ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు.. ఇవాంకా ట్రంప్.. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఈ పదాలే వినిపిస్తున్నాయి. జీఈఎస్ కోసం వచ్చే అతిథులను ఆకట్టుకునేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు, ఇవాంకా కోసం చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్ల గురించే ఏ నలుగురు పోగైనా చర్చలు సాగుతున్నాయి. సదస్సు జరిగే హైటెక్స్‌లో, అతిథులు పర్యటించే మార్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అంతా అబ్బో అనుకుంటున్నారు.