
సాక్షి, హైదరాబాద్ : హైదారాబాద్‌లో జరుగుతున్న గ్లోబెల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమావేశం(జీఈఎస్)పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ కుమార్తె ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇవాంక ట్రంప్ పాల్గొనే ఈ సమాశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే ఖచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమయినట్లు తెలంగాణ పోలీస్ అధికారి ఒకరు చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది.
హైదరాబాద్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశముందనే హెచ్చరికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాలు 200 మంది అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి సలహాదారు హోదాలో జీఈఎస్ సమావేశానికి ఇవాంక ట్రంప్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు అమెరికా సీక్రెట్ సర్వీసెస్ భద్రత ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీకి ఎస్పీజీ భద్రత కల్పిస్తోంది. తర్వాతి లేయర్‌లో తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రేహౌండ్స్, అక్టోపస్ దళాలతో కూడా జీఈఎస్‌కు భద్రత కల్పించనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment