దమ్ మారో దమ్.. పాటలో తన పర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది జీనత్ అమన్. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. ఆ మధ్య ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. కుర్రకారు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. మనసుకు నచ్చగానే బెడ్ ఎక్కేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అవతలివారి కోసం మీ వ్యక్తిత్వాన్ని పక్కన పడేయొద్దని సూచించింది.
నటి రిలేషన్ పాఠాలు
తాజాగా మరోసారి ఆమె ప్రేమ పాఠాలు చెప్పింది. 'నేను ఇంతకుముందు ఏదో పోస్ట్ పెడితే రిలేషన్‌షిప్ సలహాలు ఇవ్వమని దానికింద కామెంట్లు చేశారు కదా.. ఇంతకుముందు ఎక్కడా చెప్పని ఓ విషయం ఇప్పుడు చెప్తున్నా వినండి.. మీరు ప్రేమలో ఉన్నట్లైతే వెంటనే పెళ్లి చేసుకోవద్దు. కచ్చితంగా సహజీవనం చేయండి.. ఆ తర్వాతే పెళ్లి చేసుకోండి. నా ఇద్దరు కుమారులకు కూడా ఇదే చెప్తూ ఉంటాను.
సహజీవనమే బెటర్
రెండు కుటుంబాలు, రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్.. ఇలా అన్నింటినీ భాగం చేసే ముందు మీ ప్రేమకు టెస్ట్ పెట్టుకోండి.. అదే లివ్ ఇన్ రిలేషన్‌షిప్. నాకైతే ఇదే లాజిక్‌గా అనిపిస్తుంది. మీరు రోజూ కొన్ని గంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. అదే ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకోగలుగుతారా? బాధలో ఉన్నప్పుడు నిజంగానే అవతలి వ్యక్తి ఓదార్చుతారా? నీకు నచ్చింది వంట చేసేందుకు ఒప్పుకుంటారా?
సలహా బాగుంది కానీ..
బెడ్‌రూమ్, బాత్‌రూమ్.. అన్నింటినీ పంచుకోగలుగుతారా? సర్దుకుపోతారా? ఇలా ఎన్నో విషయాల్లో మీకంటూ ఓ క్లారిటీ వస్తుంది. సహజీవనం సరైనదే అంటే మన సమాజం అదొక పెద్ద పాపం అన్నట్లుగా చూస్తుంది.. అయినా చాలా విషయాల్లో సమాజం ఇలాగే ప్రవర్తిస్తుందిలే!' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన కొందరు మీరు చెప్పింది బాగానే ఉంది.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేందుకు సొసైటీ అందుకు సహకరించదని కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment