సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహణకు సంబంధించి ప్రతినిధులకు గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసినందుకు కేంద్ర పురావస్తు శాఖకు, ప్రతినిధులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులు వాడుకున్నందుకు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించింది. కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. అద్దె చెల్లిస్తేగాని గోల్కొండ కోటను విందుకు వాడుకోవటానికి వీల్లేదని కేంద్ర పురావస్తుశాఖ చెప్పటంతోపాటు, కొంత మొత్తం నష్టపరిహారం రూపంలో అడ్వా న్సుగా చెల్లించాలని కూడా కోరింది. ఏ రూపంలోనైనా కట్టడంలోని భాగాలు దెబ్బ తింటే ఆ మొత్తాన్ని మరమ్మతు చేయించేం దుకు అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఇలా షరతులతో కూడిన అనుమతి మంజూరైంది. బుధవారం రాత్రి సదస్సు ప్రతినిధులకు విందు ఇచ్చినందుకు రూ.50 వేలను రాష్ట్రప్రభుత్వం అద్దెగా చెల్లించింది.
ఆర్టీసీకి కూడా...
ఇక ప్రతినిధులను విమానాశ్రయం నుంచి హోటల్ గదులకు, హెచ్‌ఐసీసీకి, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోటకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను విని యోగిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ బస్సులు సదస్సుకే పరిమితం కావటంతో ప్రయాణికులను తరలించే విధులకు దూరమయ్యాయి. ఆర్టీసీకి ఆమేర నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం వాటికి అద్దె చెల్లిం చేందుకు సిద్ధమైంది. ఈ మూడు రోజులకు కలిపి రూ.కోటి అద్దె చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment