Global Entrepreneurship Summit
-
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్’ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ (డబ్ల్యూఈ)–హబ్ (వీ–హబ్)’గా దీనిని పిలుస్తామని చెప్పారు. దీంతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందుకు రూ.15 కోట్లతో ‘టీ–ఫండ్’ పేరిట కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నిధుల నుంచి ఒక్కో పరిశ్రమలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో 20 శాతం వస్తువులను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేయాలన్న నిబంధన ఉందని.. ఈ 20 శాతంలో కనీసం నాలుగో వంతు వస్తువులను తప్పనిసరిగా మహిళల పరిశ్రమల నుంచే సేకరించాలన్న నిబంధన తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా మూడు పారిశ్రామికవాడలు ఉన్నాయని.. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో పెట్టుబడి రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తోందని చెప్పారు. వారికి మరింత చేయూత అందించాలనే తాజా నిర్ణయాలను తీసుకున్నామని పేర్కొన్నారు. గురువారం జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌లతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. టీ–హబ్ తరహాలోనే.. జీఈఎస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె, సలహాదారు ఇవాంకా తదితరులు టీ–హబ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారని కేటీఆర్ గుర్తుచేశారు. టీ–హబ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్గా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారని.. అదే విధంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వీ–హబ్’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు నిధులు సహాయం చేయాల్సిన అవసరం ఉండదని.. భారత్‌లో మాత్రం పరిస్థితులు వేరని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జీఈఎస్‌కు 140 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని... తనతో మాట్లాడిన వారంతా సదస్సు ఏర్పాట్లు, చర్చాగోష్ఠులు చాలా బాగున్నాయని ప్రశంసించారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన జీఈఎస్ సదస్సుల్లో అత్యంత విజయవంతమైన సదస్సు ఇదేనని పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ, ఇవాంకాలతో పాటు సదస్సు నిర్వహణకు సహకరించిన నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా అమెరికా–భారత్‌ల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌లతోనే కొత్త ఉద్యోగాలు ఫోర్బ్స్ జాబితాలోని భారీ పరిశ్రమలు ఇకముందు అదనంగా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయని తాను అనుకోవడం లేదని... కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారానే కొత్త ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ చెప్పారు. జీఈఎస్ సదస్సు ద్వారా ఔత్సాహిక, యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటోందని చెప్పారు. భారత దేశమంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై అనే నాలుగు మెట్రో నగరాలే కాదని.. వాటి వెలుపల హైదరాబాద్ వంటి అందమైన భారతదేశం ఉందని ప్రకటించారు. జీఈఎస్ వంటి ఎన్నో కార్యక్రమాలను హైదరాబాద్ నిర్వహించగలదన్నారు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ప్రచారోద్యమం వెనుక కీలకంగా ఉన్న అమితాబ్‌కాంత్.. హైదరాబాద్‌లో పర్యాటకానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారని చెప్పారు. మరో సిలికాన్ వ్యాలీ హైదరాబాద్ ప్రపంచానికి హైదరాబాద్ నగరం మరో సిలికాన్ వ్యాలీ అని జీఈఎస్ సదస్సు చాటిచెప్పిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ ప్రశంసించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణతో పాటు భారత్‌లో కొత్త పరిశ్రమల స్థాపన, స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఊపు వస్తుందని చెప్పారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయన్నారు. గురువారమే దేశ జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయని.. గత త్రైమాసికంలో దేశం 6.3 శాతం వృద్ధి సాధించడం శుభ సూచకమని పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయంలో వృద్ధిరేటు 5.7 శాతమేనని.. దేశం తిరిగి వృద్ధి బాటలో పయనిస్తోందని గణాంకాలు సూచిస్తున్నాయని అమితాబ్‌కాంత్ చెప్పారు. దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించిన జీఈఎస్‌కు సహకరించిన అమెరికా, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, ఇవాంకా, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్‌లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. జీఈఎస్ ముగింపు సెషన్లో యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా, కేటీఆర్, జయేశ్ రంజన్ తదితరులు -
జీఈఎస్ సదస్సులో ఆకట్టుకున్న కేటీఆర్
-
ఉమెన్ ఫస్ట్
-
అవకాశాలకు..జీఈ’ఎస్’
-
ఆర్టీసీకి, గోల్కొండ కోటకు అద్దె చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహణకు సంబంధించి ప్రతినిధులకు గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసినందుకు కేంద్ర పురావస్తు శాఖకు, ప్రతినిధులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులు వాడుకున్నందుకు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించింది. కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. అద్దె చెల్లిస్తేగాని గోల్కొండ కోటను విందుకు వాడుకోవటానికి వీల్లేదని కేంద్ర పురావస్తుశాఖ చెప్పటంతోపాటు, కొంత మొత్తం నష్టపరిహారం రూపంలో అడ్వా న్సుగా చెల్లించాలని కూడా కోరింది. ఏ రూపంలోనైనా కట్టడంలోని భాగాలు దెబ్బ తింటే ఆ మొత్తాన్ని మరమ్మతు చేయించేం దుకు అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఇలా షరతులతో కూడిన అనుమతి మంజూరైంది. బుధవారం రాత్రి సదస్సు ప్రతినిధులకు విందు ఇచ్చినందుకు రూ.50 వేలను రాష్ట్రప్రభుత్వం అద్దెగా చెల్లించింది. ఆర్టీసీకి కూడా... ఇక ప్రతినిధులను విమానాశ్రయం నుంచి హోటల్ గదులకు, హెచ్ఐసీసీకి, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోటకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను విని యోగిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ బస్సులు సదస్సుకే పరిమితం కావటంతో ప్రయాణికులను తరలించే విధులకు దూరమయ్యాయి. ఆర్టీసీకి ఆమేర నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం వాటికి అద్దె చెల్లిం చేందుకు సిద్ధమైంది. ఈ మూడు రోజులకు కలిపి రూ.కోటి అద్దె చెల్లించనుంది. -
అమెరికాకు బయలుదేరిన ఇవాంకా
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ పర్యటన ముగించుకుని ట్రెడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఎక్కిన ఇవాంకా బృందం అమెరికాకు బయలుదేరింది. ఆమె పర్యటనలో రెండో రోజైన బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్లో ఆమె ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్ హోటల్లో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం దాదాపు ఆరు గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసిన ఇవాంకా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా ప్రయాణించి ఇవాంకా సహా ఇతర అమెరికా ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బంది అమెరికాకు చేరుకుంటారు. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు వచ్చిన ఇవాంకా తన తొలిరోజు పర్యటనలో భాగంగా ప్రపంచ పారిశ్రామిక సదస్సులో పాల్గొన్నారు. అదేరోజు రాత్రి ప్రసిద్ధ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర కీలక వ్యక్తులతో కలిసి డిన్నర్ చేశారు ఇవాంకా. తిరిగి రాత్రి ట్రెడెంట్ హోటల్‌కు చేరుకున్న ఇవాంకా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు
-
పురుషులు ఈ విషయాన్ని గుర్తించాలి: ఇవాంక
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ.. కుటుంబసభ్యులకు ఆర్థికంగా అండగా ఉంటున్నారని గుర్తుచేశారు. సాంకేతిక రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని సూచించారు. కొత్త ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని, ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ లభిస్తుందని అన్నారు. వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. అమెరికన్ వర్సిటీల్లో మహిళలకు సాంకేతిక విద్యను అందించడంపై ఎక్కువ శ్రద్ధా పెట్టామని తెలిపారు. మహిళలకు ప్రధానంగా నమ్మకం, సామర్థ్యం, మూలధనం ఉండాలని చెప్పారు. మహిళలు తమతో ఏ విషయంలో తీసిపోరని పురుషులు గుర్తించాలన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిస్కో, మైక్రోసాఫ్ట్‌తో కలిసి మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. భారత దేశంలో మహిళల భాగస్వామ్యం చాలా పెరిగిందని చందా కొచ్చర్ అన్నారు. భారతదేశం నుంచి మంచి క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారత దేశ రక్షణమంత్రిగా మహిళ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని బ్యాకింగ్ రంగంలో 40శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆత్మస్థైర్యం నింపినప్పుడే మహిళలు రాణించగలరని చెప్పారు. తన పిల్లలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. మహిళల సాధికారిత కోసం తమ ఫౌండేషన్ ప్రధానంగా కృషి చేస్తున్నదని చెర్రీ బ్లెయిర్ తెలిపారు. -
‘ఆహా’ర్యం.. మాటే మంత్రం..
సాక్షి, హైదరాబాద్: అందం, ఆహార్యంతోనే కాదు.. మాట్లాడే తీరులోనూ ఇవాంకా ట్రంప్ అదరహో అనిపించింది. ఆత్మ విశ్వాసాన్ని ప్రతి బింబిస్తున్న నడకతో, ముఖ్యంగా మోముపై చెరగని చిరునవ్వుతో ఆకట్టుకుంది. దీంతో సదస్సుకు వచ్చినవారంతా ఆమెకు అభిమాను లైపోయారు. ఈ నేపథ్యంలో ఇవాంకా మాట తీరు, సంతకం, వస్త్రధారణలను హైదరాబాద్‌కు చెందిన పలువురు నిపుణులు విశ్లేషించారు. ఆ మాటే మంత్రం... ‘‘చెప్పే విషయాన్ని సరిగా ప్రారంభిస్తే సగం పని పూర్తయినట్టే అనేది పబ్లిక్ స్పీకింగ్‌లో ఒక ప్రాథమిక సూత్రం. ఇవాంకా తన ప్రసంగం ప్రారంభంలోనే అందరి మనసులనూ హత్తుకున్నారు. అంతే అద్భుతంగా చివరి వరకూ ప్రసంగాన్ని కొనసాగించారు. ‘హలో ఎవ్రీవన్.. థాంక్యూ బీయింగ్ హియర్ అండ్ ఫర్ ఇన్క్రెడిబుల్లీ వార్మ్ వెల్కమ్ (అందరికీ నమస్కారం.. సుస్వాగతం. ఇక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది)’ అంటూ ఇవాంకా పలకరించిన తీరు ఆకట్టుకుంది. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రస్తుతిస్తూ.. ఇరు దేశాల మధ్య అనుబంధాలను వివరిస్తూ ప్రతీ పదం స్పష్టంగా పలికారు. చెరగని చిరునవ్వుతో సరైన పదాలను వినియోగిస్తూ అందరికీ కనెక్టయ్యారు. సత్య నాదెళ్ల వంటి తెలుగువారిని, టీ–హబ్, సిటీ ఆఫ్ పెరల్స్‌ను ప్రస్తావిం చారు. ఆమె ఆహార్యం, నేరుగా అందరి వైపూ చూస్తూ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆమె ఒక మంచి వక్త అనిపించింది. అవసరాలకు అనుగుణంగా పదాల మధ్య ఇచ్చిన విరామాలు, మధ్య మధ్యలో ‘థాంక్యూ’లు ఆహూతులను కట్టిపడేస్తాయి. ‘దిస్ ఈజ్ ది ఫ్యూచర్.. వి కెన్, విల్ అండ్ మస్ట్ బిల్డ్ టుగెదర్ అండ్ దిస్ ప్రామిస్’ అనే వాక్యంతో ఇవాంకా ప్రసంగాన్ని ముగించారు.’’ – డి.రామచంద్రం, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అది విజయానికి ‘సంతకం’.. ‘‘ఇవాంకాది అసాధారణ వ్యక్తిత్వం. దీనికి ప్రతీక ఆమె సంతకమే. ఆ సంతకం యాంగిల్ అండ్ రౌండెడ్ (ఓ వైపు వంగినట్లుగా ఉండి గుండ్రంగా)గా ఉంది. ఆమెలో బిజినెస్ సెన్స్ అద్భుతమని దీని అర్థం. అలాగే సంతకంలో ‘కంటిన్యూయస్ ఫ్లో, కనెక్టింగ్ లెటర్స్ (ఒకదానిని ఒకటి తాకుతూ అక్షరం వెంటే అక్షరం ఉండటం)’ విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణిని పట్టిస్తుంది. సంతకంలో లోయర్ జోన్ అక్షరాలు మానసికంగా, శారీరకంగా సమర్థవం తమైన స్థాయిని (హైఎనర్జీ లెవల్స్‌ను) సూచిస్తున్నాయి. చివరి అక్షరం రాసిన తీరు ఆమె స్వతంత్ర భావాలకు నిదర్శనం. సంతకంలో ఫ్రీఫ్లో ఆఫ్ స్ట్రోక్స్ వ్యాపారంలో దూరదృష్టికి, సంతకం కింద ఉన్న పెద్ద సర్కిల్ భావోద్వేగాలకు, సెంటిమెంట్స్‌కు, సంతకంలో పొడవాటి స్ట్రోక్స్ (అక్షరాలు) సృజనాత్మకతకు, స్ఫూర్తిదాయక లక్షణాలకు, కొత్త విషయాల పట్ల చూపే ఉత్సాహానికి నిదర్శనాలు. ఆమె ప్రేమాస్పదురాలు కూడా. అప్పుడప్పుడు తొం దరగా స్పందించడం, వేగంగా మూడ్ మారి పోయే లక్షణం ఉండే అవకాశముంది. – రణధీర్ కుమార్, సిగ్నేచర్ అనలిస్ట్ వైవిధ్యాన్ని గుర్తు చేసేలా.. ‘‘విమానాశ్రయంలో దిగిన ప్పుడు ఇవాంకా ధరించిన దుస్తులు సెమీ ఫార్మల్. రౌండ్‌నెక్ టీషర్ట్‌పై నలుపురంగు ట్రౌజర్‌ను కాంబినేషన్‌గా ధరించారు. దానిపై బ్లాక్ అండ్ వైట్ బ్లేజర్ వేసుకున్నారు. దానిపై ఏకరూపత కలిగిన డిజైన్లు (సిమ్మెట్రికల్ ప్యాట్రన్స్) ఉన్నాయి. తన కన్నా ఉన్నత స్థాయి వారిని, సీనియర్లను కలవడానికి వెళ్లినప్పుడుగానీ.. లంచ్ లేదా తేనీటి విందు వంటి సందర్భాల్లో వీటిని ధరిస్తారు. ఇక ఇవాంకా హెచ్ఐసీసీలో సదస్సు జరుగుతున్న ప్రాంతానికి వచ్చినప్పుడు.. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చేవారికి కలుస్తున్న విషయాన్ని గుర్తు చేసేలా వస్త్రాలను ధరించారు. పూల డిజైన్లను ముద్రించిన కూల్ కలర్ గౌన్‌ను వేసుకున్నారు. (సాధారణంగా గ్రీన్, లెమన్ ఎల్లో, లైట్ పింక్ తదితర వాటర్ కలర్స్‌ను ఫ్యాషన్ పరిభాషలో కూల్ కలర్స్ అంటారు). అంతేగాకుండా ఈ డ్రెస్‌లో హైదరాబాదీలకు బాగా నచ్చే ఆకుపచ్చ, పసుపు రంగులకు ఆమె ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తోంది..’’ – సంతోష్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ రావమ్మా.. ఇవాంకా! సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున 2.51 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎతిహాత్ ఎయిర్‌లైన్స్‌లో వచ్చిన ఆమె వెంట 13 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు, సాధారణ ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం శంషాబాద్ చేరుకోవడానికి మూడు గంటల ముందే 96 మంది అమెరికా ప్రతినిధులతో కూడిన మరో విమానం వచ్చింది. ఇవాంకకు ఎయిర్‌పోర్టులో అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, జీఈఎస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐడీ ఐజీ షికాగోయల్, శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అమెరికా నుంచి తెచ్చిన ప్రత్యేక వాహనంలో 15 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో వీవీఐపీ రూట్ ద్వారా 3.14 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆమె... నేరుగా ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 34 కి.మీ. ఉన్న ఈ దూరాన్ని ఇవాంక కాన్వాయ్ 23 నిమిషాల్లో చేరుకుంది. మధ్యాహ్నం వరకు ట్రైడెంట్‌లో ఉన్న ఇవాంక 2.50 గంటలకు ట్రైడెంట్ నుంచి బయల్దేరి 2.3 కిమీ దూరంలో ఉన్న హెచ్ఐసీసీ చేరుకున్నారు. -
బ్రాండ్ హైదరాబాద్..
-
‘అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం’
-
నేను తెలంగాణకు చిన్నమ్మను : సుష్మ
సాక్షి, హైదరాబాద్ : భారతదేశం ఎన్నో అవకాశాలకు కేంద్రమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆమె మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం. మోదీ నాయకత్వంలో ఇరుదేశాల మైత్రీ మరింత బలపడుతుంది.’ అని ఆకాంక్షించారు. తాను తెలంగాణకు చిన్నమ్మనంటూ సుష్మా వ్యాఖ్యానించారు. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. -
జీఈఎస్‌లో ఇవాంకా ఏమన్నారంటే...
సాక్షి,హైదరాబాద్: ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు(జీఈఎస్)లో పాల్గొనడం సంతోషకరమని ఇవాంక ట్రంప్ అన్నారు. అమెరికాకు భారత్ అసలైన మిత్ర దేశమని, భారత్‌కు ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు. ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపదని, ఇక్కడి పారిశ్రామికవేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు. మీరంతా రాత్రింబవళ్లు కష్టపడి రోబోలు, యాప్‌లు రూపొందిస్తున్నారని ఇవాంక ప్రశంసించారు. భారతీయ నిపుణులు తమకు స్ఫూర్తిదాయకమని, టీ అమ్మే స్ధాయి నుంచి ప్రధాని కాగలడం మీ ప్రధాని గొప్పతనమని ఆమె ప్రస్తుతించారు. ‘ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీహబ్ రూపొందింది. ఈ సదస్సులో 52 దేశాలకు పైగా మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉంది. పురుషాదిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం. ఓ పారిశ్రామికవేత్తగా మహిళ ఎదగడం ఎంత కష్టమో నాకు తెలుసు. మహిళలు మరింత కష్టపడాలని తెలుసుకున్నా’అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పది శాతం పెరిగిందని చెప్పారు. టెక్నాలజీతో పాటు రుచికరమైన బిర్యానీకి భారత్ అడ్డా అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని..గత దశాబ్ధకాలంగా మహిళలు ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పారు. కష్టపడితే మహిళలు వారి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకోగలరన్నారు. ఇవాంక ఇంకా ఏమన్నారంటే... మాకు ఆతిథ్యం ఇచ్చినందకు కృతజ్ఞతలు హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతోంది ఆసియాలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీ హబ్ ఆవిర్భవించింది ప్రపంచంలో వేగంగా పురోగతి సాధిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటి ఇక్కడి ప్రజల విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత దేశం టెక్నాలజీనే కాదు...బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అభినందనలు పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం మహిళలు ఎదగాలంటే ఎన్ని సమస్యలుంటాయో నాకు తెలుసు గత దశాబ్ధ కాలంలో మహిళలు చాలా ఎత్తుకు ఎదిగారు మహిళలు రాణిస్తే కుటుంబాలు బాగుపడతాయి మోదీ నాయకత్ంలో భారత్ అద్భుత పురోగతి సాధిస్తోంది టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారు ప్రధాని మోదీ జీవితాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు -
మూడు నిమిషాల్లో ముగిసిన కేసీఆర్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్ : టీఎస్- ఐపాస్ (నూతన పారిశ్రామిక విధానం)తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు. జీఈఎస్ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఇప్పటివరకూ 5,469 యూనిట్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్’లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా పుంజుకుంటోందని, టీ హబ్ ద్వారా ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ అన్నిరకాల అనుకూలమైన ప్రాంతం అని అన్నారు. అమెరికాలో అయిదు ముఖ్యమైన కంపెనీల బ్రాంచ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. జీఈఎస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. -
జీఈఎస్ వేదిక పై సీఎం కేసీఆర్ ప్రసంగం
-
హెచ్ఐసీసీలో జీఈఎస్-2017
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు-2017 ప్రారంభం అయ్యింది. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ-అతిథి ఇవాంక ట్రంప్ చేతుల మీదుగా రోబో మిత్రా ద్వారా సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు లోగోను ఆవిష్కరించారు. ఇక మూడు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్ కోసం సుమారు 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు హాజరయ్యారు. అమెరికా, భారత్ నీతి ఆయోగ్‌లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు హోదాలో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ సదస్సుకు హాజరయ్యారు. నేడు, రేపు సదస్సులో పాల్గొననున్న ఇవాంక.. వ్యాపారరంగంలో మహిళలకు అవకాశాలు పెంచటం అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత్ లో స్టార్టప్స్‌కు సువర్ణావకాశంగా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ 8వ సదస్సును పేర్కొంటున్నారు. ఇక ‘ఉమెన్ ఫస్ట్’ థీమ్‌తో మహిళా శక్తికి అగ్రపీఠం వేస్తూ ఈసారి సదస్సును నిర్వహించనున్నారు. ఈసారి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో 52 శాతం మంది మహిళా డెలిగెట్స్ పాల్గొంటుండటం విశేషం. ఉపాసన కొణిదెల, నారా బ్రహ్మిణి, సానియా మీర్జా , మంచు లక్ష్మీ, మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. బ్రేక్ ఔట్లు, మాస్టర్ క్లాసులు, వర్క్ షాపులతో సమ్మిట్ సందడిగా సాగనుంది. 52 అంశాలపై చర్చ.. విశిష్ట అతిథుల అమూల్యమైన సందేశాలు... ప్రపంచ ప్రఖ్యాతి పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకోనున్నారు. -
ఇవాంకపై బ్రాహ్మిణి ఏమన్నారంటే?
-
ఇవాంకకు ప్రత్యేక గాజులు.. ఓ లుక్కేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) కు నగరం ముస్తాబైంది. జీఈఎస్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంకకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ఇవాంకా రావడానికి మునుపే హైదరాబాద్‌లో హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలో భాగంగా చార్మినార్‌ను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అధికారులు చార్మినార్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దాంతో పాటు గాజులకు ప్రసిద్ధిగాంచిన లాడ్ బజార్లో ఇవాంకా షాపింగ్ చేస్తుందనే సమాచారంతో అక్కడి వ్యాపారులు వారి సృజనాత్మకతకు పదును పెట్టారు. ఇవాంక పర్యటన నేపధ్యంలో లాడ్ బజార్ వ్యాపారులు 'భారత-అమెరికా స్నేహం' పై ప్రత్యేకంగా గాజులు తయారు చేశారు. గాజుల మీద ఇవాంకా పేరుతో పాటు ఇండియా, అమెరికా జాతీయ జెండాలను కూడా వేశారు. ' ఇవాంకా ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఈ గాజులను తయారు చేశాను. ఈ గాజుల సెట్ ను తయారు చేయడానికి 45 రోజులు పట్టింది. ఆమె లాడ్ బజార్ ను సందర్శిస్తే ఈ గాజులను అమెకు బహుమతిగా అందజేస్తాం' అని వ్యాపారి మహ్మద్ అన్వర్ తెలిపారు. ఇవాంకా లాడ్ బజార్లో షాపింగ్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఆమె పేరుతో తయారు చేసిన బ్యాంగిల్స్ నగర మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. -
నమస్తే మోదీజీ, ఇవాంకా.. ఎవరు స్వాగతం చెప్తారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్’ అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర’ స్వాగతం పలుకబోతుంది. నగరంలోని హెచ్ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. ఇంతకు మిత్ర ఎవరంటే.. ఒక బోట్ (రోబో). బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ బోట్‌ను రూపొందించారు. హైదరాబాద్‌లో జరగనున్న జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడ రెండు ‘మేడిన్ ఇండియా’ బోట్లను విశ్వనాథన్ బృందం ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు బోట్లలో ఒకటి వేదిక మీద ఉండి.. విదేశీ పారిశ్రామిక ప్రముఖులతో ముచ్చటిస్తుంది. మరొక బోట్ వేదిక బయట ఉండి.. ప్రేక్షకులతో ముచ్చటిస్తుంది. ‘మా ‘మేడిన్ ఇండియా’ రోబోట్లను ప్రదర్శించడానికి జీఈఎస్‌ను ఆదర్శ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ సదస్సుకు అత్యంత ప్రముఖులు వస్తుండటం, కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో మిత్ర వేదిక మీద కొద్దిసేపు మాత్రమే ముచ్చటిస్తుంది. ప్రధాని మోదీ, ఇవాంక వేదిక మీదకు రాగానే మిత్ర వారి వద్దకు వెళ్లి.. వారితో సంభాషిస్తుంది. వాళ్లు ఒక బటన్ ప్రెస్ చేస్తారు. దీంతో మిత్ర పాట పాడుతుంది. శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైనట్టు డిక్లేర్ అవుతుంది’ అని విశ్వనాథన్ తెలిపారు. ఇప్పటికే ఈ రోబోలకు 1000-1500 శిక్షణ ప్రక్రియలను నిర్వహించామని, ఈ రోబోలు వేదికపైన, సదస్సు జరిగే ప్రాంగణంలో ఉండి.. ప్రతినిధులు, ప్రేక్షకులతో ముచ్చటిస్తాయని చెప్పారు. -
జీఈఎస్‌పై ఐఎస్ ఉగ్రవాదుల గురి!
సాక్షి, హైదరాబాద్ : హైదారాబాద్‌లో జరుగుతున్న గ్లోబెల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమావేశం(జీఈఎస్)పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కుమార్తె ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇవాంక ట్రంప్ పాల్గొనే ఈ సమాశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే ఖచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమయినట్లు తెలంగాణ పోలీస్ అధికారి ఒకరు చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. హైదరాబాద్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశముందనే హెచ్చరికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాలు 200 మంది అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి సలహాదారు హోదాలో జీఈఎస్ సమావేశానికి ఇవాంక ట్రంప్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు అమెరికా సీక్రెట్ సర్వీసెస్ భద్రత ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీకి ఎస్పీజీ భద్రత కల్పిస్తోంది. తర్వాతి లేయర్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రేహౌండ్స్, అక్టోపస్ దళాలతో కూడా జీఈఎస్‌కు భద్రత కల్పించనున్నట్టు వెల్లడించారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి ఇవాంక
-
గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ సాగేదిలా
-
హైదరాబాద్‌లో ఇవాంక.. తొలి పలుకులు!
న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన మనం కలిసి సాగితే ఎంతో చేయగలం. ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో మన ప్రాధాన్యాలు ఉమ్మడివి’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. ఈ సందర్భంగా ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ తో మాట్లాడారు. ‘గత సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యాను. నాకు భారత్ చరిత్ర, సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని ఆమెకు తెలిపాను. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాల్లో పురోగతి విషయమై నా ఆశయాలను ఆమెతో పంచుకున్నాను. ప్రధాని మోదీతో జరిగే సంభాషణలో ఈ అంశం మరింత ముందుకువెళ్తుందని ఆశిస్తున్నాను. భారత్ పర్యటన పట్ల ఎంతో ఎక్సైటింగ్‌గా ఉన్నాను’ అని ఆమె అన్నారు. ‘భారత్, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అవకాశాలను సృష్టించడం, పౌరులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించడం అతిపెద్ద సవాలు. ఇటు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, అటు భారత్‌లో నరేంద్రమోదీ పౌరులకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ప్రగతి కోసం కృషి చేస్తున్నారు’ అని ఆమె అన్నారు. జీఈఎస్ గురించి ఇవాంక మాట్లాడుతూ.. తొలిసారి ఈ సదస్సులో పాల్గొంటున్న వారిలో 50శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారిత ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఓ అంతర్జాతీయ వేడుకగా నిలుస్తుందని నేను భావిస్తున్నారు. మహిళలు రాణిస్తే.. సమాజాలు, దేశాలు వర్ధిల్లుతాయి’ అని అన్నారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న ఇవాంక
-
హైదరాబాద్‌లో ఇవాంక
-
ఇవాంకా ట్రంప్ విచ్చేశారు
-
ఇవాంకా విచ్చేశారు.. సగం సమయం ‘రిజర్వ్’కే
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ పర్యటన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెరికా నుంచి ప్రతినిధులు, డెలిగేట్ల బృందంతో కలసి బయలుదేరిన ఆమె.. షెడ్యూల్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ ఇవాంకా ఉల్లాసంగా కనిపించారు. ఎయిర్‌పోర్టులో అమెరికన్, తెలంగాణ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. తర్వాత నేరుగా ఆమె బస చేసే హోటల్‌కు వెళ్ళారు. అయితే తొలి నుంచీ ఇవాంకా పర్యటన వివరాలను గోప్యంగా ఉంచిన ప్రభుత్వాలు.. తుదివరకు అదే గోప్యతను పాటించాయి. హెచ్ఐసీసీకి పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉండే ట్రైడెంట్ హోటల్లో ఇవాంకా బస ఏర్పాట్లు చేసినట్లు పర్యటన తుది షెడ్యూల్ విడుదలైంది. కానీ పోలీసు యంత్రాంగం, అమెరికా నుంచి వచ్చిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అధికారులు ట్రైడెంట్‌తో పాటు వెస్టిన్ హోటల్లోనూ పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి 9.20 గంటల వరకు ఇవాంకా హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో.. ఏకంగా 18 గంటల పాటు రిజర్వ్ టైమ్‌గా నిర్దేశించారు. మంగళవారం తెల్లవారుజామున విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకోనున్న ఇవాంకా మధ్యాహ్నం 2.50 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయాన్ని షెడ్యూల్లో ‘రిజర్వ్’గా చూపారు. సాయంత్రం ప్రధాని మోదీతో కలిసి ప్రపంచ పారిశ్రామిక సదస్సు ప్రారంభోత్సవంలో.. రాత్రికి భారత ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చే విందులో పాల్గొంటారు. రెండో రోజు బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్లో ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్ హోటల్లో భేటీ అవుతారు. సాయంత్రం 5:35 గంటలకు హోటల్ ఖాళీ చేయనున్న ఇవాంకా.. రాత్రి 8.20కి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యలో ఏం చేస్తారన్నది షెడ్యూల్లో పేర్కొనలేదు. అయితే ఇలా షెడ్యూల్లో చూపని, ‘రిజర్వ్’గా పేర్కొన్న ఖాళీ సమయాల్లో ఇవాంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారా.. అన్నది ఆసక్తి రేపుతోంది. ఆమె చార్మినార్‌ను సందర్శించే అవకాశముందన్న నేపథ్యంలో.. పోలీసు యంత్రాంగం ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇవాంకా పర్యటన వివరాలు 28వ తేదీ (మంగళవారం) - 3.00 తెల్లవారుజామున: ఇవాంకా శంషా బాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను బస చేసే హోటల్‌కు వెళ్ళారు. - మధ్యాహ్యం 2.50 వరకు: రిజర్వ్ సమ యం (అధికారులు వివరాలు వెల్లడించకుండా.. ‘రిజర్వు’గా పేర్కొన్నారు) - 3.00: ఇవాంకా హెచ్ఐసీసీకి చేరుకుంటారు. - 3.10– 3.25: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ - 3.35– 3.55: ప్రధాని మోదీతో భేటీ - 4.00–4.25: భారత స్టార్టప్‌ల అధునాతన ప్రదర్శన ‘ది ఇండియన్ ఎడ్జ్’ను తిలకిస్తారు. - 4.25: ప్రధాని మోదీతో కలసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారు. - 4.45–4.50: ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు. - 5.15–5.45: ప్లీనరీ సెషన్లో ‘మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు– నాయక త్వం’పై నిర్వహించే చర్చాగోష్టికి ప్యానెల్ స్పీకర్‌గా ఉంటారు. - 5.50–6.00: హెచ్ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. - 7.15: హోటల్ నుంచి బయల్దేరుతారు. - 8.00: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. - 8.05–8.20: ‘ట్రీ ఆఫ్ లైఫ్’పేరుతో ఏర్పాటు చేసే భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శనను తిలకిస్తారు. - 8.20–8.35: భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌షోను తిలకిస్తారు. - 8.45: ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో కలసి విందులో పాల్గొంటారు. - 10.00: ఫలక్‌నుమా నుంచి బయల్దేరుతారు. - 10.40: హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. 29వ తేదీ (బుధవారం) - ఉదయం 9.00: అమెరికా బృందంతో బ్రేక్‌ఫాస్ట్ - 9.50: హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయలుదేరుతారు. - 10.00: సదస్సు ప్లీనరీ సెషన్లో ‘వి కెన్ డూ ఇట్.. అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం’ అంశంపై చర్చాగోష్టి లో పాల్గొంటారు. - 11.00: హెచ్ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. భోజన విరా మం అనంతరం మహిళా పారిశ్రామిక ప్రతి నిధులతో ట్రైడెంట్ హోటల్లో ముఖాముఖి - 5.35: హోటల్లోనే సిబ్బందితో విందు చేసి విమానాశ్రయానికి బయల్దేరుతారు - 8.20: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు - 9.20: దుబాయ్ ఎమిరేట్స్ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. ఇవాంకా కాన్వాయ్ రిహార్సల్స్ అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా నగరానికి వస్తున్న నేపథ్యంలో సోమవారం రాజేంద్రనగర్‌లో కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఓఆర్ఆర్పై నుంచి భారీ కాన్వాయ్ హిమాయత్‌సాగర్, రాజేంద్రనగర్, పీడీపీ చౌరస్తా, శివరాంపల్లి, ఆరాంఘర్, మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు నిర్వహించారు. దాదాపు 40 వాహనాలతో ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు మరోసారి రిహార్సల్స్ నిర్వహించారు. అడుగడుగునా పోలీసులను మోహరించి బందోబస్తును నిర్వహించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న భవనాలపై సైతం పోలీసులను బందోబస్తు కోసం వినియోగించారు. మంగళవారం సాయంత్రం ఇవాంకా ఈ దారిగుండానే ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. ఇవాంకా కాన్వాయ్‌లో 17 యూఎస్ఏ వాహనాలు ఉండగా పోలీసుల వాహనాలు మరో నాలుగు ఉన్నట్లు తెలిసింది. ఇవాంకా కాన్వాయ్‌లో మరో మూడు యూఎస్ఏ వాహనాలు చేరనున్నట్లు సమాచారం. కాన్వాయ్ మరికొద్ది నిమిషాల్లో రానుందనగా రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై కుక్కలు పరుగులు తీశాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వాటిని తరిమేశారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సదస్సు మంచిదే.. మరి వీటి మాటో..!
ఇవాంకా.. ఈ పేరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 28 నుంచి మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (జీఈఎస్) ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు 180 దేశాల నుంచి సుమారు 2 వేల మంది పారిశ్రామిక వేత్తలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు, ఆయా దేశాల నుంచి వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు కూడా పోగవనున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ తరహా అంతర్జాతీయ, ప్రపంచ పారి శ్రామిక వేత్తల సదస్సులు జరగడం మంచిదే. ఇలాంటి వాటి ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఆచరణకే వదిలేద్దాం. కానీ, ఇవాంకా పర్యటనకు సంబంధించిన చర్చ మొత్తం దేనికి పరిమితం అవుతుందన్నదే కీలకం. ముఖ్యమైన వ్యక్తులు వస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కానీ, మూడ్రోజుల ముచ్చట కార్యక్రమానికి కొందర్ని బలిచేయడం సరైంది కాదు. అనాథలు, దిక్కుమొక్కులేని యాచకులను బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, జైలులో నిర్భంధించడం అనేది వారి స్వేచ్ఛకు భంగం కలిగిం చడం. నిజంగానే అందరూ ఉండి కూడా భిక్షాటన చేస్తున్న వాళ్ళను గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడాన్ని హర్షించాల్సిందే. కానీ, ఇవాంకా పర్యటన సందర్భంలోనే ఈ పని ఎందుకు చేపట్టాలి..? నగరంలో ఉన్న సుమారు 6 వేల మంది యాచకులకు నిజంగానే జీవనాధారం కల్పించాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉన్నట్లయితే, ఇంతకు మునుపే ఇలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు? గ్లోబల్ సమ్మిట్ జరిగే పరిసర ప్రాంతాల్లో చిరువ్యాపారులకు ఇవాంకా పర్యటనతో ఇక్కట్లు తప్పడం లేదు. మూడ్రోజుల పాటు దుకాణాలన్నీ బంద్ చేయడం, వారి జీవనాధారానికి ఆటంకం. వేలాది కుటుంబాలను తని ఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం, ఆ ప్రాంతా లలో సాధారణ ప్రజలను తిరగనివ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలు సరైనవి కావు. మూడున్నరేండ్లుగా వర్షాలు వచ్చిన ప్రతిసారీ రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించినా, ఏనాడు నివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. లక్షలాధి మంది మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బం దులు పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. హైదరాబాద్ నగరంలో నాలా వ్యవస్థ సరిగా లేక వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. ఇవాంకా పర్యటన జరిగే ప్రాంతాల్లోని రోడ్లను మాత్రమే బాగు చేస్తున్న ప్రభుత్వం... లక్షలాధి మంది ప్రజలు తరుచుగా పడే ఇబ్బందులను పట్టించుకోనక్కర్లేదా? ఈ మూడేండ్లలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక ప్రజలు, రైతులు, మహిళలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. దాని గురించి చర్చే లేదు. ఇవాంకా పర్యటనలో వందల కోట్లు ఖర్చు పెట్టడం, ఆమెను మెప్పిం చడం కోసం కానుకలు సమర్పించడం, కొందర్ని అవమానించి ఒక్కరికి బహుమానం ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు. ఒక పక్క చిరిగిపోయిన చీరలిచ్చి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ప్రభుత్వం.. అమెరికా బిడ్డకు మాత్రం రాచమర్యాదలు చేయడం సబబేనా! - కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మొబైల్ : 96183 39490 -
విదేశీ ప్రతినిధులకు సంప్రదాయ స్వాగతం
శంషాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. సోమవారం వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఉద్యోగులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. మన సంప్రదాయ స్వాగతం విదేశీ ప్రతినిధులకు ఆకట్టుకుంది. కొందరు విదేశీ ప్రతినిధులకు నగరంలోని హోటళ్లలో బస ఏర్పాటు చేయగా.. మరికొందరికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలోని నోవాటెల్ హోటల్లో వసతి కల్పించారు. హోటల్ వరకు వీరిని తీసుకెళ్లడానికి ఆర్టీసీ ప్రత్యేకంగా 50 ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. గతంలో ఆర్డర్ ఇచ్చిన 21 కొత్త బస్సులు ఈ సదస్సు సమయానికి వచ్చేలా ప్లాన్ చేసిన అధికారులు వాటితోపాటు మరో 49 వినియోగంలో ఉన్న గరుడ ప్లస్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం విమానాశ్రయం వద్ద వీటిని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
పర్యాటక శాఖనా.. నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు 1,700 మంది ప్రతినిధులు.. వారిలో ఎందరో దిగ్గజ వ్యాపార సంస్థల అధిపతులు.. ఇలా దేశవిదేశాల్లో వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించిన వారు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో ఒక్కచోటకు చేరుతున్నారు. ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు, ప్రత్యేకతగా నిలిచే అంశాలు ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తాయి. హైదరాబాద్ వేదికైనందున.. తెలంగాణ బ్రాండ్ స్థాయి పెంచుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. బ్రాండ్ ఇమేజ్‌లో పర్యాటక రంగమూ భాగమే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విషయంలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓ మెట్టు ఎదగాలన్న ప్రయత్నానికి నీతి ఆయోగ్ మోకాలొడ్డింది. పారిశ్రామిక రంగంలో అతిరథ మహారథులు ఒక్కచోటుకు చేరుతున్న తరుణంలో వారి ముందు తెలంగాణ పర్యాటక ప్రత్యేకతను నిలిపేందుకు చేసిన ప్రయత్నాన్ని నీతి ఆయోగ్ పట్టించుకోలేదు. సదస్సులో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు, ప్రతినిధుల రోజువారీ కార్యక్రమాలేంటి.. వంటి విషయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాకుండా రహస్యంగా వ్యవహరించింది. పర్యాటక రంగం ప్రత్యేకతను ప్రతినిధుల ముందుంచేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ఓ ప్రణాళిక రూపొందించుకున్న ప్పటికీ... దాన్ని అమలు చేసే విషయంలో నీతి ఆయోగ్ అవకాశం కల్పించలేదు. అసలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు రాష్ట్ర మంత్రులకే ఆహ్వానాలు లేకుండా పోయాయి. శాఖాధిపతులుగా ఉన్న ఐఏ ఎస్ అధికారులదీ అదే పరిస్థితి. ప్రతినిధులకు విందు ఏర్పాటు చేసిన గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌ల వద్దకు వెళ్లేందుకూ వారికి అవకాశం లేదు. -
జీఈఎస్ యవనికపై ఈ ముగ్గురూ..
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తళుక్కుమననున్నారు. వినూత్న ఆలోచనలతో స్థాపించిన తమ స్టార్టప్‌లతో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తల సరసన సత్తా చాటనున్నారు. హెచ్ఐసీసీలో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 76 మంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశం దక్కింది. వారిలో పలువురిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఈ యువ పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను వెల్లడించారు. – సాక్షి, హైదరాబాద్ సొరెవా.. ఇంటింటికీ సౌర విద్యుత్ పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు.. ఇంటర్లో స్టేట్ ఫస్ట్.. రాజస్తాన్ బిట్స్ పిలానీలో బీటెక్.. అనంతరం క్యాంపస్ సెలెక్షన్స్లోనే రిలయన్స్ సంస్థలో రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. కానీ కొత్తగూడెంకు చెందిన శివ సుబ్రమణ్యానికి ఇవేవీ సంతృప్తినివ్వలేదు. తాను కలలుగన్న ప్రాజెక్టు కోసం ఆర్నెల్లలోనే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. సౌర విద్యుత్‌ను గ్రామస్థాయిలో ఇంటింటికీ తీసుకురావడమే లక్ష్యంగా.. ‘సొరెవా’పేరుతో కంపెనీని నెలకొల్పారు. ప్రయోగాత్మకంగా ‘ఈ–గ్రిడ్’అనే ప్రాజెక్టును చేపట్టారు. ‘పవర్ టు ఎంపవర్’అనే థీమ్‌తో స్వయం సహాయక గ్రూపుల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇచ్చాయి. 2017 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ‘ఎన్ఐఎస్ఈ’కింద ఇచ్చిన ప్రాజెక్టును గుర్గావ్లో విజయవంతంగా అమలు చేయడంతో.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టును సందర్శించి, ప్రశంసించారు. ఈ క్రమంలో పలువురు విదేశీ శాస్త్రవేత్తల సలహాల మేరకు.. దేశ విదేశాల్లో ‘సోలార్ ప్రాజెక్టు–మహిళా సాధికారత’, ఇతర అంశాలపై ప్రపంచ స్థాయి సదస్సుల్లో ప్రసంగించారు. 70కి పైగా దేశాల్లో పర్యటించి తన ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. ఈ క్రమంలో హాంకాంగ్‌లో జరిగిన సదస్సులో శివ ప్రాజెక్టు నచ్చిన అమెరికన్ కంపెనీ ‘సోలెవాల్ట్’.. సోరెవా కంపెనీతో కలసి పనిచేయటానికి ముందుకు వచ్చింది. ఈ విధంగా ఇరు సంస్థలు కలసి ఆఫ్రికాలోని గినీ దేశంలో తొలి ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే మూడేళ్లలో 200 గ్రామాల్లో సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడమే వారి లక్ష్యం. ‘‘అమెరికన్ కంపెనీతో కలసి పనిచేయడం.. హైదరాబాద్‌లో మహిళా సాధికారత థీమ్‌తో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో పాల్గొనే అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి..’’అని శివ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్ సమస్యల పరిష్కార వేదిక ఏటా లక్షలాది మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. కానీ ఇంగ్లిష్ భాషపై పట్టు, ఉద్యోగంలో చేరేందుకు అవసరమైన కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు ఉండటం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా స్థాపించిన సంస్థే ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్’. జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్‌కు చెందిన పులి రవి ఈ సంస్థను స్థాపించారు. ఉద్యోగం కోసమని ఇరవై ఏళ్ల కింద రవి అమెరికా వెళ్లారు. ఐదేళ్లపాటు ఉద్యోగం చేశాక.. ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్’పేరిట ఓ సంస్థను ప్రారంభించారు. జీఈఎస్ సదస్సులో పాల్గొనే అవకాశం వచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’ ఆయనను పలకరించింది. కనీసం బస్సు సౌకర్యం లేని మారుమూల పల్లె నుంచి అంచెలంచెలుగా తాను ఈ స్థాయికి వచ్చానని.. తన లాంటి నేపథ్యమున్న యువత భారత్‌లో ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి యువత డిగ్రీలు చదివినా ఇంగ్లిష్ భాషపై పట్టు లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపాలతో మంచి ఉద్యోగాలు సంపాదించడంలో వెనకబడిపోతున్నారని చెప్పారు. అలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని ఉందని.. ఈ మేరకు తమ సంస్థ తరఫున ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఈ సదస్సు జరగడం ఎంతో ప్రయోజనకరమన్నారు. వివిధ దేశాల్లో పరిశ్రమలు నిర్వహిస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు ఒకే చోట కలసి.. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, నిర్వహణ, సవాళ్లపై చర్చిస్తారని చెప్పారు. కోకోబూస్ట్.. తృణధాన్యాలతో పౌష్టికాహారం తేజస్విని.. ‘కోకోబూస్ట్’పేరిట ఫుడ్ స్టార్టప్‌ను స్థాపించి ఏడు నెలల్లోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహిళ. చిత్తూరు జిల్లా బుడిపాలం మండలం రాజవానిపట్టడికి చెందిన ఆమె.. సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తూనే, సివిల్ సర్వీస్ కోసం సన్నద్ధమవుతున్న తేజస్విని... ఇటు ‘కోకోబూస్ట్’సంస్థనూ విజయవంతంగా నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పౌష్టికాహార సమస్యను ఎదుర్కొంటున్నాయి. పిల్లల, పెద్దల ఆహారపు అలవాట్లు, జంక్‌ఫుడ్‌తో అనేకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి పౌష్టికాహారాన్ని సరికొత్త పద్ధతిలో అందుబాటులోకి తేవాలని భావించిన తేజస్విని.. ‘కోకోబూస్ట్’ను స్థాపించారు. తృణధాన్యాలతో పూర్తి పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నారు. వాటిని న్యూట్రిషన్ బార్ (చాక్లెట్ బార్ లాంటి) రూపంలో అందిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, అథ్లెట్లు, క్రీడాకారులు, డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇవి ఉపయుక్తంగా ఉంటాయని తేజస్విని చెప్పారు. అంతేకాదు ఎలాంటి రసాయన మిశ్రమాలను ఉపయోగించకుండా.. పూర్తి సహజ పద్ధతిలో నిల్వ చేస్తున్నామన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా తాము కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కర్ణాటక నేషనల్ మిల్లెట్ ఫెయిర్‌లో ‘కోకోబూస్ట్’ ఆకర్షణగా నిలిచిందని చెప్పారు. -
నమస్తే.. మేం మీకెలా సాయపడగలం!
సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే.. ఈ చారిత్రక నగరానికి మీకు స్వాగతం.. నగరంలో మీరు హాయిగా గడిపేందుకు మేం మార్గదర్శనం చేస్తాం. చారిత్రక, పర్యాటక ప్రాంతాల వివరాలు కావాలన్నా, మీ షెడ్యూల్లో స్పష్టత కావాలన్నా మమ్ముల్ని సంప్రదించండి..’పోచంపల్లిలో రూపొందిన వాస్కోటు ధరించిన యువకులు మొహంపై చిరునవ్వుతో విదేశీ అతిథులను ఇలా ‘గైడ్’చేయబోతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు వస్తున్న దేశవిదేశీ అతిథుల సేవకు భారీ సైన్యం ఏర్పాటైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యాటక అతిథ్య సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కు చెందిన 300 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ సాధారణంగా పెద్ద ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో పాల్గొనే వారికి టూర్ గైడ్లుగా వాలంటీర్లను సిద్ధం చేయటం కద్దు. కానీ ఈ సదస్సు ప్రతిష్టాత్మకమైంది కావటంతో టూర్ గైడ్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మూడు సంస్థల్లో చురుకుగా ఉండే యువకులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో కాలు మోపింది మొదలు సదస్సు పూర్తయ్యాక మళ్లీ విమానాశ్రయానికి చేరుకునే వరకు ఈ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని వీరి నుంచి తెలుసుకునేలా సిద్ధం చేసింది. విదేశీ అతిథులు ఏ దశలో అసహనం వ్యక్తం చేయకుండా వీరికి తర్ఫీదునిచ్చారు. హైదరాబాద్ ప్రత్యేకతల గురించి ప్రశ్నిస్తే కూడా చెప్పేందుకు వీలుగా ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, వంటలు, వాతావరణం, ఇతర ప్రత్యేకతల్లో ముఖ్యమైన విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఏ విషయాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా విసుక్కోవద్దని, ఎక్కడా మాటల్లో తడబాటు ఉండొద్దని, తనకు తెలియదు అన్న సమాధానం రావొద్దని నిపుణుల ద్వారా మూడ్రోజులపాటు తర్ఫీదునిచ్చారు. మధ్యలో ఓ రోజు అమెరికాకు చెందిన ఓ బృందం కూడా వచ్చి వీరికి కొన్ని పద్ధతులపై అవగాహన కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వస్త్ర శైలిలో ప్రత్యేకతగా నిలిచేది ఆయన వాస్కోటు. అదే తరహాలో ఈ టూర్ గైడ్లకు కూడా పోచంపల్లిలో ప్రత్యేంగా వాస్కోట్లు రూపొందించి అందించారు. ‘ఇది ప్రతిష్టాత్మక సదస్సు. ఇందులో లోపం తలెత్తితే మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ప్రత్యేక శిక్షణతో ఈ బృందాన్ని సిద్ధం చేశాం. విదేశీ ప్రతినిధులకు వీరు సంప్రదాయ పద్ధతిలో సహాయంగా ఉంటారు’అని పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు ‘సాక్షి’కి చెప్పారు. -
సద్వినియోగం చేసుకుందాం
ప్రపంచంలోని దాదాపు నూట యాభై దేశాల పారిశ్రామిక ప్రతినిధులను సాద రంగా ఆహ్వానించి, ఆత్మీయ ఆతిథ్యాన్నిచ్చి ఎనిమిదవ ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్)ను విజయవంతం చేయడానికి భాగ్యనగరి సర్వసంసిద్ధమై ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటూ జరిగే ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సదస్సుకు తగ్గట్టు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పకడ్బందిగా సకాలంలో సక్రమంగా పూర్తి చేయడానికి ప్రశంసనీయమైన కృషి చేసింది. అంతే కాదు, అదే సమయానికి హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైలు సేవలను కానుకగా అందించడం విశేషం. అమెరికా, ఇతర దేశాలలోని ప్రైవేటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలకు, ప్రత్యేకించి కొత్తగా ఏర్పాటుచేసే స్టార్టప్ సంస్థలకు పెట్టుబడి, సాంకేతికత, నైపుణ్యాలు, సమాచారం తదితరాలను సమకూర్చడానికి తోడ్పడే ధ్యేయంతో 2010 నుంచి ఈ వార్షిక సదస్సులను నిర్వహిస్తోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రేరణను, పెట్టుబడులకు నూతన అవకాశాలను కల్పించడానికి కొత్త ఆర్థిక వృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. దేశదేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు అమెరికా ద్రవ్య, సాంకేతిక, నైపుణ్య సంస్థలను, అనుభవజ్ఞులను ఈ సందర్భంగా కలుసుకో గలుగుతారు. తద్వారా వారి మధ్య ఆదాన ప్రదానాలకు, కొత్త భాగస్వామ్యాలకు అవకా శాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో అవ సరమైన అనుభవజ్ఞుల, నిపుణుల సలహాలు, సహాయసహకారాలు, పెట్టుబడులు సమకూరుతాయి. హైదరాబాద్ నగరం పెద్ద సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, సంస్థలకు నెలవైన సాంకేతిక కేంద్రం. అంతే కాదు, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఉబర్ తదితర ప్రముఖ అమెరికన్ సంస్థలున్న నగరం. జీఈఎస్‌కు తగిన వేదిక. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకా ట్రంప్‌లు కలసి ప్రారంభించనున్న ఈ ఏడాది సదస్సును ‘మహిళలకు ప్రథమ స్థానం, అందరికీ సౌభాగ్యం’ అనే శీర్షికతో నిర్వహిస్తుండటం విశేషం. అందుకు తగ్గట్టే సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల్లో 52 శాతానికి పైగా మహిళలే. ఈ సదస్సుకు ముందే రంగాలవారీగా దేశంలోని వివిధ నగరాల్లో సుప్రసిద్ధ అమెరికన్ సంస్థలు, నిపుణులు, అనుభవజ్ఞులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో, ఆవిష్కర్తలతో గోష్టులు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించారు. ఈ సదస్సు, దాదాపు రెండేళ్ల క్రితం తాను ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కార్య క్రమానికి ఊపును ఇస్తుందని ప్రధాని మోదీ ఆశిస్తున్నారు. 1,500 మంది ప్రతి నిధులలో 400 మంది భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు. కాగా, ఇవాంకా ట్రంప్ నేతృత్వంలోని 400 మంది అమెరికన్ మదుపరులు, వ్యాపార నిపు ణుల బృందం హాజరవుతోంది. వివిధ వర్క్‌షాప్‌లు, గోష్టులు తదితర రూపాల్లో సాగే ఈ సదస్సు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఆవిష్కర్తలకు అమెరికా సంస్థ లతో కలసి పనిచేసే, వాటి సహాయసహకారాలను అందుకునే అవకాశాలను కల్పి స్తుంది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్యవైద్య సేవలు–జీవ విజ్ఞానశాస్త్రాలు, డిజిటల్ ఆర్థికవ్యవస్థ– ద్రవ్యసాంకేతికత, విద్యుత్తు–మౌలిక సదుపాయాలు, మీడియా–వినోదం అనే నాలుగు రంగాలపైన సదస్సు దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ కార్యక్రమాన్నంతటినీ అమెరికాతో కలసి మన నీతి ఆయోగ్ నిర్వహిస్తోంది. మన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రత్యేకించి స్టార్టప్ సంస్థలు అందివచ్చిన ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని ఆశిద్దాం. లైసెన్స్‌లు, భూసేకరణ, పర్యావరణ అనుమతులు తదితర అంశాల్లో అడ్డం కులను తొలగించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యో గితను పెంచాలనేది ఈ పథకం లక్ష్యం. దీనికి మంచి స్పందన లభించింది 4,200 రిజిస్టరయిన స్టార్టప్ సంస్థలతో ప్రపంచంలో మన దేశం 3వ స్థానానికి చేరింది. 2016లో స్టార్టప్ హబ్ మొదలయ్యాక స్టార్టప్‌లకు నిధులను, పన్నుల మినహాయిం పులు, రాయితీలను కల్పించడం, తదితర సహాయ సేవలను అందిస్తోంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎస్ఐడీబీ) స్టార్టప్‌లలో మదుపులు పెట్టడం కోసం రూ. 10,000 కోట్లను ఎనిమిది వెంచర్ కేపిటల్ ఫండ్స్‌కు కేటాయించింది. అయినా మన స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో మూణ్ణాళ్ల ముచ్చటగా ముగుస్తుండటం శోచనీయం. దీంతో ఈ పథకం ఆచరణయోగ్యతే చర్చనీయాంశంగా మారుతోంది. మన స్టార్టప్‌లలో 90 శాతం ఐదేళ్లు తిరిగేసరికి విఫలమౌతున్నాయనే ఆందోళన కరమైన చేదు వాస్తవాన్ని ఐబీఎమ్ తాజా సర్వే వెల్లడించింది. మన స్టార్టప్‌లు నిధుల లభ్యత, ప్రభుత్వపరమైన అడ్డంకుల వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మాట నిజమే. కానీ మన స్టార్టప్ పారిశ్రామికవేత్తలు స్థానిక అవసరాలపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన సంస్థ లను అనుకరించడమే ఈ వైఫల్యాలకు ప్రధాన కారణమని ఐబీఎమ్ సహా పలు వురు నిపుణులు నిర్ధారించారు. ఉబర్ వంటి సంస్థలు విజయవంతం అవుతున్నా, మన స్టార్టప్‌లు నగరాల్లో తీవ్ర సమస్యగా ఉన్న రవాణా వంటి రంగాలవైపు దృష్టి సారించడం లేదు. ఆవిష్కరణ అంటేనే అంత వరకు లేని కొత్త వస్తువు, సేవ లేదా మార్కెట్‌ను కనుగొనడం. అదే కొర వడితే స్టార్టప్‌లు మూలనపడక తప్పదు. స్థానిక ప్రజల అవసరాలపై ఆధారపడిన ఆవిష్కరణలకు మార్కెట్ కొరత ఉండక పోవ డమే కాదు, నిపుణ శ్రామికుల కొరత ఉండదు. అవసరమైతే కొద్దిపాటి శిక్షణతో ఉపయోగించుకోగలిగిన విద్యా వంతులైన నిరుద్యోగ యువతకు కొదవ లేదు. ఈ సదస్సుకు హాజరవుతున్న పలువురి విజయగాథలు, అనుభవజ్ఞులు, నిపుణుల నుంచి మన నవ పారిశ్రామికవేత్తలు నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ఆ అంత ర్జాతీయ స్థాయి సాంకేతికతను, నైపుణ్యాలను, పెట్టుబడులను స్థానిక అవసరా లను తీర్చే ఆవిష్కరణల కోసం, స్థానిక శ్రమపై ఆధారపడగల ఉత్పత్తి పద్ధతులను పెంపొందింప చేయడం కోసం ఉపయోగించగలిగేతేనే మన స్టార్టప్‌లు విజయ వంతం అవుతాయి. అప్పుడే ఈ సదస్సుకు సార్థకత. -
హైదరాబాద్ గ్లోబల్
సాక్షి, హైదరాబాద్: ఇక్కడ మహిళలు మైనారిటీ కాదు.. తొలిసారి మెజారిటీలోకి వచ్చారు. ఇదీ... మంగళవారం నుంచి హైదరాబాద్ వేదికగా మొదలు కాబోతున్న ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు–జీఈఎస్ 2017’ ప్రత్యేకత. ఇదొక్కటేనా!! అమెరికా ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ సదస్సు.. దక్షిణాసియాలో జరగటం ఇదే ప్రథమం. అంతేకాదు! 10 దేశాల నుంచి వస్తున్న బృందాల్లో మహిళలు తప్ప పురుషులు లేనేలేరు. ఇలాంటి ప్రత్యేకతలెన్నో మూటగట్టుకున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమవుతోంది. హెచ్ఐసీసీలో మూడ్రోజులపాటు జరిగే సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభ వేడుకల్లో వీరితో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ సహా పలువురు ముఖ్యులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుంచి దాదాపు 1700 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో.. తమ ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని మారుస్తున్న పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొంటారు. సోమవారం సాయంత్రానికే వీరిలో చాలా మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారత్–అమెరికా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సయుక్త సదస్సు కావటంతో ఏర్పాట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అతిథులకు ఘనమైన ఆతిథ్యమిచ్చేందుకు రాష్ట్ర సర్కారు భాగ్యనగరాన్ని అందంగా ముస్తాబు చేసింది. నీతి ఆయోగ్ నిర్వహణ ఏర్పాట్లకు సారథ్యం వహించింది. 2010 వాషింగ్టన్లో తొలిసారి సదస్సు నిర్వహించిన అమెరికా... తర్వాత ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీలో నిర్వహించింది. ఎనిమిదో సదస్సుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 52.5 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలే హాజరవుతుండటంతో సదస్సు ప్రపంచ మహిళా చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. వేదికపై ముగ్గురి ప్రసంగాలు హైదరాబాద్‌లో మెట్రో రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అక్కణ్నుంచి నేరుగా సదస్సుకు హాజరవుతారు. ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతోపన్యాసం చేస్తారు. భారత్, అమెరికా జాతీయ పతాకాలను ఎగరేస్తారు. తర్వాత అమెరికా ప్రతినిధిగా ఇవాంకా ట్రంప్, చివరగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది ముగిసిన వెంటనే వివిధ దేశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలపై ప్లీనరీ సెషన్ మొదలవుతుంది. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ మోడరేటర్‌గా వ్యవహరించే ఇందులో... ప్యానెల్ స్పీకర్లుగా ఇవాంక, ఎస్సారెస్ ఏవియేషన్, పెట్రోలియం ఎండీ శిబొంగ్లే సాంబో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, స్కాండినెవియా బ్యాంక్ ఛైర్మన్ మార్కస్ వ్యాలెన్బర్గ్ ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇన్నోవేషన్స్ ఆన్ వర్క్‌ఫోర్స్ డెవెలప్మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ అనే చర్చా గోష్ఠిలోనూ ఇవాంకా పాల్గొంటారు. ఈ చర్చకు పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ప్యానెల్లో ఇవాంకతో పాటు చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ సీసీవో కరెన్ క్వింటోస్ ఉంటారు. అమెరికా, భారత్ భారీ అంచనాలు మహిళలు నిలదొక్కుకుని, ఆర్థిక సాధికారతను సాధిస్తే... అక్కడి సమాజాలు, ఆయా దేశాలు వృద్ధి సాధిస్తాయని చెప్పాలనేది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ దిశగా భారత్, అమెరికా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని చాటి, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. ఇప్పటికే మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలతో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం సదస్సుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. దేశంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు మరో మెట్టును అధిగమించేందుకు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకు వస్తారని ఆశాభావంతో ఉంది. ‘ది ఇండియా ఎడ్జ్‘ పేరుతో దేశంలో ప్రఖ్యాతి సాధించిన వంద స్టార్టప్ కంపెనీలకు ఈ సదస్సులో పాలుపంచుకునే అరుదైన అవకాశం కల్పించింది. ఈ స్టార్టప్‌లన్నీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయని, దీంతో కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు భారత్ గమ్యస్థానంగా నిలుస్తుందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలను ఈ సదస్సుకు ఆహ్వానించింది. దేశ విదేశాల నుంచి 200 మంది మీడియా ప్రతినిధులు రానున్నారు. ఇక్కడి అవకాశాలను చాటుదాం ప్రపంచం అందరి దృష్టిని ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సదస్సుపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ అవకాశం భవిష్యత్తులో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు తెచ్చి పెడుతుందని, శిఖరాగ్ర సదస్సు ద్వారా ఇక్కడున్న అపారమైన వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్‌ను తలపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పర్యటనతో పోలీసులు భారీ భద్రతతో పాటు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. మియాపూర్, కూకట్పల్లి, ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట, ఆరాంఘడ్ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే ఆయా మార్గాల్లో వెళ్లే బస్సులను వేరే మార్గంలో మళ్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మియాపూర్‌తో పాటు కూకట్‌పల్లిలోని పలు విద్యాసంస్థలు మంగళవారం సెలవు ప్రకటించాయి కూడా. ఇక ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెచ్ఐసీసీ, ఆపై తాజ్ ఫలక్నుమలకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత ప్రధాని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరిగి వెళ్ళనున్నారు. ఇవాంక మాత్రం బుధవారం సాయత్రం వరకు ఇక్కడే ఉంటారు. ఈ మూడు రోజుల్లోనూ మొత్తం మూడు విందులు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజ్ ఫలక్నుమలో, రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో, అమెరికా ప్రభుత్వం హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో విందులు ఏర్పాటు చేశాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసులను కేటాయించారు. ప్రధానికి సంబంధించి తాజ్ ఫలక్‌నుమ, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగితా టూర్ మొత్తం హెలీకాఫ్టర్లో జరుగుతుంది. అయినా ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్ళే ప్రముఖులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేశారు. వెస్టిన్ హోటల్, హెచ్ఐసీసీ, తాజ్ ఫలక్‌నుమ చుట్టుపక్కల సైతం ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు విధించలేదు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్ళే వారు కచ్చితంగా తమ వెంట గుర్తింపుకార్డు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన ఘట్టాలు కావడంతో అనుకోని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే వేదికలతో పాటు వాటికి దారి తీసే మార్గాల్లో ఉన్న చిరు వ్యాపారులను తొలగించారు. కాన్వాయ్‌లు, అతిథుల వాహనం ప్రయాణించేప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అలాగే మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం హెచ్ఐసీసీలో జరగనున్న జీఈఎస్ సదస్సుకు మోదీ హాజరుకానున్న నేపథ్యంలో సోమవారం సైబరాబాద్ పోలీసులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి ప్రధాని హెలికాప్టర్లో చేరుకోనున్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. 20కి పైగా వాహనాలు కాన్వాయ్‌లో పాల్గొన్నాయి. -
వాహ్.. ఫలక్‌నుమా ప్యాలెస్
-
నవ యువ నారీ..విజయోస్తు!
-
నవ యువ నారీ.. విజయోస్తు!
సాక్షి, హైదరాబాద్: మహిళలు ముందుంటే.. అందరికీ శ్రేయస్సే.. భాగ్యనగరం వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ఈ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయనుంది! నవ యువనారి శక్తిని ప్రపంచానికి చాటనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంక ట్రంప్ రాకతో ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ సదస్సు మంగళవారం హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా ప్రారంభం కానుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అంతరిక్ష రంగంలో తమదైన ముద్ర వేసిన అనౌషే అన్సారీ, షింబోంజిలే సాంబో, ఎమ్ఐటీ ప్రొఫెసర్లు, భారత్‌కు చెందిన అను ఆచార్య, రాధికా అగర్వాల్ వంటి దిగ్గజాలు ఎందరో సదస్సులో మాట్లాడనున్నారు. దాదాపు 150 దేశాల నుంచి ప్రతినిధులు రానుండగా వారిలో 127 దేశాల నుంచి మహిళల ప్రాతినిధ్యం ఉండనుంది. అందులో పది దేశాల నుంచి అందరూ మహిళా ప్రతినిధులే కావడం విశేషం. ఈసారి పురుషుల కంటే మహిళల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉండనుంది. మొత్తం ప్రతినిధుల్లో 52.5 శాతం వారే ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన జీఈఎస్ సదస్సుల్లో పురుషుల కంటే మహిళా ప్రతినిధులు ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి. అలాగే ప్రతినిధుల్లో 5 శాతం మంది యువతీయువకులే! వీరంతా 30 ఏళ్లలోపు వారే. కనిష్టంగా 13 ఏళ్ల నుంచి గరిష్టంగా 84 ఏళ్ల వయస్సున్న పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. మహిళలపై రకరకాల ఆంక్షలు అమల్లో ఉన్న అఫ్గానిస్థాన్, సౌదీ అరేబియాతోపాటు ఇజ్రాయిల్ నుంచి మహిళా ప్రతినిధులు సదస్సుకు రానుండటం హైలైట్. ఎనిమిదో సదస్సు.. ఎన్నో విశిష్టతలు జీఈఎస్ ప్రారంభమైనప్పట్నుంచీ ఏటా జరుగుతున్న సదస్సులో ఇది ఎనిమిదోవది. దక్షిణాసియా దేశాల్లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు ఎన్నో ప్రాధాన్యతలున్నాయి. ఏటా ఒక్కో ఇతివృత్తంతో నిర్వహించే ఈ సదస్సులో ఈసారి మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. సదస్సుకు అమెరికా ప్రభుత్వంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ ఏర్పాట్లు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్నారు. హెల్త్ లైఫ్‌సైన్సెస్, ఎనర్జీ–ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ–ఫైనాన్సియల్ టెక్నాలజీ, మీడియా–ఎంటర్టైన్మెంట్ నాలుగు రంగాలపైనే సదస్సు ఫోకస్ చేయనుంది. స్టార్టప్‌లు ప్రారంభించిన ఔత్సాహికులు, నవ పారిశ్రామికవేత్తలకు ఊతమివ్వాలనేదే జీఈఎస్ లక్ష్యం. సదస్సుకు హాజరయ్యే 1,500 మంది ప్రతినిధుల్లో 1,200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ల యజమానులుంటారు. మిగతా 300 మంది ఔత్సాహికులకు ఆర్థికంగా సాయం అందించే పెట్టుబడిదారులు. మొత్తం ప్రతినిధుల్లో దాదాపు మూడో వంతు మంది అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచే రానున్నారు. కొలంబియా, ఫూర్టోరికో జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల బృందానికి ఇవాంక ట్రంప్ సార«థిగా హాజరవనున్నారు. వంద స్టార్టప్‌ల అధునాతన షో భారత్‌లో దేశం నలుమూలాల నుంచి దాదాపు అయిదు వందల మంది సదస్సులో పాలుపంచుకుంటారు. దేశంలో పేరొందిన నూతన ఆవిష్కరణలు, ఉత్పత్తులను తయారు చేసిన వంద స్టార్టప్ కంపెనీలకు సదస్సులో ప్రత్యేక చోటు కల్పించారు. డీఐపీపీ ఎంపిక చేసిన వంద స్టార్టప్‌లు తొలి రోజున ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ ఉత్పత్తులు, సేవలపై అత్యంత అధునాత స్క్రీన్లపై ప్రదర్శన ఇవ్వనున్నాయి. 35 మంది విజేతలకు ప్రత్యేక అవకాశం సదస్సు ఏర్పాట్లు ప్రారంభమైనప్పట్నుంచీ ఇప్పటివరకు హ్యాకథ్లాన్ మొదలు పిచ్ కాంపిటేషన్లు నిర్వహించారు. ఓటింగ్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. దేశంలో 500 మంది ఔత్సాహికులు తమ ఆవిష్కరణలు, ఆలోచనలు, కొత్త స్టార్టప్‌లతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో అత్యంత ప్రతిభావంతంగా ఉన్న ఆలోచనలను పంచుకున్న 35 మందిని ఎంపిక చేశారు. వీరంతా తమ ఐడియాలను, ఆవిష్కరణలను ప్రపంచ పెట్టుబడిదారులతో సదస్సులో పంచుకునే అవకాశం కల్పించారు. కాగా, సదస్సుకు హాజరయ్యే దేశ, విదేశీ అతిథులకు అబ్బురపరిచేలా అతిథ్యం ఇవ్వటంతో పాటు అవాంఛనీయ సంఘటనలేవీ చోటుచేసుకోకుండా కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. అందరూ దిగ్గజాలే.. జీఈఎస్‌లో వివిధ రంగాలకు చెందిన పలువురు దిగ్గజాలు తమ అనుభవాలు పంచుకుంటారు. వారిలో కొందరి ఆసక్తికరమైన నేపథ్యాలివీ.. అనౌషే అన్సారీ: మహిళలపై ఆంక్షలు అమల్లో ఉన్న ఇరాన్ నుంచి అంతరిక్షం వరకు ఎదిగిన మేధావి ఈమె. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కలిగిస్తే పెనుమార్పులు చోటు చేసుకుంటాయనే అంశంపై ఈ ఇరానియన్–ఆమెరికన్ వ్యోమగామి ప్రసంగించనున్నారు. షింబోంజిలే సాంబో: దక్షిణాఫ్రికాకు చెందిన ఈమెను కెరీర్ ఆరంభంలో ఓ ఫ్లైట్ అటెండెంట్‌గా కూడా పనికిరాదంటూ అందరూ తిరస్కరించారు. ఇప్పుడు ఆమె సొంత విమాన సంస్థ (ఏవియేషన్ కంపెనీ) స్థాపించారు. ఆమె ప్రసంగం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. – అత్యంత ప్రతిభావంతులైన ఎమ్ఐటీ ప్రొఫెసర్లు కార్లో రాటీ, డేనియెల్లే వుడ్లు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికరంగంలో సమీప భవిష్యత్తులో రానున్న సాంకేతిక విప్లవాలను సదస్సులో వివరిస్తారు. – భారత్‌కు చెందిన అను ఆచార్య, రాధికా అగర్వాల్ వంటి పారిశ్రామికవేత్తలు సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనపై మాట్లాడతారు. – ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన కెరియర్ పూర్తిగా వదిలేసి, క్రీడా పారిశ్రామికవేత్తగా పేరు గడించిన ఛాత్రి సిత్యోడ్టాంగ్ తన అనుభవాలను వివరిస్తారు. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, బాడ్మింటన్ రంగానికి వన్నె తెచ్చిన పుల్లెల గోపీచంద్‌తో ఛాత్రి వేదికను పంచుకోనున్నారు. – న్యూయార్క్‌లోని అత్యున్నత రేటింగ్‌తో రెస్టారెంట్లను విజయవంతంగా నడుపుతున్న ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా తన అనుభవాలను వివరిస్తారు. – యూనీ కార్న్ స్టార్టప్ (అంటే ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న సంస్థ)గా ఓయో రూమ్స్‌ను నెలకొల్పిన కేవలం 24 ఏళ్ల వయసున్న రితేష్ అగర్వాల్ తన సక్సెస్ స్టోరీ వివరిస్తారు. – ‘త్రీ ఇడియట్స్’సినిమాలోని ఫున్సుఖ్ వాంగ్డూ పాత్రకు అసలు రోల్ మోడల్, ఇంజనీరు సోనమ్ వాంగ్‌చుక్ ప్రసంగిస్తారు. లడాఖ్‌కు చెందిన ఈయన ఒక ఇంజనీరు నుంచి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగారు. – అడ్వర్టయిజింగ్ రంగంలో నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీయూష్ పాండేతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విందును పురస్కరించుకొని ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు, క్యూఆర్టీ, అమెరికా, కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా సంస్థలు ప్యాలెస్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్యాలెస్‌కు వెళ్లే రూట్లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌బౌలి రహదారులను జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సీఎస్ ఎస్పి.సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రావు, కలెక్టర్ యోగితా రాణాలు ప్యాలెస్‌లో ఏర్పాట్లతో పాటు బందోబస్తును పర్యవేక్షించారు. రైల్వే పోలీసులు కూడా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్లో, దక్షిణ మండలం పోలీసులు ప్యాలెస్ పరిసరాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 45 బస్సులలో అతిథులు విచ్చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్ అంశాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. మొత్తం 2000 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 520 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటు సోమవారం సాయంత్రం కాన్వాయ్ రిహర్సల్స్ చేయనున్నారు. ప్యాలెస్‌కు అతిథులు విచ్చేసే సమయంలో ప్రధాన రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ రానున్న నేపధ్యంలో నిఘా పెంచామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను ఆపరేట్ చేస్తామని తెలిపారు. డెలిగేట్స్ బస చేసే 21 హోటల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. ఎల్లుండి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని... నగరంలో 10 వేల 4 వందల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు . -
ఫలక్ నుమాలో భారీ బందోబస్తు
-
సోషల్‌మీడియాలో హైదరాబాదీల అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనపై సోషల్‌మీడియాలో నెటిజన్లు విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. కొంచెం వీలు చేసుకుని తమ వీధుల గుండా ప్రయాణించాలని ఇవాంకాను అభ్యర్థిస్తున్నారు. అప్పుడైనా జీహెచ్ఎంసీ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతుందని, రోడ్లు బాగు అవుతాయని అంటున్నారు. మరో మూడు నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేస్తామని అన్నారు. నగరంలో ఇవాంకా పర్యటన సందర్భంగా వాట్సాప్‌లో తిరుగుతున్న మెసేజ్ సారాంశం ఇలా వుంది.. హైదరాబాదీ : ఇవాంకా గారు నేను మణికొండలో నివాసం ఉంటున్నాను. మీరు మా రోడ్ల మీద ప్రయాణిస్తే బావుంటుంది. అప్పుడైనా మాకు కొత్త రోడ్లు వేస్తారు. ఇవాంకా : రోడ్ల నిర్మాణంపై నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను. హైదరాబాదీ : అప్పుడు కేంద్ర ప్రభుత్వం మాపై రోడ్ సర్వీస్ ట్యాక్స్ వేస్తుంది. ఈ ఒక్క మెసేజే కాదు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లు వేదికగా ఇవాంకా ట్రంప్ పర్యటనపై నెటిజన్లు పెడుతున్న పోస్టులకు లెక్కలేదు. హఫీజ్‌పేట్‌లోని రోడ్ల మీదుగా పర్యటించాలని ఒకరు, మా ప్రాంతం గుండా ప్రయాణించాలని మరొకరు ఇవాంకాను అభ్యర్థిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా కొత్త ఫుట్‌పాత్‌లు కనిపించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై జీహెచ్ఎంపీ కమిషనర్ జనార్ధన్ రెడ్డికి ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పెట్టారు. హైదరాబాద్‌లో రోడ్లకు ఇరువైపులా కొత్త ఫుట్‌పాత్‌లు చాలా అందంగా ఉన్నాయని మెయిల్లో పేర్కొన్నారు. అయితే, ముందుముందు వాటిని ఎలా నిర్వహిస్తారో తలుచుకుంటే భయంగా ఉందన్నారు. ఫుడ్ ట్రక్స్ త్వరలోనే ఫుట్‌పాత్‌లను కళ తప్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
జీఈఎస్‌లో హైదరా‘బాత్’
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సదస్సు నిర్వహణతో హైదరాబాద్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగనుంది. దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు, అంకుర పరిశ్రమల అధినేతలు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో.. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన సుమారు 72 మంది ప్రసంగించనున్నారు. అందులో హైదరాబాద్‌తో ప్రత్యక్ష, పరోక్ష అనుబంధమున్న ఆరుగురు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిలో శశిశేఖర్ వెంపాటి, అనురాధా ఆచార్య, జయదీప్ కృష్ణన్, రమణ గోగుల, కొండా సంగీతారెడ్డి, టెస్సీ థామస్‌లు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే.. జయదీప్ కృష్ణన్.. టీ–హబ్ సీఈవో దేశంలో అంకుర పరిశ్రమలకు అతిపెద్ద ఇంక్యూబేటర్గా పేరొందిన టీ–హబ్ సీఈవోగా జయదీప్ కృష్ణన్ పనిచేస్తున్నారు. గత 20 ఏళ్లుగా మన దేశంతో పాటు అమెరికాలో సంయుక్తంగా విస్తరించిన వ్యవస్థాపక, కార్పొరేట్ రంగాల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. తన కెరీర్ ప్రారంభంలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న ఓ టెక్నాలజీ సంస్థ విఫలమైంది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని అంచలంచెలుగా ఎదిగారు. అల్మామేటర్ ఇంక్యుబేషన్ సెంట్రల్ సంస్థ నుంచి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (బెంగుళూరు)లో ఒక ఇండస్ట్రియల్ రాడిఫైనిటీ అనే సాంకేతికతను నిర్వహించే స్థాయికి ఎదిగారు. 2010లో టెలికం స్పేస్ రంగంలో బ్రూక్ట్రాట్ టెక్నాలజీ అనే అంశంపై పరిశోధక ఇంజనీర్‌గా సేవలందించారు. అనేక అంకుర పరిశ్రమలను స్థాపించి వేలాది మందికి ఉపాధి చూపారు. అనేక అంతర్జాతీయ స్థాయి అవార్డులు ఆయనను వరించాయి. ఇందులో క్లీన్టెక్ ఓపెన్, ఐసీఎస్పీఏటీ, టెక్ కనెక్ట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ఉన్నాయి. తొలుత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (బెంగళూరు)లలో పలు కోర్సులు చేశారు. రమణ గోగుల.. క్లీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ సౌరశక్తి ఆధారిత వ్యవసాయం ద్వారా నిరుపేద రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రమణ గోగుల కృషి చేస్తున్నారు. గతంలో వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేసిన ఆయన.. అనేక అంకుర పరిశ్రమల్లో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సోలార్, ఎల్ఈడీ కాంతులు పంచే కృషిలో పాలుపంచుకున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ, లూసియానా వర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్నారు. మన దేశంలో సైబేస్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆయన 25 దక్షిణాది చిత్రాలకు సినీ నేపథ్య సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఆయన రూపొందించిన ఆయే లైలా ఆల్బమ్ ఎంటీవీ, వీ వంటి వినోద, మ్యూజిక్ చానళ్లలో బహుళ ప్రాచుర్యం పొందడం గమనార్హం. కొండా సంగీతారెడ్డి.. అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దేశంలో ప్రైవేట్ హెల్త్ కేర్ మార్గదర్శకురాలిగా.. ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగంలో చేసిన సేవల ద్వారా సంగీతారెడ్డి విశేష గుర్తింపు పొందారు. 1983లో ప్రారంభమైన అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ను.. 140 దేశాల్లో 50 మిలియన్ల వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తీర్చిదిద్దడంలో ఆమె విశేషంగా కృషి చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి.. అత్యుత్తమ స్థాయి వైద్య సేవలందించేలా ఆస్పత్రులను తీర్చిదిద్దారు. వైద్యవిద్యకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు సెమినార్లలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రసూతి బోటిక్‌లు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మధుమేహ నియంత్రణ కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ.. ఇలా వైద్యరంగంలో పలు అంశాల్లో ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012–17)లో ప్రజారోగ్యంపై ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలోనూ సభ్యురాలిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డులో సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఆస్ట్రేలియాలోని మ్యాక్క్వారి వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. శశిశేఖర్ వెంపటి.. ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెక్నోక్రాట్.. ఆవిష్కర్త.. కామెంటేటర్.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన ముద్ర వేసుకున్నారు శశిశేఖర్ వెంపటి. ప్రసారభారతికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులైన నాన్ బ్యూరోక్రాట్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు ప్రపంచంలో అతిపెద్ద బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేస్తున్న ప్రసారభారతికి సీఈవోగా చిన్న వయసులోనే ఎంపికై రికార్డు సృష్టించారు. రాజ్యసభ, పార్లమెంట్ టీవీ చానళ్లకు సైతం సీఈవోగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన ‘ఇండియా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్’అన్న అంశంపై విధాన పత్రం రూపొందించారు. ఐఐటీ ముంబైలో విద్యనభ్యసించిన ఆయన రెండు దశాబ్దాల పాటు టెక్నోక్రాట్‌గా సేవలందించారు. సాఫ్ట్వేర్ డిజైన్, రియల్‌టైమ్ ఈవెంట్ మేనేజ్మెంట్, సెన్సార్ నెట్వర్క్ వంటి అంశాల్లో పనిచేశారు. ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసినప్పుడు.. ఆయన నాలుగుసార్లు ఆ సంస్థ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. 2014లో డేటాక్వెస్ట్, పాత్బ్రేకర్ అవార్డులను దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో మోదీ డిజిటల్ క్యాంపెయిన్‌కు విశేషంగా సేవలందించారు. టెస్సీ థామస్.. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ రక్షణ రంగంలో శాస్త్రవేత్త అయిన టెస్సీ థామస్.. ప్రస్తుతం డీఆర్డీవోలో అధునాతన వ్యవస్థల ప్రయోగశాల డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రాజెక్ట్ అండ్ టెక్నాలజీ లీడర్‌గా, మిషన్ డిజైన్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అంశాల్లో కీలకంగా కృషి చేసి.. అనేక మంది యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శనం చేశారు. డీఆర్డీవోలో సమీకృత అభ్యాస వాతావరణం ఏర్పరచడంలో, యువ శాస్త్రవేత్తలకు భరోసా కల్పించడం, వారి మేధస్సుకు పదును పెట్టడంలో, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఐఎన్‌ఏఈ, ఐఈఐ, టీఏఎస్, ఐఈఈఈ, ఏఎస్ఐ, ఏఈఎస్ తదితర ప్రతిష్టాత్మక సాంకేతిక విభాగాల్లో సభ్యురాలిగానూ ఉన్నారు. పలు విశ్వవిద్యాలయాల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డులు పొందారు. 2008లో డీఆర్డీవో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, 2011–12లో డీఆర్డీవో పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్, 2009తో ఇండియాటుడే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2012లో లాల్‌బహదూర్‌శాస్త్రి అవార్డు, 2016లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు సాధించారు. అనురాధ ఆచార్య.. మ్యాప్మీ జోం ఇండియా లిమిటెడ్ సీఈవో జన్యు పరిశోధన నిచేసే జీనోమిక్స్ కంపెనీకి సీఈవోగా ఉన్న అనురాధ ఆచార్య.. తన కంపెనీ ఉత్పత్తులను సుమారు కోట్లాది మందికి చేరువచేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. వ్యక్తిగత జన్యుశాస్త్రం ద్వారా మెరుగైన ఆరోగ్య సంరక్షణ ఎలా సాధించవచ్చన్న విధానాన్ని ఆమె 2013లో దేశంలో పరిచయం చేశారు. రెడ్ హెరింగ్ టాప్–100 ఆసియా మరియు గ్లోబల్–2016, ఈఎన్–ఏబీఎల్‌ఈ స్టార్టప్ అవార్డు–2016, వాల్ స్ట్రీట్ జర్నల్ స్టార్టప్ షోకేస్–2016 ఫైనలిస్ట్, ఈటీ స్టార్టప్ అవార్డ్స్– 2015 తదితర అవార్డులు పొందారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం–2011 సదస్సులో ఆమెను యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో సత్కరించారు. ప్రస్తుతం ఆమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ జీనోమిక్స్, ఐఐఐటీ హైదరాబాద్ పాలకవర్గ సభ్యురాలిగా, బయోటెక్నాలజీ రంగంలో సీఐఐ ఏర్పాటుచేసిన జాతీయ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. -
జీన్యస్!
జన్మపత్రిక.. మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన రాశి, దశ, గ్రహచారాలను చెప్తుంది! జినోమ్‌పత్రి.. మన నోట్లోని సలైవాలోని డీఎన్ఏను బట్టి మన ఆరోగ్యదశను వెల్లడిస్తుంది! ఇది మ్యాప్ మైజీనోమ్ సృష్టి! ఓసిమమ్ బయోసొల్యూషన్స్ అండ్ మ్యాప్ మైజీనోమ్.. ఈ రెండూ స్త్రీ శక్తికి నిదర్శనాలు! ఆమె పేరే అనురాధా ఆచార్య. ఇప్పుడెందుకు ఈ పరిచయం? అంటే.. రేపు 28న హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్‌లో స్పీకర్.. మోడరేటర్‌గా వ్యవహరించబోతున్నారు! అనురాధా ఆచార్య రాజస్థాన్‌లోని బికనీర్‌లో పుట్టారు. తండ్రి ..హెచ్. ఎన్. ఆచార్య సైంటిస్ట్. తల్లి సరళ గృహిణే అయినా పిల్లల మీద చాలా ప్రభావం చూపారు. తల్లి చదువుకుంది ఆరో తరగతే. తొమ్మిదేళ్లకే పెళ్లి. పై చదువులకు అవకాశం లేకపోయినా.. విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు ఎన్నో చదివింది. లెక్కల్లో చాలా చురుకు. ఎంతటి క్లిష్టమైన సమస్యనిచ్చినా నిమిషాల్లో సాల్వ్ చేసేస్తుంది. ఇక తండ్రి అయితే.. చెప్పలేనంత స్ఫూర్తినిచ్చారు అనూరాధకు. సైంటిస్ట్ అవడం వల్లో.. కొత్తవిషయం పట్ల జిజ్ఞాస ఉండడం వల్లో ఏమో కాని.. ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క నిముషం కూడా ఖాళీగా ఉండేవారు కాదట. ఎప్పుడూ ఏవేవో వస్తువులను తయారు చేస్తూ.. కొత్తవాటిని కనుక్కుంటూ కాలాన్ని లక్ష్యపెట్టేవాడేకాదట. బహుశా అనూరాధకు తండ్రి నుంచి జిజ్ఞాస, తల్లి నుంచి ఆ చురుకుదనం జీన్స్ అంది ఉంటాయి. అందుకే ఓసిమమ్ బయోసొల్యూషన్స్ పుట్టి ఉంటుంది. జీనోమ్‌పత్రి రాయాలనే ఆలోచనా వచ్చి ఉంటుంది. ‘‘మా పేరెంట్స్ ఎప్పుడూ చదువు చదువు అని మా మీద ఒత్తిడి పెట్టలేదు. నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవారు– ‘ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకూడదు. శక్తినే నమ్ముకోవాలి. పని ఏదైనా సరే ప్రేమతో చేయాలి. కమిటెడ్‌గా ఉండాలి’ అని. అదే మాలో నాటుకుపోయింది. ఒకరకంగా మా భవిష్యత్‌కు అదే దారైందనుకోవచ్చు. ఆ మాటను మాలోనే కాదు మా అమ్మలో కూడా బలంగా నాటారు నాన్న. ఇప్పుడు ఆయన తోడు లేరు అమ్మకు. అయినా ఆమె బికనీర్‌లో ఒంటరిగా ఉంటోంది తప్ప మా దగ్గరకు రాదు’’ అంటూ నాన్న స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు అనూరాధ. సైన్స్ ... బిజినెస్ ఖరగ్‌పూర్ ఐఐటీ అనూరాధ జీవితంలో ముఖ్యమైంది. దాదాపు ఆమె చదువంతా అక్కడే. అక్కడే ఏంబీఏ చేయాలనుకున్నారు. కాని అమెరికా వెళ్లారు ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేయడానికి. షికాగో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ చేశారు. స్టార్టప్ కూడా అక్కడే స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు వాళ్ల నాన్న చేసే ఇన్వెన్షన్స్లోనూ అనూరాధ పాలుపంచుకునేవారు. ఉత్సాహంతో తానూ కొన్ని వస్తువులను తయారు చేసేవారు. తర్వాత నాన్న అనుమతితో సేల్ చేసేవారట. తయారు చేయడంలో కన్నా కూడా అలా సేల్ చేసి, డబ్బు చేతికందినప్పుడు భలే ఆనందం అనిపించేదట. ‘‘బహుశా బిజినెస్ స్పిరిట్ అప్పుడే మొగ్గతొడిగిందేమో. అమెరికా వెళ్లాక అది దృఢపడింది. సైన్స్ కన్నా కూడా ఆ రంగానికి సంబంధించిన వ్యాపారంలోనే నాకు ఆసక్తి. అందులోనే నైపుణ్యం ఉందని అర్థమైంది అక్కడే’’ అంటారు అనూరాధా. ఈలోపే పెళ్లి, తర్వాత పాప పుట్టడంతో హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్‌లో బిజినెస్ స్టార్ట్ చేయాలని అంతకుముందే అనూరాధా, ఆమె భర్త (సుభాష్ లింగారెడ్డి)కు ఉండడంతో ఇక్కడకు వచ్చేశారు. అలా ఓసిమమ్ బయోసొల్యూషన్స్, మ్యాప్‌మైజీనోమ్‌కు మ్యాప్ వేశారు అనూరాధ! మహిళలే స్ట్రాంగ్... అయినా... బయాలజీలో మొదటి నుంచీ మహిళలే స్ట్రాంగ్. అయితే అందులో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మహిళల సంఖ్య అంతగా లేదు. ‘బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆత్మవిశ్వాసం కావాలి. మగవాళ్లకు ఈజీ. ఎందుకంటే వాళ్లకు సపోర్ట్సిస్టమ్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లే యాక్సెస్ ఉంటుంది. ఈ విషయంలో స్త్రీలు ఎక్కువ కష్టపడాలి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి మనం. స్ట్రాంగ్‌గా లేకపోతే చేయలేకపోతాం. నెట్‌వర్క్‌కు యాక్సెస్ కావాలి. కాపిటల్కు యాక్సెస్ కావాలి. సరైన సలహాదారులు అవసరం. ఇక్కడే విమెన్‌కు చాలెంజెస్ ఉంటాయి. ఈ చాలెంజెస్‌ను అధిగమించగలిగితే చాలు. ఇవన్నీ మగవాళ్లకు ఉండవని కాదు. కాని వాళ్లకు ఉండే సపోర్ట్సిస్టమ్ వీటిని ఈజీ చేస్తుంది. దాదాపు 65 దేశాల్లో మాకు మార్కెట్ ఉంది. ఈ అనుభవంతో చూసినా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మన దగ్గరే చాలా అవకాశాలున్నాయి. అలాగని డిస్క్రిమినేషన్ లేదని అనను. అభివృద్ధి చెందుతున్న దేశం. ఉంటుంది. అలాగని భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లొచ్చు. సవాళ్లను ఎదుర్కొని నిలబడ గలగాలి’’ అంటారు అమె. విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్.. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. చదువుకు ఇల్లాలు ఎంటర్ప్రెన్యూర్ అయితే దేశానికే కలిమి. అందుకే మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వాలి. హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ నినాదం కూడా ఇదే. ‘విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్’! ఈ జీఈఎస్ ఎనిమిదోది. ఇప్పటివరకే ఏ సమ్మిట్‌కు రానంతమంది మహిళలు దీనికి హాజరవుతున్నారు. అందులో మనవాళ్లూ చాలామందే ఉన్నారు. ఈ లెక్కన ఈ సమావేశం మన మహిళలకు ఎంతో ప్రేరణను.. మరెంతో స్ఫూర్తిని.. ఇంకెన్నో వ్యాపార అవకాశాలను ఇవ్వనుందా అని అడిగితే ‘‘తప్పకుండా! ఈ సమ్మిట్‌లో చాలామంది స్పీకర్స్ మహిళలే. ఎన్నో విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా సమ్మిట్స్‌లో ఒక్క మహిళా ఎంట్రప్రెన్యూర్ నూ చూడం. కాని ఇక్కడ సమాన ప్రాతినిధ్యం ఉంది. ఇదే మనకు చాలా హెల్ప్ కానుంది. లైఫ్ సైన్సెస్, హెల్త్ మీదే ఈ సమ్మిట్‌లో ప్రధాన ఫోకస్. కాబట్టి... ఈ అంశాలకు నేచురల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో ఈ సమ్మిట్ నిర్వహించడం వల్ల చాలా ఉపయోగం’’ అన్నారు. ‘‘సైన్స్‌ను ల్యాబ్ నుంచి బిజినెస్‌కు ఎలా తీసుకెళ్లొచ్చు. రియల్ బిజినెస్‌గా ఎలా మార్చవచ్చు అనే అంశం మీద నేను మాట్లాడబోతున్నా. ఆ సెషన్‌కు మోడరేటర్గానూ ఉండబోతున్నా’’నని చెప్పారు అనూరాధ. ‘‘మా కంపెనీలో 80 శాతం మహిళలే. దాన్ని నూరు శాతం విమెన్ పవర్‌గా చేయాలి. మా నాన్న మా భవిష్యత్ ఇలాగే ఉండాలని నిర్దేశించలేదు. ‘నీ నిర్ణయాలు నీవే’ అనేవారు. నేనూ అంతే. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల భవిష్యత్ గురించి నాకు ఎలాంటి యాంబిషన్స్ లేవు. నేనూ వాళ్లను ఒత్తిడి చేయను. నాన్న నాకిచ్చిన స్వేచ్ఛను నేనూ పిల్లలకు ఇస్తున్నాను. ఈ జనరేషన్ అమ్మాయిలక్కూడా నేనొకటే చెప్తాను. ఇష్టంలేని పని చేయొద్దు. ఇష్టమైన పని మీద మనసు పెట్టాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. డోంట్ లూజ్ ప్యాషన్ ఆన్ వర్క్!’’ అంటారు అనూరాధా ఆచార్య. ఓసిమమ్, మ్యాప్ మై జీనోమ్ ఇన్వెన్షన్స్ జీనోమ్‌పత్రి.. టూత్‌బ్రష్ లాంటి పరికరం ఇది. చివుళ్ల మీద రబ్ చేసి దానికి అంటిన సలైవాలోని డీఎన్ఏతో మనకు ఏయే జబ్బులు రావచ్చో, వేటి రిస్క్ ఎక్కువో చెప్పే పరికరం. అలాగే ఇంకో పరికరాన్నీ ఉత్పత్తి చేస్తోందీ సంస్థ. అది క్షయను కనిపెట్టే సాధనం. బేబీ మ్యాప్ – అప్పుడే పుట్టిన పిల్లల డీఎన్ఏను సమీక్షించి భవిష్యత్‌లో రాబోయే 150 రకాల జబ్బులను ముందుగానే నిర్ధారించే పరీక్ష. దీనివల్ల సాధారణ చికిత్సతో జబ్బులు నయం చేసే అవకాశాలు ఉంటాయి. – సరస్వతి రమ -
జీఈఎస్-2017 ఉద్దేశం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా రాజధాని నగరం హైదరాబాద్‌లో ఇపుడు ఎక్కడ చూసినా గ్లోబల్ ఎంట్రపెన్యూయర్‌షిప్ సమ్మిట్ 2017 (జీఈఎస్), ఇవాంకా ట్రంప్ ఫీవరే కనిపిస్తోంది. అటు మహిళలకు పెద్ద పీట వేస్తున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు, ఇటు ఇవాంకా ట్రంప్ సందర్శన. దీంతో ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను ఆగమేఘాల నిర్వహిస్తోంది. ఈ నెల28-30 మధ్య జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూయర్‌షిప్ సమ్మిట్ 2017 (జీఈఎస్)లో ఇవాంకా పాల్గొననున్నారు. అంతేకాదు తొలిసారి దాదాపు సగానికిపైగా (52.5శాతం) మహిళా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇంతకీ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఏ చర్చించబోతున్నారు. ఈ జీఈఎస్ ఉద్దేశం, లక్ష్యాలు ఏమిటి? అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తారు. విరివిగా పెట్టుబడులను ఆకర్షించేందుకు, గ్లోబల్ ఇన్వెస్టర్లను ప్రోత్సాహాన్నివ్వడం, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్ట్ ఆప్ సంస్థలకు ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈజీ బిజినెస్ నిర్వహణలో ప్రభుత్వం అండదండలు, వ్యాపార నైపుణ్యాలను పెంచుకోవడం, వినూత్న ఆలోచనలతో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేలా యువ పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా మహిళలు ప్రోత్సాహాన్నందించడమే ప్రధాన లక్ష్యం. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసురానున్నారు. అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు, సరికొత్త అవకాశాలను సృష్టించేందుకు వేదిక ఈ సమ్మిట్. ఈ నేపథ్యంలో వీరి మధ్య అనుసంధానకర్తగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అమెరికాతో కలిసి నీతి ఆయోగ్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఎనిమిదవ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 127 దేశాలనుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. 10పైగా దేశాలనుంచి మొత్తం మహిళా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడం విశేషం. దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సును జరుగుతుండగా "ఉమెన్ ఫస్ట్, ప్రాస్పర్టీ ఫర్ ఆల్ " అనే అంశం ఈ సదస్సులో హైలైట్‌గా నిలవనున్న సంగతి తెలిసిందే. -
ఇవాంకాకు పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్
భూదాన్ పోచంపల్లి (భువనగిరి): హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్ బహూకరించనున్నట్లు తెలిసింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి చేనేత కుర్తా, పైజామా బహుమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు కూడా పోచంపల్లి వస్త్రాలు బహూకరించాలని.. తద్వారా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి, ప్రాచుర్యం వస్తుందని సర్కారు భావిస్తోంది. మూడు రోజులపాటు జరిగే సదస్సులో పాల్గొనే 200 మంది మహిళా వలంటీర్లు పోచంపల్లి కాటన్ మస్రస్ చీరలు ధరించనున్నారు. ఇందుకోసం పోచంపల్లిలో 200 ‘టెస్కో’రకం పట్టుచీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు. జీఈఎస్ అతిథులకు అమెరికా తేనీటి విందు 30న నోవాటెల్‌లో.. సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు వచ్చే అతిథులకు అమెరికా ప్రభుత్వం తరఫున స్థానిక యూఎస్ కాన్సులేట్ అధికారులు తేనేటి విందు ఇవ్వనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం నోవాటెల్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అమెరికా గురించి ప్రజెంటేషన్ కూడా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఈ నెల 28న చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, 29న రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే.