
1.జీఈఎస్‌లో సాంస్కృతిక ప్రదర్శన, 2. మెట్రో రైల్లో ప్రధాని మోదీ, 3.జీఈఎస్ ప్రారంభోత్సవంలో ఇవాంకా ట్రంప్
ఒకేరోజు మహత్తర ఘట్టాలు.. ఓవైపు కలల మెట్రో పట్టాలెక్కితే.. మరోవైపు అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది! మధ్యాహ్నం వేళ మియాపూర్‌లో మెట్రో పరుగులు పెడితే.. సాయంత్రం వేళ హైటెక్స్‌లో జరిగిన జీఈఎస్‌లో భావి ప్రపంచ స్వాప్నికుల కొత్త ఆలోచనలు ఆవిష్కృతమయ్యాయి!! ఇక రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో హైదరాబాదీ ఘుమఘుమలు అతిథుల నోరూరించాయి. మొత్తంగా మంగళవారం నగరమంతా వీవీఐపీలు, విదేశీ ప్రతినిధులతో కళకళలాడింది. మెట్రో రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా.. జీఈఎస్‌లో అమెరికా అధ్యక్షుడి తనయ ఇవాంక తళుక్కుమంది!!
మహిళతోనే మార్పు : ఇవాంకా (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మహిళతోనే మార్పు సాధ్యమని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ఉద్ఘాటించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని, సమాజంపై దాని ప్రభావం ఎన్నో రెట్లు ఉంటుందని చెప్పారు. మహిళలు తమ సంపాదనను తిరిగి తమ కుటుంబాలు, సంబంధీకులపైనే ఇన్వెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.
మహిళ మాకు ఆది'శక్తి' : ప్రధాని మోదీ (ఇక్కడ క్లిక్)
భారతీయ పురాణాల్లో మహిళను శక్తి అవతారంగా అభివర్ణించారని, సమాజాభివృద్ధికి మహిళా సాధికారత అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలోని నాలుగు అత్యంత పురాతనమైన హైకోర్టులకుగాను మూడింటికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారని, అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన యాత్రలోనూ మహిళల పాత్రే ప్రధానమని, క్రీడల్లోనూ మహిళలే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మంగళ వారమిక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు.
పెట్టుబడులకు స్వర్గధామం : సీఎం కేసీఆర్ (క్లిక్ హియర్)
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని.. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహించి, ఈ విషయాన్ని చాటి చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్–2017) ప్రారంభోత్సవంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. అందమైన హైదరాబాద్ ఆతిథ్యాన్ని స్వీకరించాలని.. ఇక్కడి బిర్యానీ రుచిని ఆస్వాదించాలని కోరారు.
ఫలక్‌నుమ ప్యాలెస్‌లో గ్రాండ్ డిన్నర్ (క్లిక్ చేయండి)
జీఈఎస్ సదస్సుకు హాజరైన విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పసందైన విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీతోపాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సదస్సుకు వచ్చిన అమెరికన్ డెలిగేట్లు, రతన్ టాటా, ముఖేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, ఆది గోద్రెజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment