
సాక్షి, హైదరాబాద్ : భారతదేశం ఎన్నో అవకాశాలకు కేంద్రమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం. మోదీ నాయకత్వంలో ఇరుదేశాల మైత్రీ మరింత బలపడుతుంది.’ అని ఆకాంక్షించారు. తాను తెలంగాణకు చిన్నమ్మనంటూ సుష్మా వ్యాఖ్యానించారు. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.