
అన్ని రకాల పాత్రకు జీవం పోసిన నటి జీనత్ అమన్. దమ్ మారో దమ్.. పాటతో అప్పటితరానికే కాదు, ఇప్పటితరానికి కూడా సుపరిచితమే! అయితే స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు నెమ్మదిగా దూరమవుతూ వచ్చింది. 1985లో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్‌ను పెళ్లాడింది జీనత్. ఇద్దరు కొడుకులు పుట్టాక ఇంటికే పరిమితమైంది. అయితే మజర్, జీనత్ మధ్య పొరపచ్చాలు రావడంతో అతడి వేధింపులు తాళలేక విడాకులు తీసుకుంది.
తాజాగా ఆమె ప్రేమ, డేటింగ్ అనే అంశంపై మాట్లాడింది. 'ఈ విషయం చెప్పాల్సి వస్తున్నందుకు నిజంగా సారీ.. ఇప్పటి జనరేషన్ వారి ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఒకరు మనసుకు నచ్చగానే అతడితో బెడ్ ఎక్కేయడం అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఆ పని చేయకండి. ఒకరి గురించి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకోండి. మీకు మీరే చాలా విలువైన వారు. అలాంటిది మిమ్మల్ని మీరు ఒకరికి అర్పించుకోకండి, మీ వ్యక్తిత్వాన్ని అవతల పారేయకండి.
ప్రతి మహిళ ఆర్థికంగానూ నిలదొక్కుకోవాలి. అప్పుడే వారి భవిష్యత్తును వారే నిర్మించుకోగలరు. ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉంటారో వారు తమ కలను నిజం చేసుకునేందుకు, లక్ష్యాలను చేధించేందుకు ఒక అడుగు ముందే ఉంటారు. ఆర్థిక స్వేచ్ఛ అంటే డబ్బులు సంపాదించడం, చేతిలో డబ్బులుండటం మాత్రమే కాదు. ఎవరి ప్రమేయం లేకుండా మీకు నచ్చినట్లుగా మీరు బతికేయడం. అలా ఉన్నప్పుడే మీకు మీరుగా రాణించగలరు' అని చెప్పుకొచ్చింది.
చదవండి: త్వరలో తల్లి కాబోతున్న బిగ్‌బాస్ విన్నర్.. వెకేషన్‌లో ఉన్న బ్యూటీ
Comments
Please login to add a commentAdd a comment