
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)ను టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమంగా, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించారని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కీలకమైన సదస్సులో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వా మ్యం చేయకుండా అవమానించారని అన్నారు.
టీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజ నాల కోసం, వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాప్రతినిధులను అవమానించడం దారుణమన్నారు. నగర మేయర్‌ను అవమానించారని, ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మెట్రో శిలాఫలకంపై మేయర్ పేరు లేకపోవడం విచారకరమని అన్నారు. మెట్రో ప్రారంభానికి ప్రతిపక్షాన్ని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.