సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన వ్యక్తిగత సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ హైదారాబాద్ పర్యటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జీఈఎస్ సందర్భంగా వచ్చిన ఆమె కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన హడావుడి.. ప్రత్యేక ఆకర్షణలు... ఇలా ప్రతీ విషయం గురించి మీడియాలో చర్చలు జరిగాయి.
అయితే ఆమె ఇండియాకు వచ్చిన కారణం ఇదేనంటూ ఓ జోక్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. ఆధార్ కార్డు కోసం ఇండియాకు వచ్చిన ఇవాంక పేరుతో ప్రముఖ కమెడియన్, మిమిక్రీ కళాకారుడు జోస్ కోవాకో ఓ వీడియో పోస్టు చేశాడు. పెయిడ్ మీడియా దీనిని ప్రసారం చేయలేదని.. ఇవాంక రాకకు అసలు కారణం ఇదేనన్న సందేశం అతను ఉంచాడు.
ఇక వీడియోలో.. ఆధార్ అందుకోసమే వచ్చానంటూ ప్రతినిధులతో చెప్పటం.. మాకు ఆ అవకాశం లేదని భారతీయ అధికారి ఒకరు చెప్పటం.. కారు ఎక్కే సమయంలో ఆధార్ సెంటర్ కు వెళ్లమని ఇవాంక డ్రైవర్‌ను కోరటం... మీకోసం 200 రూపాయలకే నేను చేస్తానని చెప్పటం ఆ వీడియోలో చూడొచ్చు. ఇది కేవలం హస్యం కోసం చేశానని.. నేరం కాదని అతను అంటున్నాడు.
ఇక జోస్ ట్వీట్‌కు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చిపడుతున్నాయి. చివరకు స్పందించిన యూఐడీఏ... ఆమె మన భారత దేశానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి దరఖాస్తు చేసుకోవటానికి వీల్లేదంటూ బదులు కూడా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment