
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ సమ్మిట్(జీఈఎస్)కు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు తరలివచ్చారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరవ్వడం హర్షణీయమని బ్రాహ్మణి అన్నారు. బ్రాండ్ హైదరాబాద్ పురోగతికి సదస్సు ఉపకరిస్తుందని ఆకాంక్షించారు.
మహిళల్లో వ్యాపారవేత్తలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. తను వెంచర్ కాపిటలిస్టుగా ఉన్నానని, ఎన్నో కంపెనీలకు నిధులు అందిస్తున్నానని చెప్పారు. అన్నింటిల్లోను మహిళదే ప్రధానపాత్ర అన్నారు.
హైదరాబాద్ జీఈఎస్‌కు ఆతిథ‍్యం ఇవ్వడం స్వాగతించదగినదని అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసనా అన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణించేందుకు సదస్సు మార్గనిర్ధేశం చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment