హైదరాబాద్‌‍ టూర్‌: ఇవాంక అమెరికా వెళ్లాక ఏమన్నారంటే | Ivanka Trump tweet on hyderabad tour | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 30 2017 9:11 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

Ivanka Trump tweet on hyderabad tour - Sakshi

అమెరికా నెలవంక ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. నగరంలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఇవాంక.. ఇక్కడ రెండురోజులు గడిపారు. హెచ్‌ఐసీసీలో జరిగిన జీఈఎస్‌ సదస్సులో పాల్గొనడంతోపాటు.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందుకు హాజరై.. నగరంలోని చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు. మొత్తానికి తన నడక, నడవడి ప్రపంచ పారిశ్రామిక సదస్సులో అందరినీ ఆకట్టుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నట్టుగా నిరాడంబర స్వభావంతో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆద్యంతం ఉల్లాసంగా, అద్భుతంగా సాగిన హైదరాబాద్‌ పర్యటనపై ఇవాంక... అమెరికాకు తిరిగి వెళ్లగానే ట్వీట్‌చేశారు. ‘హైదరాబాద్‌ నుంచి తిరిగి బయలుదేరేముందు అమెరికా ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు పరిపూర్ణ ముగింపు ఇది (ద పర్ఫెక్ట్‌ ఎండ్‌ టు ఏ రిమార్కబుల్‌ విజిట్‌)’ ఇవాంక ట్వీట్‌ చేశారు.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement