ఎన్నికల్లో నెట్టింట పారీ్టల హోరాహోరీ
ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్టాల్లో బీజేపీ, మోదీ హవా
నయా యూజర్లను పెంచుకుంటున్న రాహుల్, కేజ్రీవాల్
ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ఆప్, కాంగ్రెస్‌కు భారీగా లైకులు
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో పారీ్టలు కూడా సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి.
ప్రజల మూడ్‌తో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ‘లైక్ చేయండి.. షేర్ చేయండి.. సబ్ర్‌స్కయిబ్ చేసుకోండి’ అంటూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఎడాపెడా యాడ్‌లు కుమ్మరిస్తూ డిజిటల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. పలు పారీ్టలు లోక్‌సభ ఎన్నికల సీజన్‌లో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి..!
పదేళ్లుగా దేశాన్నేలుతున్న బీజేపీయే సోషల్ మీడియాలోనూ రాజ్యమేలుతోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో మూడో అతి పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్దగా సోషల్ ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం.
నేతల విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థులెవరకీ అందనంత ఎత్తులో మూడు లైక్‌లు.. ఆరు షేర్‌లు అన్నట్టుగా ‘సోషల్’ జర్నీలో దూసుకుపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పార్టీలు, నేతల సోషల్ మీడియా పేజీలు/ఖాతాల్లో యూజర్ల సంఖ్య పెరుగుదల, డిజిటల్ యాడ్ వ్యయాలు తదితరాలను ‘సోషల్ బ్లేడ్’ అనే ఎనలిటిక్స్ సంస్థ విశ్లేషించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
‘ఎక్స్’ ఫ్యాక్టర్!
సోషల్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ప్రతి పార్టీ నిలకడగా యూజర్లను పెంచుకుంటూ వస్తోంది. బీజేపీ ఎక్స్ ఖాతాకు గత మూడు నెల్లలో 4 లక్షల పైచిలుకు యూజర్లు జై కొట్టారు. కాంగ్రెస్ 2.37 లక్షల కొత్త ఫాలోవర్లను సాధించింది. ఆప్‌కు 12,000 మంది నయా యూజర్లు దక్కారు. టీఎంసీని కొత్తగా ఫాలో అయిన వారి సంఖ్య 9,800. మైక్రో బ్లాగింగ్‌కు కీలక వేదికగా నిలుస్తున్న ఈ సోషల్ వేదికలో బీజేపీకి ఏకంగా 2.18 కోట్ల ఫాలోవర్లున్నారు! కాంగ్రెస్‌ను 1.04 కోట్లు, ఆప్‌ను 65 లక్షల ఎక్స్ యూజర్లు ఫాలో అవుతున్నారు. టీఎంసీ మాత్రం 6.9 లక్షలతో వెనకబడి ఉంది.
యూట్యూబ్‌లో ‘ఆప్’ షో
పారీ్టల ప్రసంగాలు, ప్రచార వీడియోలు, మీడియా సమావేశాలకు కీలక వేదికగా నిలుస్తున్న యూట్యూబ్‌లో ఆప్ ‘చీపురు’ తిరగేస్తోంది. కొత్త సబ్‌్రస్కయిబర్లను పెంచుకోవడంలో ఆప్‌తో పాటు కాంగ్రెస్ కూడా ముందుండగా బీజేపీకి మాత్రం క్రమంగా తగ్గుముఖం పట్టారు. గత మూడు నెలల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 5.9 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే.
ఒక్క మార్చిలోనే ఆప్ యూట్యూబ్ చానల్‌ను ఏకంగా 3.6 లక్షల మంది సబ్ర్‌స్కయిబ్ చేసుకున్నారు! బీజేపీ మాత్రం జనవరిలో 3 లక్షలకు పైగా కొత్త యూజర్లు జతయినా ఫిబ్రవరి, మార్చిల్లో భారీగా తగ్గారు. మొత్తమ్మీద 3 నెలల్లో బీజేపీ చానల్‌కు 5.3 లక్షలు, కాంగ్రెస్‌క 5 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. టీఎంసీ 28,000 మంది యూజర్లను సంపాదించింది. అయితే బీజేపీ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య మాత్రం భారీగా పెరిగింది.
జనవరి–మార్చి మధ్య ఏకంగా 43.2 కోట్ల వీక్షణలు దక్కాయి. తర్వాతి స్థానంలో ఆప్ (30.78 కోట్లు), కాంగ్రెస్ (16.69 కోట్లు), టీఎంసీ (93 లక్షలు) ఉన్నాయి. 59.9 లక్షల సబ్‌స్క్రయిబర్లు, 10 వేలకు పైగా వీడియోలతో యూట్యూబ్‌ను ఆప్ ఊడ్చేస్తోంది. బీజేపీ యూట్యూబ్ చానల్ 58.2 లక్షల సబ్ర్‌స్కయిబర్లు, 41 వేల వీడియోలతో ‘టాప్’ లేపుతోంది. కాంగ్రెస్‌కు 44.8 లక్షలు, తృణమూల్‌ను 5.91 లక్షల మంది సబ్‌్రస్కయిబ్ చేసుకున్నారు.
ఎదురులేని మోదీ...
సోషల్ మీడియా వేదికేదైనా దేశంలోనే గాక ప్రపంచంలోనే తిరుగులేని నాయకునిగా మోదీ దుమ్మురేపుతున్నారు. భారత్‌లో ఏ నాయకుడూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు! గత మూడు నెలల్లో మోదీ ‘ఎక్స్’ యూజర్ల సంఖ్య 26 లక్షలు పెరిగి 9.73 కోట్లకు చేరింది. కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్ష పెరిగి 2.74 కోట్లుగా ఉంది. రాహుల్‌గాం«దీకి కొత్తగా 5 లక్షల మంది జతయ్యారు. ఆయన యూజర్ల సంఖ్య 2.54 కోట్లకు పెరిగింది.
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వల్పంగా 52,000 మంది యూజర్లు దక్కారు. ఎక్స్‌లో ఆమెను 74 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక ఎక్స్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉండే రాజకీయవేత్తగా కూడా మోదీ నిలుస్తున్నారు. గత మూడు నెలల్లో మోదీ 1,367 పోస్టులు పబ్లిష్ చేశారు. కేజ్రీవాల్ 270, రాహుల్ 187 పోస్టులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇన్‌స్టాలోనూ మోదీకి ఏకంగా 8.85 కోట్ల మంది ఫాలోవర్లున్నారు.
అందులో గత మూణ్నెల్లలోనే 52 లక్షల మంది మోదీని కొత్తగా ఫాలో కావడం జెన్ జెడ్‌లోనూ ఆయన క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇన్‌స్టాలో రాహుల్‌కు 68 లక్షలు, కేజ్రీవాల్‌కు 22 లక్షలు, మమతాకు కేవలం 3.84 లక్షల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు! ఇక యూట్యూబ్‌లోనూ మోదీదే హవా! 2.29 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లు ఆయన సొంతం. రాహుల్ (44.7 లక్షలు), కేజ్రీవాల్ (7.58 లక్షలు) మోదీకి ఆమడ దూరంలో ఉన్నారు. గత మూడు నెలల్లో మోదీ చానల్లో పబ్లిషైన వీడియోలకు అత్యధికంగా 47.7 కోట్ల వ్యూస్ దక్కాయి! ఇది రాహుల్, కేజ్రీవాల్ వీడియోల కంటే రెట్టింపు కావడం విశేషం.
ఇన్‌స్టా.. జెన్–జెడ్ ఓటర్ల ‘డెన్’
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్.. స్టోరీస్.. పోస్ట్‌లు.. లైవ్ వీడియోలతో చెలరేగిపోతున్న నవతరం యువత (జెనరేషన్ జెడ్)కు చేరువయ్యేందుకు పారీ్టలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఓటేయనున్న యూత్‌కు అడ్డగా మారిన ఈ సోషల్ వేదికపై మరింతగా ఫోకస్ చేస్తున్నాయి. తాజా డేటా ప్రకారం మెటా ఫ్లాట్‌ఫాంలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ గత నాలుగు నెలల్లో చేసిన యాడ్ వ్యయాల్లో సింహ భాగం ఇన్‌స్టాపైనే వెచి్చంచడం దీని ప్రాధాన్యానికి నిదర్శనం.
గత మూడు నెలల్లో ఈ ప్లాట్‌ఫాంలో కాంగ్రెస్ 13.2 లక్షల మంది ఫాలోవర్లను పెంచుకోగా బీజేపీ (8.5 లక్షలు), ఆప్ (2.3 లక్షల)తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టీఎంసీకి 6,000 మంది కొత్త యూజర్లు దక్కారు. మొత్తం ఫాలోవర్ల విషయానికొస్తే, బీజేపీకి 76 లక్షలు, కాంగ్రెస్‌కు 43 లక్షలు, ఆప్‌కు 12 లక్షలు, తృణమూల్‌కు కేవలం 1.1 లక్షల మంది ఉన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment