
సాక్షి, హైదరాబాద్ : టీఎస్- ఐపాస్ (నూతన పారిశ్రామిక విధానం)తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు. జీఈఎస్ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఇప్పటివరకూ 5,469 యూనిట్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు.
‘ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్’లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా పుంజుకుంటోందని, టీ హబ్ ద్వారా ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ అన్నిరకాల అనుకూలమైన ప్రాంతం అని అన్నారు. అమెరికాలో అయిదు ముఖ్యమైన కంపెనీల బ్రాంచ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. జీఈఎస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment