కుండీలను తరలిస్తున్న సిబ్బంది(ఫైల్)
హైదరాబాద్: ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా రోడ్లపై ఏర్పాటుచేసిన అందమైన పూల మొక్కల కుండీలు మాయమయ్యాయి. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏనుగు, హంస, గుడ్లగూబ, జింక రూపంలో ఉన్న మొత్తం 58 ఫైబర్ పూల కుండీలు చోరీకి గురయ్యాయని ఎస్‌ఐ రాజేంద్ర తెలిపారు. హెచ్‌ఐసీసీ గేట్ వద్ద వర్టికల్ గార్డెన్స్‌లో ఉంచిన 80 వేల చిన్న సైజు పూల కుండీల్లో 5 వేల పూల కుండీలు కూడా మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment