ముందు సహజీవనం, తర్వాతే పెళ్లి.. అనే డైలాగ్‌తో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది బాలీవుడ్ నటి జీనత్ అమన్. డైరెక్ట్‌గా పెళ్లి చేసుకునే కంటే సహజీవనం ద్వారా ఒకరి గురించి మరొకరు పూర్తిగా అర్థం చేసుకుని.. అప్పటికీ జీవితాంతం కలిసుండాలనుకుంటేనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టమని సూచించింది. కొందరు దీన్ని తప్పుపట్టారు, మరికొందరు వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే తాజాగా జీనత్ అమన్ సోషల్ మీడియాలో తన తల్లి వర్ధిని ఫోటోలను షేర్ చేసింది.
ఆమె మనసు విరిచేశా
తన కోసం ఆమె జీవితాన్నే త్యాగం చేసిందని వెల్లడించింది. కానీ 1985లో తన మనసును ముక్కలు చేసినట్లు పేర్కొంది. ఒక ఫోటోలో తల్లితో పాటు తండ్రి అమనుల్లా ఖాన్ ఉన్నారు. మరో ఫోటోలో వర్ధిని రెండో భర్త హెయిన్జ్ ఉన్నారు(జీనత్ అతడిని అంకుల్ అని పిలిచేది). 'ఈ ప్రపంచంలో మా అమ్మను మించి అద్భుతమైన మహిళ ఎవరూ లేరు. మా నాన్నతో విడిపోయాక తనే సొంతంగా బిజినెస్ పాఠాలు నేర్చుకుని పనిచేయడం మొదలుపెట్టింది.
అన్నీ అమ్మే చూసుకునేది
నన్ను పెద్ద స్కూలులో చదివించింది. నేను సినీ ఇండస్ట్రీలో పని చేయాలనుకుంటున్నానని చెప్పగానే తన పనంతా వదిలేసి నాకు మేనేజర్‌గా మారింది. టిఫిన్లు ప్యాక్ చేసేది.. రెమ్యునరేషన్ లెక్కలు చూసుకునేది.. వచ్చిన డబ్బును పొదుపు చేసేది.. నాలో కాన్ఫిడెన్స్ పెంచేది. అప్పటికే నేను ఒకరితో విడిపోవడంతో నాకు జోడీగా సరిపోయే వ్యక్తి లేడనుకునేది. ఈ విషయంలో మాత్రం అమ్మను చాలా బాధపెట్టాను. తర్వాత కూడా నాకు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లిపోయేదాన్ని.
అలా ఆమె బాధ పోగొట్టా
తన చేతులు పట్టుకోగానే ఆ బాధ మటాష్ అయ్యేది. కానీ నేను పారిపోయి పెళ్లి చేసుకుని అమ్మ మనసు ముక్కలు చేశాను. కానీ నాకు బాబు పుట్టాక తన బాధను పోగొట్టాను. అమ్మ 1995లో చనిపోయింది. నా రక్షణ కవచం పోయినట్లు అనిపించింది' అని ఎమోషనలైంది. కాగా జీనత్ 1978లో సంజయ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లయిన ఏడాదికే విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. తర్వాత 1985లో నటుడు మజర్ ఖాన్‌ను పెళ్లాడింది. ఇతడు 1998లో మరణించాడు.
చదవండి: కూతురితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రావణ భార్గవి.. హేమచంద్ర ఎక్కడంటూ..
Comments
Please login to add a commentAdd a comment