
శంషాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. సోమవారం వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఉద్యోగులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. మన సంప్రదాయ స్వాగతం విదేశీ ప్రతినిధులకు ఆకట్టుకుంది. కొందరు విదేశీ ప్రతినిధులకు నగరంలోని హోటళ్లలో బస ఏర్పాటు చేయగా.. మరికొందరికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలోని నోవాటెల్ హోటల్‌లో వసతి కల్పించారు.
హోటల్ వరకు వీరిని తీసుకెళ్లడానికి ఆర్టీసీ ప్రత్యేకంగా 50 ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. గతంలో ఆర్డర్ ఇచ్చిన 21 కొత్త బస్సులు ఈ సదస్సు సమయానికి వచ్చేలా ప్లాన్ చేసిన అధికారులు వాటితోపాటు మరో 49 వినియోగంలో ఉన్న గరుడ ప్లస్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం విమానాశ్రయం వద్ద వీటిని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment