సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు గవర్నర్ నరసింహన్ అమ్ముడుపోయారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, గవర్నర్ ఏకపక్షంగా పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గవర్నర్ పదవిని కాపాడుకోవడానికి చెంచాగిరీ చేస్తున్నారని ఆరోపించారు. గుళ్లు, గోపురాలు తిరగడానికి తప్ప గవర్నర్ దేనికీ పనికిరారని విమర్శించారు. ఇలాంటి గవర్నర్‌ను కలిస్తే ప్రయోజనం ఏమీ లేదన్నారు. రైతులకు నాణ్యమైన కరెంటును ఇస్తే సరిపోతుందని, 24 గంటల కరెంటు అవసరంలేదన్నారు. ఈ సమస్యలను గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం లేదన్నారు. గ్రామగ్రామాన తిరిగి ప్రజలకే చెప్పాలని వీహెచ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment