
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ పర్యటన ముగించుకుని ట్రెడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఎక్కిన ఇవాంకా బృందం అమెరికాకు బయలుదేరింది. ఆమె పర్యటనలో రెండో రోజైన బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్‌లో ఆమె ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్ హోటల్లో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం దాదాపు ఆరు గంటల ప్రాంతంలో హోటల్ ఖాళీ చేసిన ఇవాంకా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా ప్రయాణించి ఇవాంకా సహా ఇతర అమెరికా ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బంది అమెరికాకు చేరుకుంటారు. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు వచ్చిన ఇవాంకా తన తొలిరోజు పర్యటనలో భాగంగా ప్రపంచ పారిశ్రామిక సదస్సులో పాల్గొన్నారు. అదేరోజు రాత్రి ప్రసిద్ధ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర కీలక వ్యక్తులతో కలిసి డిన్నర్ చేశారు ఇవాంకా. తిరిగి రాత్రి ట్రెడెంట్ హోటల్‌కు చేరుకున్న ఇవాంకా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment