావంటూ ఆమెను దుర్భాషలాడ్డం.. జీనత్ ఎదురుతిరిగితే చేయిచేసుకోవడం.. ఆ ప్రేమలో సాధారణమైంది. ఈ సంగతి తెలిసిన జీతన్ ఫ్రెండ్స్ సంజయ్ మీద పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని చెప్పారట. ‘నేను అతణ్ణి ప్రేమిస్తున్నాను.. కాబట్టి సహిస్తాను’ అంటూ ఆమె ఘాటుగా సమాధానమివ్వడంతో మిన్నకుండిపోయారట వాళ్లు. ఒకరోజు.. షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌కి లోనావాలా వెళ్లింది జీనత్. అక్కడికి ఫోన్ చేశాడు సంజయ్ ‘అబ్దుల్లా కోసం ఓ పాటను రీషూట్ చేయాలి.. వెంటనే వచ్చేయ్’ అంటూ. హతాశురాలైన జీనత్ ‘అబ్దుల్లా పూర్తయిన తర్వాతే కదా ఈ సినిమా ఒప్పుకుంది. ఇప్పుడు సడెన్‌గా డేట్స్ కావాలంటే ఎట్లా?’ అని ఆందోళనగానే అడిగిందట. అంతే మళ్లీ ఆమె శీలాన్ని కించపరిచేలా మాట్లాడి ఫోన్ పెట్టేసేడట అతను. తట్టుకోలేకపోయిన జీనత్ తన డేట్స్ గురించి వివరణ ఇచ్చేందుకు అప్పటికప్పుడే కారులో ముంబైకి బయలుదేరింది. తను ముంబై చేరుకునేటప్పటికి సంజయ్ హోటల్ తాజ్‌లో పార్టీలో ఉన్నాడని తెలిసేసరికి హోటల్ తాజ్‌కు వెళ్లింది జీనత్. అక్కడ జీనత్‌ను చూసిన సంజయ్ వెర్రి ఆవేశంతో ఆమె రెక్క పుచ్చుకొని పక్క గదిలోకి లాక్కెళ్లి చెంప మీద కొట్టాడట. ఆ విసురుకి జీనత్ కిందపడిపోతే ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి మళ్లీ కొట్టాడట. ‘నేను నా డేట్స్ గురించే మాట్లాడ్డానికి వచ్చాను’ అని ఆమె చెబుతున్నా వినకుండా. ఆ దెబ్బలకు తట్టుకోలేక జీనత్ అరిచేసరికి పార్టీలోని వాళ్లంతా చుట్టూ చేరి చోద్యం చూశారట కాని ఎవరూ సంజయ్‌ను ఆపలేదట. ఆ పార్టీలో సంజయ్ భార్య కూడా ఉందని చెప్తారు. తన ఆవేశం తగ్గేవరకు జీనత్‌ను కొడ్తునే ఉన్నాడట సంజయ్. చివరకు పార్టీలో సర్వ్ చేస్తున్న ఓ బాయ్ అడ్డుపడి జీనత్‌ను పక్కకు తప్పించాడట. ఆ గాయాలకు జీనత్ దవడ ఎముక విరిగింది. కుడికన్ను చూపూ మందగించింది శాశ్వతంగా. ఆ సంఘటనతో సంజయ్ జీవితంలోంచి తప్పుకుంది జీనత్. మూడేళ్ల ఆ ప్రేమ హింసాత్మాకంగా ముగిసిపోయింది. -ఎస్సార్ ‘ది బెస్ట్ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ అని సంజయ్ ఖాన్ ఆత్మకథ రాసుకున్నాడు. అందులో తన దుష్ప్రవర్తన తాలూకు పశ్చాత్తాపం కాదుకదా కనీసం జీనత్ జిక్రీ కూడా లేదు. పైగా తానొక విధేయతగల భర్తనని, తండ్రినని చెప్పుకున్నాడు. ఇది చాలా వివాదాస్పదమైంది కూడా. ‘సంజయ్‌ను నా ప్రాణంకంటే ఎక్కువ ఇష్టపడ్డా. అందుకే భరించా. అప్పుడు నా మనసు నా మెదడు అధీనంలో లేదు’ అంటుంది జీనత్ జీవంలేని నవ్వుతో. -
రంగస్థల కస్తూర్బా
జీనత్ అమన్ వయసు 68 ఏళ్లు. పూర్వపు తరాల ఆరాధ్య నాయిక. మోకాళ్లపైకి స్కర్ట్ వేసుకుని, చేతివేళ్ల మధ్య వెలుగుతున్న సిగరెట్‌తో నాటì యౌవ్వనస్తులను ‘మీకు నిద్ర ఉండకుండును గాక’ అని శపించిన జీనత్ ఇప్పుడు కస్తూర్బాగా రంగస్థలం మీదనైనా నటించడం అపచారమేమీ కాబోదు. జాతిపితగా మాత్రమే మీరు గాంధీజీని ఎరిగి ఉన్నట్లయితే, ఆయన భార్య కస్తూర్బాగా జీనత్ అమన్ నటిస్తున్న రంగస్థల నాటకం ‘డియరెస్ట్ బాపు, లవ్ కస్తూర్బా’.. మీకు ఆయనలోని ఒక ఔన్నత్యం గల భర్తను చూపిస్తుంది. సైఫ్ హైదర్ హసన్ ఈ నాటకానికి రచయిత, దర్శకుడు. గాంధీజీగా ఆరిఫ్ జాకరియా నటిస్తున్న ‘డియరెస్ట్ బాపు..’ ను శుక్ర, శనివారాల్లో ముంబైలోని ‘నాటక్’ కళావేదికపై ప్రదర్శించారు. ‘ది గ్రేట్ ఇండియన్ థియేటర్ ఫెస్టివల్–2020’ పేరుతో బుక్ మై షో సమర్పిస్తున్న ఈ నాటకాన్ని దేశంలోని ఆరు నగరాలలో (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, వడోదర, చెన్నై, హైదరాబాద్) మార్చి 1 వరకు ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 4 గంటలకు మొదలయ్యే ‘డియరెస్ట్ బాపూ..’ రాత్రి గం. 80.20 వరకు కొనసాగుతుంది. ‘డియరెస్ట్ బాపు, లవ్ కస్తూర్బా’ నాటకం క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలౌతుంది. గాంధీజీ అరెస్ట్ అవుతారు. పుణెలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో ఆయన్ని నిర్బంధిస్తారు. దాంతో ఉద్యమాన్ని నడిపించే బాధ్యత కస్తూర్బా తీసుకుంటారు. ఆమెనూ అరెస్ట్ చేస్తారు. ముంౖ»ñ లోని ఆర్థర్ రోడ్ జైలుకు పంపుతారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. అమెను కూడా భర్త ఉన్న ఆగాఖాన్ ప్యాలెస్‌కే పంపుతారు. కొంతకాలానికి ఆమె మరణిస్తారు. ఇక అక్కడి నుంచి ఆమె ఆత్మ.. గాంధీజీకి లేఖలు రాస్తుంటుంది. ఆ లేఖల్లో వాళ్ల అరవై ఏళ్ల అనురాగ దాంపత్యం గురించి ఉంటుంది. పెళ్లయినరోజు నుంచి గాంధీజీ ఒడిలో ఆమె కన్నుమూసే వరకు వారిద్దరి మధ్య అనుబంధాల్ని ప్రభావితం చేసిన ప్రతి సందర్భమూ ఉంటుంది. ఆ లేఖలకు గాంధీజీ స్పందిస్తుంటారు. ‘‘కస్తూర్బా గురించి బయటికి తెలిసింది చాలా తక్కువ. భర్త చాటు భార్యగానే ఆమె జీవించారు’’ అని జీనత్ అమన్ అంటున్నారు. నాటకంలోని లేఖల ద్వారా, నాటకంలో గాంధీజీ భార్యగా నటించడం వల్ల బహుశా ఆమె అలా అనుకుని ఉండొచ్చు. అన్ని తరహాల పాత్రలకూ జీవం పోశారు జీనత్. నటిగా మాత్రమే ఆమెను చూడగలిగితే ఆమెను పూర్తిస్థాయి కస్తూర్బాను కూడా మనం చూడగలం. పదిహేనేళ్ల తర్వాత ఒక నాటకంలో జీనత్ నటించడం మళ్లీ ఇదే మొదటిసారి. తొలిసారి 2004లో ‘ది గ్రాడ్యుయేట్’ నాటకంలో మిసెస్ రాబిన్సన్గా నటించారు జీనత్. అప్పటికి పదేళ్లగా ఆమె సినిమాల్లో లేరు. ఆ నాటకం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ‘పానిపట్’ (2019) ఆమె ఇటీవలి సినిమా. అందులో ఆమె మొఘల్ రాణి సకీనా బేగంగా నటించారు. -
నటికి లైంగిక వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్
సాక్షి, ముంబై: నటిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నటిపై అఘాత్యానికి పాల్పడ్డ వ్యాపారవేత్త, గత కొన్నేళ్ల నుంచి తనకు అసభ్య ఫొటోలు పంపుతూ వేధిస్తున్నాడని జుహు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్(68) కొన్నేళ్ల కిందట ఓ ప్రాపర్టీ కొనుగోలు కోసం వ్యాపారవేత్త సర్ఫరాజ్ అలియాస్ అమన్ ఖన్నాను సంప్రదించారు. నటి ఒక్కరే ఉండటంతో వ్యాపారవేత్త ఆమెపై లైంగిక దాడి చేశాడు. గత కొన్నేళ్ల నుంచి నటి అసభ్య ఫొటోలు పంపుతూ, ఆమె నుంచి డబ్బు గుంజుతున్నాడు. 2010 నుంచి ఇప్పటివరకూ రూ.15 కోట్ల మేర నగదును నటి నుంచి నిందితుడు అమన్ ఖన్నా వసూలు చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులు పేర్కొన్నారు. గతంలో రెండు పర్యాయాలు ఫిర్యాదు చేసిన నటి ఆ వ్యాపారవేత్త వేధింపులు తట్టుకోలేక ఇటీవల మరోసారి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన జుహు పోలీసులు గురువారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కేసు విచారణ క్రైమ్ బ్రాంచ్ విభాగానికి బదిలీ అయింది. ది గ్రేట్ గ్యాంబ్లర్, అజ్నబీ, సత్యం శివం సుందరం, కుర్బానీ తదితర చిత్రాల్లో జీనత్ నటించిన విషయం తెలిసిందే.